Over lunch
-
‘మధ్యాహ్నం’లో అక్రమాలకు పాల్పడితే చర్యలు
జిల్లా ఉప విద్యాధికారి హరిశ్చందర్ పూడూరు: మధ్యాహ్నభోజనంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా ఉప విద్యాధికారి హరిశ్చందర్ హెచ్చరించారు. పూడూరు మండలంలోని సోమన్గుర్తి పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యత ఉన్న భోజనాన్ని అందించేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయలు బాధ్యత తీసుకోవాలన్నారు. భోజనం నాసిరకంగా చేసినా.. బియ్యం అక్రమంగా అమ్ముకున్నా.. బాధ్యుడు ప్రధానోపాధ్యాయుడేనన్నారు. పాఠశాలలో బియ్యం అమ్ముకున్నారని ఫిర్యాదు అందిందని, తనిఖీ చేయగా ఒక క్వింటాల్ బియ్యం తేడా వస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ పట్ల ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. అక్రమాలు చేస్తే వేటు తప్పతన్నారు. ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలస్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ సందర్భంగా అసిస్టు స్వచ్ఛంద సంస్థ పాఠశాలకు ఇచ్చే సంక్షేమనిధికి రూ.20వేల నగదును పాఠశాల నిర్వహణ కమిటీ, గ్రామ సంఘానికి అందజేశారు. ఈ నిధిపై వచ్చే వడ్డీతో పాఠశాల నిర్వహణకు ఖర్చు చేస్తామన్నారు. కార్యక్రమంలో పూడూరు మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, ఉపాధ్యాయులు అంజిలయ్య, నాయకులు విశ్వనాథం, అసిస్టు కో-ఆర్డినేటర్ సీతారామయ్య, గ్రామ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కలకలం రేపిన బడి అన్నం
లింగంపేట/ఎల్లారెడ్డి:లింగంపేట మండలంలోని ఎక్కపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 41 మంది విద్యార్థులు అస్వస్థులు కావడం కలకలం రేపింది. ఏజన్సీ నిర్వాహకుడు గంగమోల్ల స్వరూ ప సంగయ్య, ప్రధానోపాధ్యాయుడు సతీష్ సమక్షంలోనే విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. తిన్న కొద్దిసేపటికే వారంతా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి చదువుతున్న ల్యాగల గణేశ్, శిరీష, గంగమోల్ల భరత్, వీరన్న మోహన్, ల్యాగల అశ్విని, చినిగారి భవానీ, సుమ, ల్యాగల శివకుమా ర్, నీలకుమార్, కృష్ణవేణి, పాపమోల్ల విజయ్, నీల దీపిక, గంగమోల్ల సుప్రియ, బాంచ అఖిల, దుర్గాభవానీ, నీల రేణుక, ల్యాగల మోహన్,గుండ్ల లక్ష్మి, శంఖురి అశ్విత తదితరులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని బోరున విల పించారు. పిల్లలను వెంటనే ఆస్పత్రులకు తరలిం చారు. ఎల్లారెడ్డి కమ్యూనిటీ ెహ ల్త్సెంటర్ వైద్యుడు రఘుపతి సిబ్బందితో కలిసి విద్యార్థులకు చికిత్సనం దించారు. ఎల్లారెడ్డి ఎంపీపీ నక్క గంగాధర్, వైస్ ఎంపీపీ నునుగొండ శ్రీనివాస్, ఎల్లారెడ్డి, లిగంపేట తహశీల్దార్లు నాగజ్యోతి, పీవీఎల్ నారాయణ, ఎం ఈఓ మాన్సింగ్, సింగిల్‌విండో చైర్మన్ సాయిలు, సర్పంచ్ బన్నీ సక్రూ, ఎంపీటీసీ సభ్యుడు గోపాల్, ఆర్ఐ రేఖ, వీఆర్ఓ నవీన్ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులకు దగ్గరుండి వై ద్య సేవలందించారు. విద్యార్థులను పరామర్శించిన ఆర్డీఓ మధ్యాహ్న బోజనం వికటించి 41 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెల్సుకున్న కామారెడ్డి ఆర్డీఓ గడ్డం నగేశ్ హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను ప రామర్శించారు. భోజనంలో ఏం కూర వడ్డించారో ఆరా తీశారు. విద్యార్థుల పరిస్థితిపై ప్రభుత్వ వైద్యు డు రఘుపతిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రధాపాద్యాయుడు సతీష్‌ను, భోజన ఏజన్సీ నిర్వహకురాలు గంగమోల్ల స్వరూపసంగయ్యను విచారిం చారు. టమాట,పప్పు వండానని పప్పులో ఉప్పుకు బదులుగా, వంట సోడా వేసానని చెప్పడంతో ఆర్డీఓ, ఇతర అధికారులు విస్మయం వ్యక్తం చేసారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి పసి పిల్లల ప్రాణాలతో చెల గాటమాడుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వంట చేసింది నిర్వాహకురాలి భర్త ఏజన్సీ నిర్వాహకురాలు గంగమోల్ల స్వరూప స్థానం లో ఆమె భర్త సంగయ్య వంట చేసాడు. ఇంటిలో పని ఉందని స్వరూప పాఠశాలకు రాలేదు. పప్పు తొందరగా ఉడకాలనే ఉద్దేశ్యంతో అందులో వంటసోడా వే సాడు. అది తిన్న విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. తాను పప్పును తొందరగా ఉడికించేందుకే వంట సోడా వేసానని సం గయ్య ఆర్డీఓ ఎదుట అంగీకరించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏజన్సీ నిర్వాహకులను తొలగిం చా లని గ్రామస్థులు డిమాండ్ చేసారు. -
ఇక పండుగ భోజనం
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అందించే దిశగా గుజరాత్ తరహాలో రాష్ట్రంలో అమలు చేసేందుకు సమాలోచనలు బెంగళూరు : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటి వరకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంతో పాటు పండుగ భోజనాన్ని సైతం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పండుగల సందర్భాల్లో విద్యార్థులకు వివిధ రకాలైన పిండివంటలతో ప్రత్యేక భోజనం అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తోంది. ఇటీవల కేంద్ర మానవ వనరుల శాఖ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పండుగ భోజనాన్ని ప్రత్యేకంగా అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. రానున్న విద్యా సంవత్సరం నుంచే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పండుగ సందర్భాల్లో ప్రత్యేక భోజనాన్ని అందించే పథకం ఇప్పటికే గుజరాత్లో అమల్లో ఉంది. గుజరాత్లో ‘తిథి భోజన్’ పేరిట ఈ పథకం అమలవుతోంది. పండుగ సందర్భాలు, స్వాతంత్య్రదినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో వివిధ రకాల పిండి వంటలతో కూడిన ప్రత్యేక భోజనాన్ని ‘తిథి భోజన్’ పేరిట అక్కడి విద్యార్థులకు అందజేస్తున్నారు. గుజరాత్లో ఈ పథకం ఎంతో విజయవంతమైంది. ఈ పథకం అమలు ద్వారా చాలా మంది చిన్నారులు అపౌష్టికత నుంచి సైతం బయటపడ్డారని గణాంకాలు వెల్లడించాయి. దీంతో ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ భావించారు. ఈ కారణంగా ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ కసరత్తు ప్రారంభించింది. గత ఏడాది అక్టోబర్‌లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్మృతి ఇరానీ ఇందుకోసం ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏరా్పాటు చేశారు. ఈ సమావేశంలోనే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో హబ్బదూట పేరుతో. ఇక కర్ణాటకలో ఈ పథకాన్ని హబ్బదూట(పండుగ భోజనం)’ పేరుతో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు సంబంధించిన పూర్తి విధి, విధానాలు ఇప్పటికే తయారయ్యాయని రానున్న విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం రాష్ట్రంలో అమల్లోకి రానుందని రాష్ట్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.