overseas assets
-
సహారాకు ఈడీ దెబ్బ
న్యూఢిల్లీ : సహారా అధినేత సుబ్రతోరాయ్ మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకోనున్నారు. ఇటీవల ఆంబే వాలీని అటాచ్ చేయాలంటూ ఆదేశించి సుప్రీంకోర్టు షాకివ్వగా ఇపుడు ఈడీ వంతు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)తాజా నిర్ణయంతో మరిన్ని కష్టాలు సహారాను చుట్టు ముట్టనున్నాయి. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ మరిన్ని విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. సహారా గ్రూప్ హోటల్స్ సహా ఇతర విదేశీ ఆస్తులను అటాచ్ కోసం ఈడీ సిద్ధమవుతోంది. సహారా హోటల్స్, విదేశాల్లో్ ఉన్న నాలుగు ప్రాపర్టీల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధం చేస్తోంది. దాదాపు రూ. 3,697కోట్ల విలువైన ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఆస్తులను సహారా అక్రమంగా కూడబెట్టిందని ఈడీ ఆరోపిస్తోంది. సుప్రీం అక్రమ ఆస్తులుగా ప్రకటించిన ఈ ప్రాపర్టీలనున పెట్టుబడిదారుల పెట్టుబడుల నుంచి సంపాదించుకుందని ఈడీ నమ్ముతోంది. కాగా సహారా గ్రూప్ అంటే ఆంబేవాలీ. అత్యంత విలువైన ఆస్తి విలువు రూ.39వేల కోట్లు. ఆంబే వాలీని అటాచ్ చేస్తున్నట్టు పేర్కొన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
నా ఆస్తులతో బ్యాంకులకు ఏం పని?
న్యూఢిల్లీ: విదేశాల్లోని తన ఆస్తులు వివరాలు బ్యాంకులకు తెలిపేందుకు దివాలా తీసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యా నిరాకరించారు. విదేశాల్లోని తన ఆస్తుల వివరాలు వెల్లడించాలని కోరేందుకు బ్యాంకులకు ఎలాంటి హక్కుగానీ, అధికారంగానీ లేదని ఆయన గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగవేయడంతోపాటు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు విజయ్ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో గురువారం తన వాదనలు వినిపించిన మాల్యా జున్ 26వ తేదీన సీల్డ్ కవర్లో తన ఆస్తుల వివరాలు తెలియజేసేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరారు. మాల్యా విదేశీ ఆస్తుల వివరాలు తెలియజేయాలన్న బ్యాంకుల అభ్యర్థనపై ఆయన స్పందిస్తూ.. రుణాలు ఇచ్చేటప్పుడు తన విదేశీ ఆస్తుల గురించి బ్యాంకులు పరిగణనలోకి తీసుకోలేదని, అలాంటప్పుడు ఇప్పుడు వాటితో ఏం పని? అని ప్రశ్నించారు. బ్యాంకులకు ఎగవేసిన అప్పుల విషయంలో అదనంగా రూ. 1,398 కోట్లు చెల్లించడానికి సిద్ధమని విజయ్ మాల్యా సుప్రీంకోర్టుకు ఆఫర్ చేశారు. మరోవైపు విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఈడీ తన చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే మాల్యాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ దాఖలైన నేపథ్యంలో అతన్ని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖను ఈడీ ఆశ్రయించింది. -
విదేశాల్లో ఖరీదైన బంగ్లా.. ఆస్తులు నీకెక్కడివి?
ఇస్లామాబాద్: విదేశాల్లో ఉన్న ఆస్తులపై వివరణ ఇవ్వాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నిలదీశారు. లండన్ లోని ఖరీదైన ప్రాంతంలోని ఆస్తులు, యూరప్ లో 320 మిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడుల ఎక్కడివని ప్రశ్నించారు. ఇంత డబ్బు ఎక్కడదని ఇమ్రాన్ ప్రశ్నించారు. లండన్ లోని 800 మిలియన్ల హైడ్ పార్క్ ఆస్తి ఎక్కడనుంచి వచ్చిందన్నారు. తన కుమారుడు హుస్సేన్ నవాజ్ పేరిట నవాజ్ షరీఫ్ అక్రమ ఆస్తులను కూడబెట్టారని ఇమ్రాన్ ఆరోపించారు. జాతీయ అసెంబ్లీకి షరీఫ్ జవాబుదారీగా ఎన్నడూ లేడని ఇమ్రాన్ విమర్శించారు. అధికారం అండతో షరీఫ్ సోదరులు నాలుగు చక్కెర కర్మాగారాలను పెట్టారని, వ్యక్తిగత వ్యాపారాలకు ప్రభుత్వ అధికారాన్ని వాడుకుంటున్నారని ఇమ్రాన్ నిప్పులు చెరిగారు.