own app
-
వాట్సాప్: ప్రభుత్వ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే బహుల ప్రజాదరణ పొందిన మేసేజింగ్ యాప్ వాట్సాప్. అయితే వాట్సాప్‌కు సంబంధించి కొన్ని అంచనాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఫేక్‌న్యూస్, భద్రతపై అనేక ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహరచన చేస్తోందిట. ప్రభుత్వం తన అంతర్గత సమాచార మార్పిడికి సేఫ్ అండ్ సెక్యూర్‌గా వాట్సాప్‌తో సమానమైన సొంత కమ్యూనికేషన్ యాప్‌ను రూపొందించాలని యోచిస్తోంది. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. చైనా అమెరికా మధ్య ముదురుతున్న ట్రేడ్‌వార్ సందర్భంలో సొంత చాటింగ్ ప్లాట్ ఫామ్ తీసుకురావాలనే ఆలోచన వెనుక కారణాలను అధికారులు వివరించారని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. ముఖ్యంగా చైనా కంపెనీ హువావేకి అమెరికా ఆంక్షలను విధించడంతో, హావావే ఉత్పత్తులను బ్యాన్ చేయాలని ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకొస్తోందని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపత్యంలో భవిష్యత్‌లో మన దేశంలో కూడా అమెరికా కంపెనీల నెట్‌వర్క్‌లపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అందుకే సొంత వాట్సాప్‌ను అభివృద్ధి చేయనున్నామని ప్రభుత్వ అధికారులు వివరించారు. ఈ సర్కారీ వాట్పాప్ ద్వారా పంపే సమాచారం, డేటా చోరీ అయ్యే అవకాశం ఉండదంటున్నారు. అంతేకాదు ఈ సమాచారాన్ని 100 శాతం భారత దేశంలోనే భద్రపరుస్తామని అధికారులు తెలిపారు. సర్కారీ వాట్సాప్ వచ్చాక అధికారిక సమాచారాన్ని, డేటాను పంపేందుకు జీ-మెయిల్, వాట్సాప్‌తదితర యాప్‌లను వాడొద్దని అధికారులకు, ప్రభుత్వ సిబ్బందికి సూచిస్తామన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో వాట్సాప్ , టెలిగ్రామ్ వంటి యాప్‌లకు ప్రత్యామ్నాయంగా అంతర్గత ప్రభుత్వ సమాచార మార్పిడి కోసం ఫ్రాన్స్ దేశం టి చాప్ అనే యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌లో ముఖ్యమైన లక్షణాలలో ఒకటి, దాని డేటా మొత్తం దేశంలోనే సురక్షితంగా ఉంచడం. అయితే బాప్టిస్ట్ రాబర్ట్ (ఇలియట్ ఆండర్సన్) అనే భద్రతా పరిశోధకుడు ఈ యాప్‌లో లోపాన్ని కనుగొన్నారు. మరి ఈ విషయంలో కేంద్రం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మన దేశానికి చెందిన డేటాను మన దేశంలోనే భద్రపరచాలని(డేటా లోకలైజేషన్) కేంద్రం పట్టుదలగా ఉంది. ఈ మేరకు డేటా లోకలైజేషన్ నిబంధనలపై రిజర్వ్ బ్యాంక్ స్పష్టతనిచ్చింది. పేమెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సంస్థలు (పీఎస్వో) చెల్లింపుల లావాదేవీల డేటా మొత్తం భారత్‌లోని సిస్టమ్స్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
హీరోయిన్ అఫిషియల్ యాప్
చెన్నై: ప్రముఖ హీరోయిన్ ఎమీ జాక్సన్ తన అఫిషియల్ యాప్‌ను చెన్నైలోని ఓ హోటల్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యూయార్క్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఎస్కాపెక్స్ ఈ యాప్‌ను రూపొందించిందని చెప్పారు. ఈ కొత్త యాప్‌తో అభిమానులు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా తనతో నేరుగా చాట్ చేయవచ్చన్నారు. పుష్ నోటిఫికేషన్స్, ఫీచర్డ్ వీడియోస్, సూపర్‌ఫ్యాన్ బ్యాడ్జెస్, సబ్స్క్రిప్షన్, లైవ్ బ్రాడ్కాస్ట్ వంటి వినూత్నమైన అంశాలు ఈ యాప్‌లో ఉన్నాయని వివరించారు. తాను భవిష్యత్తులో మరెన్నో ప్రణాళికలు రూపొందించనున్నానని, ఇవన్నీ అభిమానులు ముందుగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఈ యాప్ ద్వారా సోషల్ మీడియా కార్యకలాపాల్లో తనను మరో మెట్టుకు తీసుకువెళ్లినట్టు ఆమె పేర్కొన్నారు. దీని ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు. డబ్బు సంపాదన కోసం తాను ఈ యాప్ పెట్టలేదని ఎమీ జాక్సన్ స్పష్టం చేశారు. -
ఇంటి నిర్వహణ ఇక తేలికే..
కామన్‌ఫ్లోర్.కామ్, అప్నా కాంప్లెక్స్.కామ్, సొసైటీ123.కామ్, సొసైటీ రన్.కామ్, ఇట్స్ మైహోమ్.కో.ఇన్... ఇల్లు పూర్తిగా తయారయ్యాక గృహప్రవేశం చేస్తాం. తరవాత నిర్వహణ ఉంటుంది కదా!! చిన్న ఇంట్లోనే డ్రైనేజీ, విద్యుత్, నీటి వంటి నెలవారీ చెల్లింపులు, వాటిని సరిగా నడిచేలా చూడటం వంటివి సరిగా చెయ్యకపోతే సవాలక్ష సమస్యలొస్తాయి. మరి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే మరీను. అందుకే గేటెడ్ కమ్యూనిటీల్లో నిర్వాసితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అయితే దీన్నీ ఆన్లైన్ ద్వారా నిర్వహించే కంపెనీలున్నాయిప్పుడు. సంఘం ఏర్పాటు నుంచి రిజిస్ట్రేషన్... నెలవారీ చెల్లింపులు... ఇలా ప్రతిదీ సకాలంలో చేసిపెట్టడమే వీటి పని. ఆ సేవల్ని చూస్తే... అకౌంటింగ్ ఫ్లాట్‌ఫాం: నివాసితుల సంఘానికి ఒక ప్రత్యేకమైన వెబ్పోర్టల్నిస్తారు. దీన్లో సంఘం సభ్యుల సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ప్రతి ఫ్లాట్ విస్తీర్ణం, గృహ యజమానులు, వారి ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలుంటాయి. నెలవారీ చెల్లింపుల గడువు రాగానే క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా ప్రతి ఫ్లాట్ వాసులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో సమాచారం అందిస్తుంది. వెంటనే వారు పోర్టల్‌లోకి లాగిన్ అయి సంఘం బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు. హెల్ప్ డెస్క్: గేటెడ్ కమ్యూనిటీలో విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ, లిఫ్టుల నిర్వహణకు సంఘం తరపున ప్రత్యేకంగా ఉద్యోగులుంటారు. ఫ్లాట్‌వాసులకు వీటిల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా పోర్టల్ ద్వారా ఆ ఉద్యోగులకు నేరుగా సమాచారం వెళుతుంది. కమ్యూనికేషన్ కొలాబిరేషన్: ప్రతి సంఘం మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ (సంఘం పేరు, ప్రధాన లక్ష్యాలు, ఆఫీసు చిరునామా, కార్యవర్గ సభ్యుల పూర్తి వివరాలుంటాయిందులో), సంఘం నిబంధనలు (బైలాస్), నెలవారీ సమావేశాలు, కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, అపార్ట్మెంట్లోకి కొత్తగా వచ్చిన వారి వివరాలతో పాటుగా సంఘం ఖాతాలోని సొమ్మును వేటి కోసం ఖర్చు చేస్తున్నారు వంటి సమస్త సమాచారం ఎప్పటికప్పుడు సంఘం వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. ఫ్లాట్వాసులందరికీ ఎలక్ట్రానికల్‌గా తెలుసుకోవచ్చు. గేట్ కీపర్: అపార్ట్మెంట్ ప్రధాన ద్వారం వద్ద ఉండే సెక్యూరిటీగార్డ్ దగర ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఇందులో అపార్ట్మెంట్ వాసులందరి వివరాలుంటాయి. ఎవరైనా ఫ్లాట్ వాసులను కలిసేందుకు వచ్చినప్పుడు వారి వివరాలను, ఫొటోలను సంబంధిత ఫ్లాట్‌వాసులకు చేరవేరుస్తుంది. వారు సరే అంటే వచ్చినవారిని లోనికి రానిస్తారు. ‘‘ఒక్క ముక్కలో చెప్పాలంటే మాది టెక్నాలజీ ఆధారంగా పనిచేసే సెల్ఫ్ మెయింటెనెన్స్ సిస్టమ్. ఇంటర్నెట్తో పనిలేదు. ప్రతి పనీ సకాలంలో చేయటమే మా బాధ్యత’’. - రాజశేఖర్, కో ఫౌండర్- అప్నా కాంప్లెక్స్