outdoor games
-
ఆన్లైన్.. మ్యూజిక్!
ఖాళీసమయాల్లో ఏం చేస్తారు..? ఈ ప్రశ్న అడగ్గానే చాలా మంది నేటి తరం యువత చెప్పే సమాధానం ఒకటే.. అది ఆన్లైన్లో గడిపేయడం.. ఇది అక్షరాలా సత్యం. ఇదే విషయాన్ని యువ్‌గవ్–మింట్ మిలీనియల్ సర్వే చెబుతోంది. నగర యువతీ యువకులపై జరిపిన అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. నగరాల్లో సగానికి పైగా యువతీయువకులు ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియాతో సేదదీరుతున్నారు.. ప్రతి వారందొరికిన ఖాళీ సమయంలో కనీసం 4గంటలు సోషల్ మీడియాలోనో.. నెట్‌లోనో మునిగిపోతున్నారట. ఔట్‌డోర్ గేమ్స్ లేదా జిమ్/జాగింగ్/యోగ తదితర ఫిట్నెస్ కార్యకలాపాల కంటే ఆన్‌లైన్‌కే యువత అధిక ప్రాధాన్యంఇస్తున్నట్లు స్పష్టమైంది. 1981–96 మధ్య పుట్టిన(22–37 వయోశ్రేణిని మిలీనియల్స్‌గా వ్యవహరిస్తారు) 1996 తర్వాత పుట్టిన (వీరిని జనరేషన్ జడ్/జన్ జర్స్ అంటారు) యువత జీవన శైలిపై ఈ సర్వేలో పరిశీలన జరిపారు. 180 నగరాలపై జరిపిన ఈ ఆన్లైన్ సర్వే ప్రకారం– వారంలో కనీసం ఒక గంటైనా ఔట్‌డోర్ ఫిటినెస్ వ్యాపకాల్లో గడిపే యువత సగానికంటే తక్కువే.. అయితే కళలతో పోల్చుకున్నప్పుడు ఆటలు/ఫిట్నెస్ కార్యకలాపాలకు వీరు ప్రాధాన్యంఇస్తున్నారు. ఖాళీ సమయంలో చదువుకోవడానికి ఈ రెండు గ్రూపుల యువతీ యువకులూ ఆసక్తి కనబరుస్తున్నారు. 58శాతం మంది ప్రతి రోజూ చదువుకుంటామని చెబుతున్నారు.వినోదం కోసం ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్న యువత సంఖ్య పెరుగుతోంది. ‘జన్ జర్స్’లో అత్యధికులు కేబుల్ టీవీ చూసేందుకు ఇష్టపడట్లేదు. నెట్‌ఫ్లిక్స్ లేదా హాట్‌స్టార్ వంటి వాటిపై ఆసక్తిగా ఉన్నారు. మిలీనియల్స్, జన్ జర్స్లో 15 శాతం మంది మాత్రమే రోజూ ఏదో ఒక సంగీత వాయిద్యంతో సేదదీరుతున్నారట.. 20 శాతం మందే కళల మధ్య గడుపుతున్నారట. ఆదాయం ఉంటేనే అభిరుచి.. ఉద్యోగాలు చేస్తున్న యువతీ యువకుల్లో ఏదో ఒక అభిరుచి (కళలు, ఫొటోగ్రఫీ,వంటపని, తోటపని, సంగీతం) ఉన్నవారు 63 శాతం మంది. విద్యార్థుల్లో 54 శాతం మంది ఈ అభిరుచులకు సమయంకేటాయిస్తున్నారు. అభిరుచులను, సరదాలను కుటుంబ ఆదాయం కొంతమేరకు ప్రభావితం చేస్తోంది. ఇతరులతో పోల్చుకుంటే.. సంపన్న కుటుంబాలకు చెందిన యువతీయువకులు తమ అభిరుచులకు మరింత సమయం వెచ్చించగలుగుతున్నారు. రూ.20 వేలు సంపాదిస్తున్న వారిలో 45 శాతం మంది, రూ. 20–50 వేలు సంపాదిస్తున్న వారిలో 40 శాతం మంది తమ అభిరుచుల మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. రూ.50వేలకు పైగా సంపాదించే యువతీయువకుల్లో 33 శాతం మినహా మిగిలిన వారు అభిరుచులను ఆస్వాదిస్తున్నారు. తోటపని వంటి కళల మధ్య గడుపుతున్న వారిలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ. -
