Ovaries
-
చిక్కే....‘సిస్ట్’ర్స్... జాగ్రత్త!
మహిళల్లో సాధారణంగా గర్భసంచి పక్కనే ఉండే ఓవరీస్‌లో లేదా వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాల్లో... రకరకాల సిస్ట్లు కనిపిస్తుంటాయి. సిస్ట్ అంటే నీరు లేదా నీటి వంటి ద్రవపదార్థంతో నిండి ఉన్న సంచి అని అర్థం. మహిళల్లో ఇలా సిస్ట్లు కనిపించడం మామూలే. సాధారణంగా కనిపించే కొన్ని రకాల సిస్ట్ల గురించి ప్రాథమిక అవగాహన కోసం... ఈ కథనం. ఫాలిక్యులర్ సిస్ట్: అండం విడుదల సమయంలో కనపించే సిస్ట్ ఇది. పీరియడ్స్ తరువాత ఐదు లేదా ఆరు రోజుల నుంచి క్రమంగా సైజ్ పెరుగుతూ ΄ోతుంది. సాధారణంగా 2 నుంచి 2.2 సెం.మీ. సైజ్‌కు చేరాక... మహిళల్లో అండం విడుదల జరిగాక కనుమరుగవుతుంది. కార్పస్ ల్యుటియల్ సిస్ట్: అండం విడుదలైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే... ఆ పిండాన్ని స΄ోర్టు చేయడానికి ఏర్పడే సిస్ట్ ఇది. సాధారణంగా ఈ సిస్ట్లు వాటంతట అవే కనుమరుగవుతాయి.ఎండోమెట్రియల్ సిస్ట్: రక్తంతో నిండి ఉండే ఈ సిస్ట్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో కనపడుతుంది. ఈ సిస్ట్లు తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి. ఇవి క్రమంగా పెద్దదై కొన్నిసార్లు పలిగి΄ోయే అవకాశం ఉన్నందున ఇటువంటి సిస్ట్‌లను ఇంజక్షన్ ద్వారా తాత్కాలికంగా పెరగకుండా చేయడంగానీ లేదా సర్జరీ ద్వారా తీసేవేయడం కానీ చేస్తుంటారు. ఇలా చేయాల్సిన అవసరమూ ఉంటుంది. ఇన్ఫెక్టెడ్ సిస్ట్: ఓవరీస్‌లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ట్యూబ్‌తో కలిసి ట్యూబో–ఒవేరియన్ సిస్ట్ల పెల్విస్ ఇన్ఫెక్షన్స్లో సాధారణంగా ఇది కనిపిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ : సాధారణంగా ప్రతినెలా 20 నుంచి 30 ఫాలికల్స్ ఓవరీస్‌లో పెరగడం ప్రారంభిస్తాయి. వీటన్నింటిలో అత్యంత అనువుగా ఉన్న ఫాలికల్ మాత్రమే అండంగా మారుతుంది. అది... మిగిలిన వాటికన్నా మరింత వేగంగా పెరిగి... పీరియడ్స్ వచ్చిన 12–16 రోజుల మధ్యలో విడుదల అవుతుంది. ఇక మిగిలిన ఫాలికల్స్ అన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. కాని ఊబకాయం, హార్మోన్ల అసమతౌల్యత ఉన్న మహిళల్లో ఆ ఫాలికల్స్ అన్నీ ఒకే సైజ్ వరకు పెరుగుతాయిగానీ, ఏ ఒక్కటీ అండంగా మారదు. అలా పెరిగిపోయిన ఈ సిస్ట్ల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాక΄ోవడం, బరువు మరింతగా పెరగడం, అవాంఛిత రోమాలు రావడం జరగవచ్చు. స్కానింగ్ చేసి చూసినప్పుడు ఈ ఫాలికల్స్ అన్నీ చిన్న చిన్న నీటి బుడగల్లాగా కనపడతాయి. వీటినే డాక్టర్లు పాలిసిస్టిక్ ఓవరీస్’గా చెబుతారు. ఈ సమస్యను మందులతో, జీవనశైలి మార్పులతో తగ్గించడం సాధ్యమవుతుంది. సీరస్ లేదా మ్యూసినస్ సిస్ట్ : ఇవి కూడా ఓవరీస్‌లో సాధారణంగా కనిపించే సిస్ట్లే. నలభై ఏళ్లకు పైబడినవారిలో కనిపిస్తుంది. సైజును బట్టి చికిత్స నిర్ణయిస్తారు.చాలావరకు వాటంతట అవి తగ్గిపోయేవే... ఇన్ని రకాల సిస్ట్లు ఉన్నా ఫాలిక్యులార్, కార్పస్ ల్యుటియల్, చిన్న సైజ్‌లో ఉన్న సీరస్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని సమయాలలో 6 సెం.మీ సైజ్ కన్నా ఎక్కువగా ఉంటే సిస్ట్లు లేదా నీరులాంటి పదార్థంతోపాటు గట్టిగా ఉన్న సిస్ట్లు, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ల వంటికి మాత్రమే శస్త్రచికిత్స అవసరమ వుతుంది.శస్త్రచికిత్స అవసరమయ్యేవి... కొన్ని సిస్ట్లు మెలిక తిరిగి అంటే టార్షన్కు గురై పేషెంట్‌కు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలను తెచ్చిపెట్టినప్పుడు ఆపరేషన్ తప్పని సరి. చివరగా... మహిళలు తామ ఓవరాల్ ఆరోగ్యం కోసం సరైన ఆహారం, ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గడం చాలా మంచిది. దీనివల్ల ఇతరత్రా అనేక సమస్యలతో పాటు కొంతవరకు సిస్ట్లు కూడా నివారితమయ్యే అవకాశం ఉంది. - డా. స్వాతి హెచ్వికన్సల్టెంట్, అబ్‌స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ -
ఓవరీలో సిస్ట్...సంతానం కలుగుతుందా?
నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇంతవరకు పిల్లలు లేరు. కొన్నాళ్ల క్రితం స్కానింగ్ తీయిచాం. ఓవరీలలో సిస్ట్ ఉందని తెలిసింది. భవిష్యత్తులో అది క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందని మా ఫ్రెండ్స్ చెబుతుంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. సిస్ట్ ఉన్నవారికి సంతానం పొందే అవకాశాలు ఎలా ఉంటాయి. ఈ విషయమై నాకు వివరంగా చెప్పండి. ఓవేరియన్ సిస్ట్ (అండాశయాల్లో నీటితిత్తులు) ఉండటం అన్నది చాలా సాధారణ సమస్య. ఇవి చాలామందిలో కనిపిస్తుంటాయి. ఈ నీటితిత్తులు క్యాన్సర్ కణాలుగా మారవు. చాలామందిలో అవి కొద్దికాలం పాటు కనిపించి, ఆ తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి మీరు వీటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒవేరియన్ సిస్ట్స్ ఉన్న మహిళలు డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు అవి ఏ తరహాకు చెందినవో గుర్తించేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా వాటి పరిమాణం, సంఖ్య, వాటిలోకి జరిగే రక్తసరఫరా వంటి అంశాలను తెలుసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటి ఇతర పరీక్షలనూ చేయించాల్సి వస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకొని అలా వాళ్ల కుటుంబ చరిత్రలో క్యాన్సర్లు వచ్చి ఉంటే వారికి మరికొన్ని అదనపు పరీక్షలు సైతం చేయించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఒవేరియన్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే వాటి పరిమాణం పెరుగుపోతున్నా లేదా ట్విస్ట్ అవుతున్నా, అవి చీరుకుపోయి రక్తస్రావం అవుతున్నా, వాటి వల్ల నొప్పి కలుగుతుంటే మాత్రం వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్స సైతం లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా చేయడం కూడా చాలామందిలో సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలా సిస్ట్లు రావడం అన్నది ఎండోమెట్రియాసిస్ కారణంగా జరుగుతుంటుంది. అలాంటప్పుడు రుతుస్రావం, కలయిక సమయంలో నొప్పి, గర్భధారణకు అడ్డంకిగా ఉంటుంది. ఇక గర్భధారణ అవకాశాల విషయానికి వస్తే మీకు గర్భధారణ జరగకపోవడానికి ఇంకా ఏయే అంశాలు కారణమో పూర్తిగా విశ్లేషించాల్సి ఉంటుంది. దాంతోపాటు మీలో వస్తున్న సిస్ట్లు ఏ తరహాకు చెందినవి అని తెలుసుకోవడం కూడా అవసరమే. అంతేకాకుండా మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ గర్భధారణకు అవకాశాలు తగ్గిపోతాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా వైద్య నిపుణులను కలవండి. ఎండోమెట్రియాసిస్‌కు సర్జరీ అయ్యింది... పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందా? నా వయసు 35 ఏళ్లు. పెళ్లయి పదేళ్లు అవుతోంది. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటే ఇటీవలే డాక్టర్‌ను కలిశాను. అక్కడ నాకు ‘ఎండోమెట్రియాసిస్’ ఉందని వైద్యులు నిర్ధారణ చేసి, లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేశారు. నాకు పిల్లలు పుట్టే అవకాశాలున్నాయా? నాకు పీరియడ్స్ సమయంలో మళ్లీ మళ్లీ నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎండోమెట్రియాసిస్ సమస్య రావడం అన్నది చాలామంది మహిళల్లో కనిపించ. సాధారణమైన విషయం. ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత కొంతమందిలో ఈ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. అయితే మరి కొంతమందిలో మాత్రం నొప్పి మళ్లీ రావచ్చు. నొప్పి తీవ్రత తక్కువగా ఉంటే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో దాన్ని నియంత్రించవచ్చు. అంటే... తేలికపాటి వ్యాయామాలు చేయడంతో పాటు చాలా తక్కువ మోతాదుల్లో నొప్పినివారణమాత్రలు వాడుతూ నొప్పిని అదుపులో ఉంచవచ్చు. కానీ కొందరిలో మాత్రం నొప్పి తీవ్రత చాల ఎక్కువగా ఉంటుంది. అలాంటివారిలో వాళ్లు మళ్లీ గర్భధారణను కోరుకోకపోతే... వారికి హార్మోన్లలో మార్పులు తీసుకువచ్చే మందులను డాక్టర్లు సూచిస్తారు. అయితే నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే మాత్రం మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే దాదాపు 60 శాతం నుంచి 80 శాతం మందిలో మళ్లీ గర్భధారణ వచ్చేలాగే శస్త్రచికిత్స చేసి, నొప్పిని నియంత్రించవచ్చు. మీ లేఖను బట్టి మీరు గర్భధారణను కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మీరు గర్భధారణను కోరుకుంటుంటే మాత్రం ‘ఫెర్టిలిటీ ఇవాల్యుయేషన్’ (అంటే గర్భధారణకు అవకాశాలను తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు) చేయించాల్సి ఉంటుంది. మీరు రాసినదాన్ని బట్టి మీకు మినిమల్/మైల్డ్ ఎండోమెట్రియాసిస్ ఉండటం వల్ల లాపరోస్కోపిక్ చికిత్స జరిగినట్లు తెలిపారు. కాబట్టి కొన్ని రకాల మందులతో మీలో అండం విడుదల (ఒవ్యులేషన్) అయ్యేలా చేసి, ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) వంటి ప్రక్రియలను అనుసరిస్తే... మీలో గర్భధారణకు కొంతవరకు అవకాశాలు ఉండవచ్చు. కాకపోతే తీవ్రమైన ఎండోమెట్రియాసిస్ (సివియర్ ఎండోమెట్రియాసిస్) కేసుల్లో మాత్రం ఐవీఎఫ్ వంటి ఆధునిక ప్రక్రియలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజుల్లో సంతాన సాఫల్యానికి తగిన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు సంబంధిత నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ ప్రీతిరెడ్డి సీనియర్ కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, బర్త్ రైట్ బై రెయిన్బో, హైదరాబాద్ -
ఆ సమయంలో వాంతులు?
