PA Shekhar
-
పీఏ శేఖర్ వస్తే సహించం
టీడీపీ అసమ్మతి నేతల ఆల్టిమేటం అల్టిమేటమ్ హిందూపురం రూరల్ : పార్టీని భ్రష్టుపట్టించి, ప్రజాధనాన్ని దోచుకుని పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే పీఏ శేఖర్ మళ్లీ హిందూపురానికి వస్తే సహించేది లేదని టీడీపీ అసమ్మతి నేతలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. సోమవారం అంబికా లక్ష్మీనారాయణ నివాసంలో మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడితోపాటు నలుగురు కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పీఏ శేఖర్ మళ్లీ హిందూపురానికి వస్తే ఆందోâýæనలు చేస్తామని స్పష్టం చేశారు. శేఖర్‌తో టీడీపీకి తీవ్ర నష్టం జరిగిందని, పార్టీకి చెడ్డపేరు వచ్చిందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబునాయుడు, బాలకృష్ణ ఆదేశాలకనుగుణంగా తాము నడుచుకోవడానికి సిద్ధమైన పక్షంలో మళ్లీ శేఖర్ గుట్టు చప్పుడుకాకుండా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటిౖకెనా అధిష్టానం శేఖర్‌ను తొలగించినట్లా.. లేదా అన్న విషయం స్పష్టం చేయాలన్నారు. రెండురోజులుగా శేఖర్ బాగేపల్లిలో మకాం వేసి, తాను మళ్లీ నెలరోజుల్లో వస్తానని లేపాక్షి, చిలమత్తూరు నాయకులకు చెప్పారని అన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు సనావుల్లా భారతి, గోపీ, శివ, మాజీ కౌన్సిలర్లు ముద్దరంగప్ప, చక్రపాణి, పరిమâýæ, నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
బాలయ్య పీఏ అవినీతి.. కరపత్రాలు విడుదల
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ.. కరపత్రాల పంపిణీ జరిగింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో.. ఈ వార్త ధావనంలా పాకింది. కరపత్రంలో తెలిపిన వివరాల ప్రకారం ‘‘ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఎందరో మహానుభావులు విజయం సాధించారు. అయితే వారు చేయని పనిని ఘన కీర్తి సాధించిన ప్రస్తుతం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసి చూపిస్తున్నాడని తెలిపారు. ఎన్టీఆర్‌పై మమకారంతో ఓట్లు వేసి గెలిపించిన హిందూపురం ప్రజలైతే ఇక్కడ ప్రజల అభిమానాన్ని నోట్ల రూపంలో అతని ఇన్చార్జ్ శేఖర్ ప్రజల నుంచి వసూలు చేస్తాన్నాడని’’ అందులో పేర్కొన్నారు. -
టీడీపీ నేతల బాహాబాహీ
హిందూపురం : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ శేఖర్ ప్రతి పనికీ రేటు కట్టి కార్యకర్తల నుంచి సైతం డబ్బు లాగుతున్నారని ఆ పార్టీకి చెందిన నేతలే భగ్గుమన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు ఇరు వర్గాలుగా విడిపోరుు కుర్చీలతో కొట్టుకున్నారు. నోటికొచ్చినట్లు తిట్టుకున్నారు. ఇదంతా బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ సమక్షంలోనే జరిగింది. బుధవారం నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులో ఉన్న రిచ్మెన్ సిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో టీడీపీ మండల విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. టీడీపీకి చెందిన రైతు సంఘం నాయకుడు బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణ పీఏ సొంత పార్టీ కార్యకర్తలను సైతం వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎంపీపీ నౌజియాభాను వర్గీయులు ఆయనపై దాడికి దిగారు. చొక్కా చింపివేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎంపీపీ మరిది అన్సార్ తదితరులు బ్రహ్మానందరెడ్డిపై దాడికి దిగారు. గూండా రాజ్యం నడుస్తోంది.. ‘అధికార దర్పంతో ఎంపీపీ వర్గీయులు గూండా రాజ్యం నడిపిస్తున్నారు. దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు చంద్రబాబుకు, ఎమ్మెల్యే బాలకృష్ణకు కూడా చెడ్డపేరు వస్తోంద’ని టీడీపీ రైతు విభాగం నాయకులు బ్రహ్మనందరెడ్డి, రాము తదితరులు అన్నారు. బుధవారం దాడి అనంతరం వారు స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తల సమావే శంలో తన ఆవేదన వ్యక్తం చేస్తుంటే రౌడీల్లా చొక్కా చించి కుర్చీలతో దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. బోరు వేసుకోవాలంటే రూ.30 వేలు, ఇలా ప్రతి పనికీ రేటు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలకు పార్టీలో ఏ కోశాన విలువ లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా జెండా మోస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటే గుర్తింపు ఇవ్వలేదన్నారు. తప్పులు ఎత్తి చూపితే ఎంపీపీ వర్గం దాడి చేస్తోందన్నారు. ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళతామన్నారు. దాడి విషయమై పోలీసు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తామన్నారు. క్రమశిక్షణ చర్యలు తప్పవు.. కార్యకర్తల సమావేశంలో అనుచితంగా ప్రవర్తించిన వారి గురించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని, క్రమశిక్షణ చర్యలు తప్పవని పార్టీ మండల కన్వీనర్ రంగారెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశం జరుగుతున్నప్పుడు ఆవేశంతో మాట్లాడరాదని, ఏదైనా ఉంటే సామరస్యంగా చర్చించుకోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు అన్సార్, పాపన్న, శివప్ప తదితరులు పాల్గొన్నారు.