Paderu Assembly Constituency
-
వైఎస్సార్సీపీని వీడితే నాకు పుట్టగతులుండవు: విశ్వేశ్వర రాజు
అల్లూరి సీతారామరాజు: రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు Matsyarasa Visweswara Raju అంటున్నారు. ఆయనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.‘‘నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నా. వైఎస్ జగన్‌తోనే నా పయనం కొనసాగుతుంది. నాకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది ఆయనే. ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, నా భార్యకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్సార్సీపీని వీడితే నాకు పుట్టగతులు ఉండవు. .. పార్టీ మారే ప్రసక్తే లేదు. ఊపిరి ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటా. 2029లో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది’’ అని విశ్వేశ్వరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం -
టీడీపీ నాయకుల టికెట్ ఆశలు అడియాసలేనా ?
ప్రజల్లో ఆదరణ లేకపోయినా పొత్తులతో గట్టెక్కుదామని తెలుగుదేశం పార్టీ అధిష్టానం వేసిన ఎత్తులు ఇప్పుడు ఆ పార్టీలో సీనియర్ నేతల ఆశలను అడియాసలు చేస్తోంది. పొత్తులో సీటు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో పాడేరు నాయకుల రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఇన్నాళ్లు సీటు కోసం పట్టుపట్టి గ్రూపులుగా విడిపోయిన నాయకులు ఇప్పుడు మాలో ఎవరికో ఒకరికి ఇవ్వండి అంటూ వేడుకునే పరిస్థితి ఏర్పడింది. అధినేతను కలిసి తమ గోడు వెల్లబుచ్చుకుందామంటే కనీసం అపాయింట్మెంట్ లభించకపోవడంతో అమరావతిలో ఎదురుచూపులతో ఐదు రోజులుగా కాలం గడుపుతున్నారు. పాడేరు : పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయాలని గంపెడు ఆశలు పెట్టుకున్న టీడీపీ నాయకులకు చుక్కెదురు కానుంది. పొత్తులో భాగంగా ఈసారి కూడా మిత్రపక్షమైన బీజేపీకి పాడేరు అసెంబ్లీ టికెట్ కేటాయించేందుకు దాదాపుగా కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పాడేరు నియోజకవర్గంలోని టీడీపీలో టికెట్ ఆశిస్తున్న వారితో పాటు పార్టీ శ్రేణుల్లో కూడా నైరాశ్యం నెలకొంది. గత 20 ఏళ్లుగా ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని టీడీపీకి ఈసారి కూడా పోటీ చేసే అవకాశం లేకపోతే దాదాపుగా పార్టీ ఉనికే ప్రశ్నర్థాకంగా మారుతుందని నాయకులు, కేడర్ ఆందోళన చెందుతున్నారు. ఎలాగైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి పరిస్థితిని వివరించి టీడీపీకి పాడేరు టికెట్ కేటాయించేలా ఒత్తిడి తేవాలని భావించినా ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. రెండు సార్లు ఓటమి... రెండు సార్లు పోటీకి దూరం 1999లో పాడేరు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మత్య్సరాస మణికుమారి 2004 వరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మణికుమారి ఘోర ఓటమి పాలయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో మిత్రపక్షాలకు టికెట్ కేటాయించడంతో పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి నియోజకవర్గ ప్రజలు తమ ఓటుతో సరైన గుణపాఠం చెప్పడంతో ఘోరంగా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా గిడ్డి ఈశ్వరి కొనసాగుతున్నారు. వర్గ పోరు టీడీపీలో ముందునుంచి టీడీపీలో మాజీ మంత్రి మత్య్సరాస మణికుమారి, సీనియర్ నేత బొర్రా నాగరాజు, మాజీ ఎమ్మెల్యే తనయుడు, మాజీ జీసీసీ చైర్మన్ ఎంవీఎస్ ప్రసాద్, మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు ఉన్నారు. అప్పటి నుంచే టీడీపీలో వర్గ పోరు నడుస్తోంది. ఇక 2024 ఎన్నికల సమయానికి ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసిన కిల్లు రమేష్‌నాయుడు, టీడీపీ మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావులతో మరో రెండు వర్గాలు తయారయ్యాయి. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, టీడీపీ మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు, మాజీ జీసీసీ చైర్మన్ ఎంవీఎస్ ప్రసాద్, కిల్లు రమేష్‌నాయుడు టికెట్ ఆశిస్తున్నారు. వర్గాలతో సతమతమవుతున్న పాడేరు టీడీపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వారు సహకరించరని భావించి పొత్తుల్లో భాగంగా ఈసారి కూడా పాడేరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. పది రోజుల కిందట విజయవాడకు వెళ్లిన టీడీపీ టికెట్ ఆశావాహులకు పొత్తుల్లో భాగంగా ఈసారి పాడేరు అసెంబ్లీ టికెట్‌ను బీజేపీకి కేటాయిస్తున్న ట్టు కరాఖండీగా అధిష్టానం చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈనెల 13న తన అనుచరులతో తన నివాసం వద్ద అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 15న తన అనుచరులతో పాడేరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, బల ప్రదర్శన జరిపారు. ఈసారి పాడేరు అసెంబ్లీ టికెట్ బీజేపీకి కేటాయిస్తే టీడీపీ శ్రేణులు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని, పైగా అంతగా పట్టులేని బీజేపీకి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని నినాదించారు. పార్టీ కింద స్థాయి కేడర్, ఆశావాహుల అనుచరుల ఒత్తిడి మేరకు వర్గాలుగా ఉన్న టీడీపీ నాయకులు ఒక్కటయ్యారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చిన గెలిపించుకుందామని వారంత నిర్ణయించుకున్నారు. బీజేపీకే టికెట్ పొత్తుల్లో భాగంగా పాడేరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించేశారని, ఈ విషయంలో ఎటువంటి పునరాలోచన లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని తమ పార్టీ అధిష్టానం స్పష్టం చేసిందని, అయినప్పటికి మళ్లీ టీడీపీకి కేటాయించాలని వెంపర్లాడటం కరెక్ట్ కాదని బీజేపీ నాయకులు అంటున్నారు. అమరావతిలో పడిగాపులు వర్గాలుగా ఉన్న తామంతా ఒక్కటయ్యామని, ఈసారి టీడీపీకి టికెట్ కేటాయించాలని, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాయు నాయుడును కలిసి చెప్పుకుందామని పార్టీకి చెందిన టికెట్ ఆశావాహులు ఐదు రోజుల క్రితం అమరావతి వెళ్లారు. అప్పటి నుంచి అధినేత దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారు. పొత్తుల్లో భాగంగా మిత్ర పక్షమైన బీజేపీకి పాడేరు నియోజకవర్గం స్థానం దాదాపుగా కేటాయించినందునే పాడేరు నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఇష్ట పడడం లేదని వినికిడి. ఒక వైపు వైఎస్సార్సీపీ తమ అభ్యర్థులకు ప్రకటించి ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా పాడేరు నియోజకవర్గంలో పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి టికెట్ కేటాయిస్తారో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు అంతుపట్టడం లేదు. టికెట్ కేటాయింపు విషయంలో మూడు పార్టీల్లో స్పష్టత లేకపోవడంతో ఇప్పటికే టీడీపీలో ఉన్న కిందస్థాయి నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు. -
ఆ 23 మంది బలైనారా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నమ్మించి మోసగించడమే జన్మ లక్షణమైన టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయంగా వెంటాడే సంఖ్య 23. నమ్మకద్రోహానికి ప్రజలు విధించిన శిక్ష ఈ 23. ఈ సంఖ్య వెనుక కథ చాలా పెద్దదే కాదు.. అత్యంత హేయమైంది కూడా. 2014లో... అన్నీ తానై.. తనవారిని గెలిపించుకున్న ఎంఎల్ఏల్లో 23 మంది, ఎంపీల్లో ముగ్గురు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మకద్రోహం చేశారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నాయుడు విసిరిన నోట్ల కట్టలకు లొంగిపోయారు. పదవులకు ఆశపడ్డారు. భవిష్యత్తును ఊహించుకుని పార్టీ ఫిరాయించారు. ఆ తరువాత 2019 నాటికి చంద్రబాబు కాటుకు వారంతా రాజకీయంగా బలయ్యారు. చంద్రబాబుకూ ఆ ఎన్నికల్లో 23 సంఖ్య శాపమై నిలిచి,, చరిత్రగా మారింది. ఆనాడు రాజకీయ వెన్నుపోటుకు పాల్పడిన వారు నేడేం చేస్తున్నారు? పశ్చాత్తాపం పడిన వారెందరు? రాజకీయంగా కనుమరుగైన వారెవరు? కుంగిపోయి కునారిల్లుతున్న వారి భవిష్యత్తు ఏమిటి?.. వివరించే కథనమే ఇది. 23 మందిలో అద్దంకి నుంచి పోటీచేసిన గొట్టిపాటి రవికుమార్ మినహా తక్కిన 22 మంది మాజీలయ్యారు. వీరిలో ఎస్సీ వర్గాలకు చెందిన ఉప్పులేటి కల్పన (పామర్రు), పాలపర్తి డేవిడ్‌రాజు (యర్రగొండపాలెం), టి. జయరాములు (బద్వేలు), మణిగాంధీ (కోడుమూరు), మైనార్టీ వర్గానికి చెందిన అత్తార్ ఛాంద్బాషా (కదిరి), ఎస్వీ మోహన్‌రెడ్డి (కర్నూలు) వరుపుల సుబ్బారావు (ప్రత్తిపాడు)కు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు టికెట్లు ఇవ్వలేదు. రాయలసీమలో గుర్తింపు కలిగిన భూమా నాగిరెడ్డి కుటుంబం పరిస్థితి రాజకీయంగా దుర్భరంగా మారింది. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ టికెట్ కోసం తంటాలు పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపొందిన భూమా బ్రహ్మానంద రెడ్డిని కొన్ని నెలల కిందటి వరకు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగించిన చంద్రబాబు ఇప్పుడు ఎం.