నాకు నెలసరి సమయంలో బాగా వాంతులు అవుతున్నాయి. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండడం లేదు. వైద్యం మీద అవగాహన ఉన్న నా ఫ్రెండ్ ‘స్పాస్మోడిక్ డిస్మెనోరయా’ అని చెబుతోంది. ఇది నిజమేనా? దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – జి.ప్రీతి, ఖమ్మం నెలసరి సమయంలో హార్మోన్లలో అనేక మార్పులు జరుగుతాయి. ఇందులో ప్రొస్టాగ్లాండిన్స్ అనేవి కీలకం. ఇవి కొందరిలో మాములుగా విడుదల అవుతాయి. కొందరిలో ఎక్కువగా విడుదల అవుతాయి. ఇవి గర్భాశయం పైన చూపే ప్రభావం వల్ల, అది బాగా ముడుచుకున్నట్లయ్యి బ్లీడింగ్ బయటకు వస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, అది విడుదలయ్యే మోతాదును బట్టి ఈ సమయంలో పొత్తికడుపులో నొప్పి తీవ్రత ఉంటుంది. కొందరిలో నొప్పి కొద్దిగా, కొందరిలో బాగా ఎక్కువగా, కొందరిలో ఏమీ ఉండదు. ఇలా నెలసరి సమయంలో మెలిపెట్టినట్లు ఉండే పొత్తికడుపు నొప్పినే ‘స్పాస్మోడిక్ డిస్మెనోరియా’ అంటారు. గర్భాశయంలో ఏ సమస్యా లేకపోయినా కూడా ప్రొస్టాగ్లాండిన్స్ ప్రభావం వల్ల ఈ నొప్పి కొందరిలో 1–3 రోజులు ఉండి తగ్గిపోతుంది. ఇది మామూలే. దీనికి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ఆ రోజులలో నొప్పి నివారణ మాత్రలు వాడుకోవచ్చు. మరి కొందరిలో గర్భాశయంలో ఫైభ్రాయిడ్స్, అడినోమియోసిస్, ఎండోమెట్రియోసిస్ వంటి ఇతర సమస్యల వల్ల కూడా నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొస్టాగ్లాండిన్స్ కండరాలను కుంచింప చేస్తాయి. నెలసరి సమయంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ గర్భాశయ కండరాలపైనే కాకుండా, మిగతా బాగంలో ఉన్న కొన్ని కండరాలపైన, అవయవాలపైన ప్రభావం చూపడం వల్ల, కొందరిలో ఈ సమయంలో వికారం, వాంతులు, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. దీనికి ఈ సమయంలో రానిటిడిన్, ఓన్‌డన్‌సెట్రాన్ వంటి మాత్రలు వాడి చూడవచ్చు.అలాగే మెడిటేషన్, యోగా వంటి వ్యాయామాలతో కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది. మా బంధువులలో ఇద్దరు ముగ్గురు అండాశయాలలో నీటిబుడగల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇవి రావడం ప్రమాదమా? నివారణ చర్యలు ఏమిటి? అండాశయాలలో నీడిబుడగలు ఏర్పడడం అనేది జన్యుపరమైన సమస్యల వల్ల వస్తుందా? తీసుకునే ఆహారం లేక ఇతర కారణాల వల్ల వస్తుందా? తెలియజేయగలరు. – కె.రాధిక, రాజమండ్రి అండాశయాలలో నీటిబుడగల సమస్యను పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఇవి హార్మోన్లలో అసమతుల్యత, అధికబరువు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు వంటి ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల ఏర్పడడవచ్చు. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, సన్నగా ఉన్నవారిలో కూడా నీటిబుడగల సమస్య ఏర్పడవచ్చు. సాధారణంగా గర్భాశయం ఇరువైపుల ఉంటే అండాశయాలలో పరిపక్వత చెందని అండాలు ఉంటాయి. పీసీవో ఉన్నవారిలో పరిపక్వత చెందని అండాలు చాలా ఎక్కువగా ఏర్పడి, స్కానింగ్‌లో చిన్నచిన్న నీటిబుడగలలాగా కనిపిస్తుంటాయి.మగవారిలోఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్ అనే ఆండ్రోజెన్ హార్మోన్, పీసీవో ఉన్న ఆడవారిలో ఎక్కువగా విడుదల అవుతుంది.ఇవి ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏర్పడతాయి. కొందరిలో అధిక బరువు వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి పీసీవో రావచ్చు. వీటి వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, మొటిమలు, అవాంఛిత రోమాలు, మెడచుట్టూ నల్లగా ఏర్పడటం, సాధారణంగా గర్భం దాల్చటంలో ఇబ్బందులు, అబార్షన్లు, గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం రావటం, తర్వాత కాలంలో షుగర్, బీపీ, గుండె సమస్యలు వంటివి ఏర్పడే అవకాశాలు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, హార్మోన్ల అసమతుల్యత తీవ్రతను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉండవచ్చు.