వాషింగ్టన్: ఉత్తరార్థగోళంలోని బెన్ను గ్రహశకలంలోని అగ్ని పర్వత ప్రాంతమైన నైటింగేల్‌కు 620 మీటర్ల దూరంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఓస్రిస్ రెక్స్ అంతరిక్ష నౌక విహరించింది. నౌక తన 1.2 కిలోమీటర్ల కక్ష్యను వదిలేసి 11 గంటల పాటు ఆస్ట రా యిడ్ చుట్టూ తిరిగిందని అమెరికాలోని గోడార్డ్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్‌లోని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. వచ్చే ఆగస్టులో అంతరిక్ష నౌక నైటింగేల్ ప్రాంతం నుంచి న మూనాలను సేకరించనుంది. ఈ అంతరిక్ష నౌక 250 మీటర్ల దగ్గరగా రెండుసార్లు ఆస్టరాయిడ్ చుట్టూ తిరుగు తుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment