విదేశాల్లో ఖరీదైన బంగ్లా.. ఆస్తులు నీకెక్కడివి?
విదేశాల్లో ఖరీదైన బంగ్లా.. ఆస్తులు నీకెక్కడివి?
Published Thu, Sep 11 2014 6:40 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM
ఇస్లామాబాద్: విదేశాల్లో ఉన్న ఆస్తులపై వివరణ ఇవ్వాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నిలదీశారు. లండన్ లోని ఖరీదైన ప్రాంతంలోని ఆస్తులు, యూరప్ లో 320 మిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడుల ఎక్కడివని ప్రశ్నించారు. ఇంత డబ్బు ఎక్కడదని ఇమ్రాన్ ప్రశ్నించారు.
లండన్ లోని 800 మిలియన్ల హైడ్ పార్క్ ఆస్తి ఎక్కడనుంచి వచ్చిందన్నారు. తన కుమారుడు హుస్సేన్ నవాజ్ పేరిట నవాజ్ షరీఫ్ అక్రమ ఆస్తులను కూడబెట్టారని ఇమ్రాన్ ఆరోపించారు. జాతీయ అసెంబ్లీకి షరీఫ్ జవాబుదారీగా ఎన్నడూ లేడని ఇమ్రాన్ విమర్శించారు. అధికారం అండతో షరీఫ్ సోదరులు నాలుగు చక్కెర కర్మాగారాలను పెట్టారని, వ్యక్తిగత వ్యాపారాలకు ప్రభుత్వ అధికారాన్ని వాడుకుంటున్నారని ఇమ్రాన్ నిప్పులు చెరిగారు.
Advertisement