కలకలం రేపిన బడి అన్నం | Ekkapalli public elementary school 41Students illnesses | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన బడి అన్నం

Published Wed, Jan 7 2015 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

Ekkapalli public elementary school 41Students  illnesses

 లింగంపేట/ఎల్లారెడ్డి:లింగంపేట మండలంలోని ఎక్కపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 41 మంది విద్యార్థులు అస్వస్థులు కావడం కలకలం రేపింది. ఏజన్సీ నిర్వాహకుడు గంగమోల్ల స్వరూ ప సంగయ్య, ప్రధానోపాధ్యాయుడు సతీష్ సమక్షంలోనే విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. తిన్న కొద్దిసేపటికే వారంతా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి చదువుతున్న ల్యాగల గణేశ్, శిరీష, గంగమోల్ల భరత్, వీరన్న మోహన్, ల్యాగల అశ్విని, చినిగారి భవానీ, సుమ, ల్యాగల శివకుమా ర్, నీలకుమార్, కృష్ణవేణి, పాపమోల్ల విజయ్, నీల దీపిక, గంగమోల్ల సుప్రియ, బాంచ అఖిల, దుర్గాభవానీ, నీల రేణుక, ల్యాగల మోహన్,గుండ్ల లక్ష్మి, శంఖురి అశ్విత తదితరులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని బోరున విల పించారు. పిల్లలను వెంటనే ఆస్పత్రులకు తరలిం   చారు. ఎల్లారెడ్డి కమ్యూనిటీ ెహ ల్త్‌సెంటర్ వైద్యుడు రఘుపతి సిబ్బందితో కలిసి విద్యార్థులకు చికిత్సనం దించారు. ఎల్లారెడ్డి ఎంపీపీ నక్క గంగాధర్, వైస్ ఎంపీపీ నునుగొండ శ్రీనివాస్, ఎల్లారెడ్డి, లిగంపేట తహశీల్దార్లు నాగజ్యోతి, పీవీఎల్ నారాయణ, ఎం ఈఓ మాన్‌సింగ్, సింగిల్‌విండో చైర్మన్ సాయిలు, సర్పంచ్ బన్నీ సక్రూ, ఎంపీటీసీ సభ్యుడు గోపాల్, ఆర్‌ఐ రేఖ, వీఆర్‌ఓ నవీన్ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులకు దగ్గరుండి వై ద్య సేవలందించారు.
 
 విద్యార్థులను పరామర్శించిన ఆర్‌డీఓ
 మధ్యాహ్న బోజనం వికటించి 41 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెల్సుకున్న కామారెడ్డి ఆర్‌డీఓ గడ్డం నగేశ్ హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను ప రామర్శించారు. భోజనంలో ఏం కూర వడ్డించారో ఆరా తీశారు. విద్యార్థుల పరిస్థితిపై ప్రభుత్వ వైద్యు   డు రఘుపతిని  అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రధాపాద్యాయుడు సతీష్‌ను, భోజన ఏజన్సీ నిర్వహకురాలు గంగమోల్ల స్వరూపసంగయ్యను విచారిం  చారు. టమాట,పప్పు వండానని పప్పులో ఉప్పుకు బదులుగా, వంట సోడా వేసానని చెప్పడంతో ఆర్‌డీఓ, ఇతర అధికారులు విస్మయం వ్యక్తం చేసారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి పసి పిల్లల ప్రాణాలతో చెల  గాటమాడుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
 వంట చేసింది నిర్వాహకురాలి భర్త
 ఏజన్సీ నిర్వాహకురాలు గంగమోల్ల స్వరూప స్థానం    లో ఆమె భర్త సంగయ్య వంట చేసాడు. ఇంటిలో పని ఉందని స్వరూప పాఠశాలకు రాలేదు. పప్పు తొందరగా ఉడకాలనే ఉద్దేశ్యంతో అందులో వంటసోడా వే    సాడు. అది తిన్న విద్యార్థులు  కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. తాను పప్పును తొందరగా ఉడికించేందుకే వంట సోడా వేసానని సం  గయ్య ఆర్‌డీఓ ఎదుట అంగీకరించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏజన్సీ నిర్వాహకులను తొలగిం చా లని గ్రామస్థులు డిమాండ్ చేసారు.
 

Advertisement
Advertisement