జిల్లా ఉప విద్యాధికారి హరిశ్చందర్
పూడూరు: మధ్యాహ్నభోజనంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా ఉప విద్యాధికారి హరిశ్చందర్ హెచ్చరించారు. పూడూరు మండలంలోని సోమన్‌గుర్తి పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యత ఉన్న భోజనాన్ని అందించేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయలు బాధ్యత తీసుకోవాలన్నారు.
భోజనం నాసిరకంగా చేసినా.. బియ్యం అక్రమంగా అమ్ముకున్నా.. బాధ్యుడు ప్రధానోపాధ్యాయుడేనన్నారు. పాఠశాలలో బియ్యం అమ్ముకున్నారని ఫిర్యాదు అందిందని, తనిఖీ చేయగా ఒక క్వింటాల్ బియ్యం తేడా వస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ పట్ల ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు.
అక్రమాలు చేస్తే వేటు తప్పతన్నారు. ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలస్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ సందర్భంగా అసిస్టు స్వచ్ఛంద సంస్థ పాఠశాలకు ఇచ్చే సంక్షేమనిధికి రూ.20వేల నగదును పాఠశాల నిర్వహణ కమిటీ, గ్రామ సంఘానికి అందజేశారు. ఈ నిధిపై వచ్చే వడ్డీతో పాఠశాల నిర్వహణకు ఖర్చు చేస్తామన్నారు. కార్యక్రమంలో పూడూరు మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, ఉపాధ్యాయులు అంజిలయ్య, నాయకులు విశ్వనాథం, అసిస్టు కో-ఆర్డినేటర్ సీతారామయ్య, గ్రామ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
‘మధ్యాహ్నం’లో అక్రమాలకు పాల్పడితే చర్యలు
Published Sun, Apr 19 2015 12:04 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement