ఈ స్మార్ట్‌ఫోన్ 10లక్షల రిజిస్ట్రేషన్లను దాటేసింది
బెంగళూరు: మొబైల్ మార్కెట్లోకి మళ్లీ దూసుకొచ్చిన నోకియా ఇప్పటికే కొన్ని స్మార్ట్పోన్లతోపాటు ఫీచర్ ఫోన్లను కూడా లాంచ్ చేసింది. ఒకప్పుడు దూసుకుపోయిన నోకియా..రీ ఎంట్రీలో కూడా అదరగొడుతోంది. ముఖ్యంగా నోకియా 6 ఇప్పటికే 10లక్షలను మించిన రిజిస్ట్రేషన్లను సొంతం చేసుకుంది. అమెజాన్ లో నోకియా 6 ఒక మిలియన్ పైగా రిజిస్ట్రేషన్లను పొందిందని అమెజాన్ ప్రకటించింది.
నోకియా 6 తోపాటు నోకియా 5, 3 స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నోకియా 6 కోసం జూలై 14 న కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఆగష్టు 23 నుంచి రూ.14,999 ధరలో కొనుగోలుకు ఇది అందుబాటులోఉంది. జూలై 14న కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఆగష్టు 23 నుంచి రూ.14,999 ధరలో కొనుగోలుకు ఇది అందుబాటులో ఉంది. అలాగే అమెజాన్ ద్వారా కొనుగోలు చేసిన అమెజాన్ 'ప్రైమ్' సభ్యులకు రూ. 1000 క్యాష్‌బ్యాక ఆఫర్కూడా అందిస్తోంది. అంతేకాదు యూనిక్ డైలీ డీల్స్ విడ్జెట్ లో మెజాన్ షాపింగ్ యాప్, ప్రైమ్ వీడియోయాప్ ను ముందే ఇన్స్టాల్ చేసింది. దీంతో వేలకొద్దీ సినిమాలు,టీవీ కార్యక్రమాలను కూడా కస్టమర్లు పొందవచ్చు.మాట్ బ్లాక్, సిల్వర్, టెంపెడ్ బ్లూ అండ్ కాపర్ రంగుల్లో అందుబాటులో ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే..
నోకియా 6 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే,
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,ఆండ్రాయిడ్ 7.1 నూగట్
ఆక్టాకోర్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
షహైబ్రిడ్ డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్టీఈ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ.