our country
-
సమాధానాలు
మన దేశం గురించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవీ.. 1. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో, తెలుపు రంగులో మధ్యగా 24 ఆకుల నీలిరంగు ధర్మచక్రంతో (అశోక చక్రం) భారత జాతీయ పతాకాన్ని రూపొందించుకున్నాం. దీనిని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించారు. 2. బోర్లించినట్టు ఉండే కమలం మీద నిర్మించిన నాలుగు సింహాల శిల్పంలో కింద మకలం భాగాన్ని వదిలేసి, మిగిలిన భాగాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించారు. దాని కింద ‘సత్యమేవ జయతే’ (సత్యమే జయిస్తుంది) అని దేవనాగర లిపిలో రాయించారు. మాధవ్ సాహ్ని దీనిని జాతీయ చిహ్నంగా ఎంపిక చేశారు. 3. మొత్తం నాలుగు రకాల జంతువులు మన జాతీయ చిహ్నం మీద కనిపిస్తాయి. పైన కనిపించే నాలుగు సింహాలు ఆసియాటిక్ లయన్స్. ఈ నాలుగు సింహం తలలు నాలుగు గుణాలకు ప్రతీకలు. అవి- శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం. ఇంకా, మన ధర్మచక్రం మీద బలిష్టమైన ఎద్దు, పరుగులు తీస్తున్న గుర్రం, ఏనుగు, సింహం బొమ్మలు ఉంటాయి. ఇవి నాలుగు దిక్కులను చూస్తున్నట్లు ఉంటాయి. జనవరి 26, 1950న దీనిని జాతీయ చిహ్నంగా భారతదేశం అలంకరించుకుంది. 4. మన జాతీయ నది గంగానది. దీన్ని నవంబర్ 5, 2008న జాతీయ నదిగా ప్రకటించారు. 5. ‘భారతదేశము నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు..’ అంటూ సాగే ప్రతిజ్ఞను తొలిసారి 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో పిల్లల చేత చదివించారు. దీనిని రచించిన వారు పైడిమర్రి వెంకట సుబ్బారావు. నల్లగొండ జిల్లా అన్నేపర్తికి చెందిన వెంకట సుబ్బారావు బహుభాషావేత్త. విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారుచేశారు. జనవరి 26, 1965 నుంచి దీనిని దేశమంతా చదువుతున్నారు. 6. బెంగాల్ టైగర్ మన జాతీయ మృగం. ఇది శక్తి సామర్థ్యాలకు ప్రతీక. గంగానదిలో కనిపించే మంచినీటి డాల్ఫిన్‌ను జాతీయ నీటి జంతువుగా పేర్కొంటారు. 1963లో నెమలి భారతీయుల జాతీయ పక్షి అయింది. 7. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరమ్ మన జాతీయ గేయం. ఇది చాలా పెద్దది కావడంతో మొదటి రెండు చరణాలను 1950లో భారత ప్రభుత్వం జాతీయ గేయం (సాంగ్)గా స్వీకరించింది. ఇక సాహిత్య నోబెల్ అందుకున్న ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ టాగూర్ రాసిన గీతం జనగణమన. 1919లో టాగూర్ తెలుగు ప్రాంతంలోని మదనపల్లెకు (చిత్తూరు జిల్లా) రావడంతో ఆ గీతానికి బాణీ కట్టే సందర్భం వచ్చింది. 52 సెకన్లు పాడుకునే ఈ గీతాన్నే జనవరి 24, 1950లో జాతీయ గీతంగా మన ప్రభుత్వం ప్రకటించింది. 8. మన జాతీయ క్రీడ.. హాకీ కాదు. అసలు మనకు జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు. courtesy: Dr. Goparaju Narayana Rao -
మన దేశం గురించి మీకేం తెలుసు?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. శుక్రవారం 68వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్నాం. అయితే.. అసలు మన దేశం గురించిన విషయాలు మీకు ఎంతవరకు తెలుసు? ఏవేం తెలుసు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ సందర్భంగా ఒక చిన్న పరీక్షపెట్టుకుందామా.. పదండి మరి. 1) జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరు? 2) మన జాతీయ చిహ్నం ఏమిటి? దాన్ని ఎంపిక చేసింది ఎవరు? 3) మన జాతీయ చిహ్నం మీద ఎన్ని జంతువులు ఉంటాయి? 4) మన జాతీయ నది ఏది? అది ఎప్పటినుంచి అమలులోకి వచ్చింది? 5) భారతదేశం నా మాతృభూమి.. అనే ప్రతిజ్ఞను రాసినవారు ఎవరు? 6) మన జాతీయ మృగం ఏది, జాతీయ నీటి జంతువు, జాతీయ పక్షి ఏవి? 7) మన జాతీయ గేయం ఏది.. జాతీయ గీతం ఏది? 8) మన జాతీయ క్రీడ ఏది? సమాధానాలు ఇక్కడ చూడండి -
మాటలతో బాట వేసుకుంది!
