ట్రాక్టర్ వరిగడ్డి దగ్ధం
గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గొల్లపల్లి సమీపంలో బుధవారం మధ్యాహ్నం వరిగడ్డితోపాటు ట్రాక్టర్ ట్రక్ దగ్ధమైంది. వరిగడ్డి లోడుతో ట్రాక్టర్ గ్రామంలో వెళుతున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి మంటలు లేచాయి. డ్రైవర్ గోపి అప్రమత్తమై ట్రక్‌ను వదిలేసి ఇంజన్‌ను ముందుకు తీసకుపోయాడు. సుమారు రూ.లక్ష మేర నష్టం జరిగినట్టు అంచనా.