సూపర్ సూట్‌తో మీ పిల్లలు ఫిట్
న్యూఢిల్లీ: టీవీల్లో కార్టూన్ సీరియళ్లు, మొబైల్స్‌లో వీడియో గేమ్స్ అంటూ స్క్రీన్లకు అతుక్కుపోయే పిల్లలు శారీరకంగా ఎంతగా బలహీనంగా తయారవుతున్నారో తెలిసిందే. కారణం శరీరాన్ని ఉత్తేజంగా, శక్తిమంతంగా ఉంచే అవుట్డోర్ గేమ్స్‌కు వారు దూరం కావడమే. అయితే ఈ సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉందంటోంది అమెరికాకు చెందిన ఓ గేమ్స్ డిజైన్ సంస్థ. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ సూపర్ సూట్‌ను తయారు చేశామని, ఇది పిల్లలకు అవుట్డోర్ గేమ్స్‌పై ఆసక్తి పెంచడమే కాకుండా ఫిట్నెస్గా తయారు చేస్తుందని చెబుతున్నారు. ఈ సూట్ ధరించిన పిల్లల ఫిట్నెస్ ఎంతో తల్లిదండ్రులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా తెలుసుకునేలా ఓ యాప్‌ను కూడా రూపొందించామని తయారీదారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనిని మార్కెట్లోకి విడుదల చేస్తామని, పిల్లలంతా అవుట్డోర్ గేమ్స్‌ను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తోంది. -
ఆత్మవిశ్వాసానికి... దారి ఇది!
ఆత్మవిశ్వాసం తోడుంటే అపజయాన్ని ఎదుర్కొనే బలమైన ఆయుధం మన చేతిలో ఉన్నట్లే. అన్నీ ఉన్నా... ఆత్మవిశ్వాసం లేకపోతే విజయం సిద్ధించదు. ఆత్మవిశ్వాసాన్ని మీలో ప్రోది చేసుకోవడానికి అవసరమైన కొన్ని విషయాలు... ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మన ఆలోచన మీదే మన అడుగు ఆధారపడి ఉంటుంది. ప్రతి విషయాన్నీ ప్రతికూలంగా ఆలోచిస్తే, పడే అడుగు సరియైన మార్గంలో పడదు. మీకు మీరుగా సొంత నియమాలు రూపొందించుకోండి. వాటిని పాటించండి. అంతే తప్ప, ఆ నియమాలను బ్రేక్ చేసే ప్రయత్నం చేయకండి. చదువుకు సంబంధించి ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వండి. కాలాన్ని వృథా చేయకండి. ఉత్తేజపరిచే జీవితచరిత్రలను చదవండి. మిమ్మల్ని ఆకట్టుకున్న వాక్యాలను పేపర్‌పై పెద్ద అక్షరాలలో రాసి గోడకు అంటించండి. వాటిని చదివినప్పుడల్లా ఒక కొత్త శక్తి వస్తుంది. ఎప్పుడూ నిరాశగా ఉండే వాళ్లతో, నిరాశగా మాట్లాడే వాళ్లతో కాకుండా చురుగ్గా ఉండేవాళ్లు, నాలుగు విషయాలు తెలిసినవాళ్లతో స్నేహం చేయండి. గెలుపే అంతిమం కాదు... దాని తరువాత ఓటమి రావచ్చు. ఓటమే అంతిమం కాదు... దాని తరువాత గెలుపు కూడా వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఓటమికి భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న బలాలనూ, బలహీనతలనూ గుర్తించండి. బలాల్ని మరింత మెరుగుపరుచుకోండి. బలహీనతలను సరిదిద్దుకోండి. ఔట్‌డోర్ గేమ్స్ ఆడండి. దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. మిమ్మల్ని మీరు విజయం దిశగా ప్రేరేపించుకోండి. ఉత్తేజాన్నీ, ప్రేరణనూ నింపే ఉపన్యాసాలను వినండి.