స్ఫూర్తి మనసులో ఉన్నది చెప్పేందుకు మాట్లాడటం వేరు... మనసులను తాకేట్టుగా మాట్లాడటం వేరు. ఆ కళ, అలా మాట్లాడే తెగువ అందరికీ ఉండవు. కానీ రచనకు ఉన్నాయి. అందుకే ఆమె మాటలతోనే బాట వేసుకుంది. తన మాటలనే అస్త్రాలుగా మార్చి సమస్యలపై ఎక్కుపెడుతోంది. ఎందరి ఆలోచనలకో పదునుపెడుతోంది. మన దేశం ముందుకెళ్తోందని చాలామంది అంటూంటారు కానీ... వెనకబడిన ప్రాంతాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లాంటి అతి పెద్ద రాష్ట్రంలో ఉన్న పలు చిన్ని చిన్ని గ్రామాల్లో అభివృద్ధి అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. వసతులు ఉండవు. ఆధునికత అన్నమాటకు నిర్వచనం కూడా తెలియదు వారికి. అలాంటిచోట పుట్టిన అమ్మాయి రచన. ఆడపిల్లలు గడపదాటి బయటకు వెళ్లకూడదు, అందరూ వినేలా మాట్లాడకూడదు లాంటి కట్టుబాట్ల మధ్య నలిగిపోయిందామె. ఆడపిల్ల అంటే ఇక ఇంతేనా, నోరు విప్పి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అనుకునేది. ఆడపిల్ల అంటే ఏంటో మాటలతోనే అందరికీ చెప్పాలని తహతహలాడేది. ఆ తపనే ఆమెను రేడియో జాకీని చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ జిల్లాలో ఎనభైకి పైగా గ్రామాలున్నాయి. అక్కడి పరిస్థితులను మార్చేందుకు జిల్లా మెజిస్ట్రేట్ రణవీర్ ప్రసాద్ ఓ సరికొత్త ప్రణాళిక వేశారు. పలు సమస్యల మీద అవగాహన కల్పించేందుకు ‘లలిత్ లోక్వాణి’ పేరుతో ఓ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ని స్థాపించారు. అందులో పనిచేయడానికి రావాలని, మహిళల సమస్యలపై గళం విప్పాలని ఆహ్వానించారు. కానీ ఏ ఒక్కరూ వెళ్లేందుకు ధైర్యం చేయలేదు... రచన తప్ప. ఇంట్లోవాళ్లు కాదన్నా, కట్టడి చేయాలని ప్రయత్నించినా ఆగలేదామె. ఇంటి గడప దాటి రేడియో స్టేషన్ గడపలో అడుగుపెట్టింది. మాట్లాడవద్దన్నవాళ్లందరినీ తన మాటలతో ముగ్ధుల్ని చేయడం మొదలుపెట్టింది. ఆమెను చూసి పలువురు అమ్మాయిలు స్ఫూర్తి పొందారు. తామూ జాకీలుగా పనిచేస్తామంటూ వెళ్లారు. ఇప్పుడు ఆ రేడియో స్టేషన్లో చాలామంది మహిళా జాకీలు ఉన్నారు. తమ జిల్లాలోని పలు సమస్యల గురించి వివరిస్తూ అందరినీ చైతన్యవంతుల్ని చేస్తున్నారు. -
విదేశాల్లో రియల్ ఇండియా!
కిచిడీ మనదేశం పేదది అని మన వాళ్లు కొందరు అంటున్నారు గాని విదేశీయులు ఎవరూ అలా అనుకోవడం లేదట. అమెరికాలో అయితే గత ఏడాది టాప్-5 ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ బయ్యర్స్‌లో ఇండియా కూడా ఒకటి! ప్రపంచంలోనే ఖరీదైన ప్రాంతాలుగా భావించే లండన్‌లోని కెన్సింగ్స్టన్, బెల్గ్రేవియా, హాలండ్ పార్క్, దుబాయ్‌లోని బుర్జ్ దుబాయ్, సింగపూర్‌లోని నాసిమ్ రోడ్లలో ఇండియన్ బిలియనీర్లు సులువుగా ఆస్తులు కొనేస్తున్నారు. ఇవి ప్రపంచంలో రియల్టర్లకు ఫ్యాన్సీ ప్రదేశాలు. ఇలాంటి చోట ఇళ్లు కొనడాన్ని భారతీయులు ఒక హోదాగా భావిస్తున్నారట. ఇంకా వీటితో పాటు లాస్ ఏంజెల్స్, మియామి (అమెరికా), రోమ్ (ఇటలీ), టోక్యో(జపాన్), మెల్బోర్న్, సిడ్నీ (ఆస్ట్రేలియా) నగరాల్లోనూ ఈ బిలియనీర్లు ఇళ్లు కొంటున్నారు. ఆఫీసు పని ఈజీ మనం ఎన్నో వెబ్సైట్లు ఓపెన్ చేస్తుంటాం. కానీ మనం రోజూ వినే పదాలతో వెబ్సైట్లు ఏమున్నాయో ఎప్పుడైనా చూశారా? గాడ్.కాం, మ్యాన్.కాం, విమెన్, ట్రీ, లవ్, ఆఫీస్... ఇలాగ వీటిని చాలా మంది జీవితంలో ఒక్కసారి కూడా ఓపెన్ చేసి ఉండరు. అలాంటి పదాల్లో ఒకటి మనం రోజూ వినే ‘ఆఫీస్’. మీరెప్పుడైనా ఆఫీస్.కాంలోకి వెళ్లారా? ఇది మైక్రోసాఫ్ట్ వారి వెబ్సైట్. ఇందులో మీరు ఆఫీసుకు సంబంధించిన పేపర్ వర్క్‌లకు అవసరమైన టెంప్లెట్లు, క్లిప్ఆర్ట్లు, ఇమేజ్‌లు ఉంటాయి. సో... ఇక నుంచి గూగుల్‌లో గంటల తరబడి వెతక్కుండా మీకు కావలసిన దానికోసం నేరుగా ఈ ఆఫీస్.కామ్‌కు వెళ్లండి.