ఓయూలో 415 అధ్యాపక ఉద్యోగాల భర్తీ
హైదరాబాద్: ఓయూలో ఖాళీగా ఉన్న 415 అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వీసీ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు.చేయనున్నట్లు వీసీ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల కోసం ప్రభుత్వ అనుమతికి లేఖ రాసినట్లు చెప్పారు. జూలై రెండో వారం వరకు అనుమతి లభిస్తే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఆయా విభాగాల్లో దరఖాస్తుల సంఖ్యను బట్టి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఓయూలో ఆగస్టు 17, 18, 19 తేదీల్లో న్యాక్ బృందం పర్యటించనున్నట్లు చెప్పారు. న్యాక్ ఏ– ప్లస్... ప్లస్ గుర్తింపు కోసం కృషి చేస్తున్నామని వివరించారు.