ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
కీసర(మేడ్చల్): మేడ్చల్ జిల్లా కీసర మండలం పెద్దమ్మచెరువులో దూకి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మోర రవికాంత్ కుమారుడు ఆదిత్య(22) ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల లో సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం కళాశాలకు వెళ్లిన ఆదిత్య తిరిగి ఇంటికి రాలేదు. అతని కోసం గాలించగా మంగళవారం ఉదయం పెద్దమ్మ చెరువులో శవమై కనిపించాడు.
పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి మేడ్చల్ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కుమారుడి అకాల మరణంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న రవికాంత్‌ను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఓదార్చారు.