వీటి చికిత్సలో భాగంగా మందులతో పాటు, జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు, బరువు తగ్గటం సక్రమంగా వ్యాయమాలు చెయ్యటం తప్పనిసరి. చాలామందికి కేవలం జీవనశైలిలో మార్పులతో కూడా ఇవి అదుపులో ఉంటాయి. వీటిని పూర్తిగా నివారించలేము. కానీ, వాటివల్ల వచ్చే సమస్యలను, చికిత్సలు, పైన చెప్పిన జాగ్రత్తలలో కొంతవరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. చికిత్సలో భాగంగా సమస్యను బట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మెట్ఫార్మిన్ మాత్రలు, ఓరల్ కాంట్రాసెప్టివ్స్, యాంటీ ఆండ్రోజన్స్ వంటి అనేక మందులను ఇవ్వడం జరుగుతుంది. గర్భం కోసం ఇచ్చే చికిత్సలో మందులతో గర్భం రానప్పుడు, ల్యాపరోస్కోపీ ద్వారా కొన్ని నీటిబుడగలను తీసి, మందులతో మరలా చికిత్స చేయడం జరుగుతుంది. పీసీవో సమస్యను పూర్తిగా తొలగించడం చాలా కష్టం. వీటి మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. చికిత్స, మందులూ, అవి ఇంకా పెరగకుండా హార్మోన్లను అదుపులో ఉంచడానికి మాత్రమే పనికి వస్తాయి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లు తీసుకోమని చెబుతుంటారు. ఇవి మెడికల్షాప్లలో అమ్ముతారా? మాత్రల రూపంలో ఉంటాయా? ఎంత మోతాదులో తీసుకోవాలి? మాత్రాల రూపంలో కాకుండా తినే ఆహారంతో సమకూరాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి తెలియజేయగలరు. – ఆర్.దేవిక, శ్రీకాకుళం ఫిష్ ఆయిల్లో ఛీజ్చి వంటి ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా చేప శరీరం నుంచి చేసినవి ఉండాలి. అవి చేప లివర్ నుంచి తీసినవి ఉండకూడదు. వీటిలో విటమిన్–ఎ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల అది శిశువుపైన దుష్ప్రభావాలు చూపే అవకాశాలు ఉంటాయి.ఫిష్ ఆయిల్‌లోకి ఛీజ్చి వల్ల గర్భిణీలలో బీపీ పెరగటం, నెలలు నిండకుండా కాన్పులు అవ్వడం వంటివి తగ్గవచ్చు అనేది విశ్లేషకుల అంచనా. ఛీజ్చి కడుపులోని శిశువు నాడీవ్యవస్థ పనితీరుకు, కళ్ళ పనితీరు సక్రమంగా ఉండేటట్లు చేస్తాయి. ఇవి ఛీజ్చి 300 ఉండే మందుల షాపులలో దొరికే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్. రోజుకొకటి చొప్పున తొమ్మిది నెలలు, కాన్పు తర్వాత 3 నెలల వరకు వాడవచ్చు. చేపలు తినేవారికి ఈ క్యాప్సూల్స్ అవసరం లేదు. వారానికి రెండు మూడుసార్లు చేపలు ఆహారంలో తీసుకుంటే చాలు. ఛీజ్చి ఎక్కువగా చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారంలో దొరుకుతుంది. అవిసెగింజలు, వాల్నట్స్ వంటి వాటిలో దొరుకుతుంది. మాంసాహారం తీసుకోని వారిలో ఆల్గేతో తయారుచేసే వెజిటేరియన్ క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. ఇవి కూడా ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అంత ఎఫెక్టివ్‌గా ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
హోమియోపతి కౌన్సెలింగ్
నా భార్యకు పీసీఓడి.. ఏం చేయాలి? నా భార్య వయసు 32 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? - సునీల్, అనంతపురం గర్భాశయానికి ఇరువైపులా అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాల్లో నీటిబుడగల వంటివి ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ) అంటారు. రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11-18 రోజుల మధ్యకాలంలో రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే ఈ పీసీఓడీ సమస్య ఉన్నవారిలో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా, అపరిపక్వమైన అనేక అండాలు నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోతాయి. చూడటానికి ఇవి ముత్యాల్లా కనిపిస్తుంటాయి. ఇలా రెండువైపులా కనిపిస్తుంటే దీన్ని వైద్యపరిభాషలో ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో ప్రక్రియలో సరైన కాన్స్టిట్యూషన్ సిమిలియం విధానంలో హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్