డి.ఫరూక్‌కు బాధ్యతలు అప్పగించారు. వైఎస్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న సి.ఆదినారాయణరెడ్డి కుటుంబీకులదీ అదే దుస్థితి. గత ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో ఓటమిపాలైన నాలుగు రోజుల్లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోక తప్పలేదు. ముగ్గురు ఎంపీల దుస్థితి అంతా ఇంతా కాదు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన ఎంపీలలో ముగ్గురు ప్రలోభాలకు లొంగి టీడీపీలో చేరి రాజకీయంగా దెబ్బతిన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరినా టికెట్ నిరాకరించడంతో జనసేన నుంచి నామినేషన్ వేశారు. ఆ తరువాత అనారోగ్యంతో మృతి చెందారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత పరిస్థితీ అంతే. ఆమెకు టికెటు దక్కకపోవడంతో పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతూ అరకు లోక్‌సభ పరిధిలో పర్యటిస్తున్నారు. కర్నూలులో బుట్టా రేణుక పార్టీ మారినా ఆమెకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. కందుకూరు: పోతుల రామారావు తన సామాజిక వర్గానికి చెందిన పోతుల రామారావు టీడీపీలోకి ఫిరాయించినందుకు పొగాకు, గ్రానైట్ వ్యాపారాలకు సంబంధించి చంద్రబాబు భారీగానే లబ్ధి చేకూర్చారన్నది బహిరంగ రహస్యం. 2019లో టికెట్ ఇచ్చినా వైఎస్సార్సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్‌రెడ్డి చేతిలో 14 వేల పైచిలుకు ఓట్లతో పోతుల ఓడిపోయారు. ఆ తరువాత ఆయన క్రమంగా నియోజకవర్గానికి దూరమయ్యారు. పార్టీ అధిష్టానం సైతం రామారావును పూర్తిగా పక్కన పెట్టేసింది. యర్రగొండపాలెం (ఎస్సీ): పాలపర్తి డేవిడ్‌రాజు టీడీపీలోకి ఫిరాయించేందుకు పెద్దమొత్తంలో ముట్టజెపుతానని, వెలిగొండ ప్రాజెక్టులో ప్యాకేజీలిచ్చి భారీగా లబ్ధి చేకూర్చుతానని నమ్మబలికిన బాబు మాట తప్పారని డేవిడ్‌రాజు వాపోని రోజంటూ లేదని ఆయన సన్నిహితులు గుర్తుచేస్తుంటారు. 2019 ఎన్నికల్లో సీటు తిరస్కరించడంతో తాను వైఎస్సార్సీపీలో చేరినట్లు అప్పట్లోనే డేవిడ్‌రాజు ప్రకటించుకున్నారు. బాబు మాటలను నమ్మి మోసపోయిన ఆయన తాజాగా కాంగ్రెస్ వైపు దృష్టి సారించారనేది సమాచారం. గిద్దలూరు: ముత్తుముల అశోక్‌రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు చేతిలో దాదాపు 79 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధం అంటున్నప్పటికీ జనసేనకు టికెట్ కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. జనసేన నుంచి తానే పోటీ చేయనున్నట్లు ఆమంచి స్వాములు ప్రకటించుకోవడంతో ముత్తుముల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పాడేరు (ఎస్టీ): గిడ్డి ఈశ్వరి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చేతిలో దాదాపు 43 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పాడేరు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో అనేక వర్గాలు పనిచేస్తున్నాయి. గిడ్డి ఈశ్వరికి సీటు దక్కుతుందా లేదా అన్నది అనుమానమే. పాతపట్నం– కలమట వెంకటరమణ టీడీపీలోకి ఫిరాయించిన కలమట 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో టికెట్ అనుమానాస్పదమే. మామిడి గోవిందరావు టికెట్ కోసం గట్టి పోటీ ఇస్తున్నారు. అరకు (ఎస్టీ): శ్రావణ్‌కుమార్ 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరిన రెండేళ్ల తర్వాత మావోయిస్టుల చేతిలో హతమయ్యారు. అనంతరం ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్‌కు ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నుంచి పోటీచేసిన శ్రావణ్‌కుమార్ మూడో స్థానంలో నిలిచారు. రెండేళ్ల కిందట కిడారిని నియోజకవర్గ ఇన్చార్జిగా తొలగించి అరకు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన సివేరి దొన్ను దొరను అరకు అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించారు. ఈయనే అసెంబ్లీ బరిలో ఉండవచ్చంటున్నారు. రంపచోడవరం (ఎస్టీ): వంతల రాజేశ్వరి టీడీపీలో చేరిన వంతల రాజేశ్వరి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి చేతిలో 39 వేలకు పైగా ఓట్లతో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రాజేశ్వరికి వ్యతిరేకంగా పనిచేస్తూ గొర్లె సునీత , కారం పోచమ్మ , మిరియాల శిరీష తదితరులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సైతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గూడూరు (ఎస్సీ): పాశం సునీల్ కుమార్ టీడీపీ కండువా కప్పుకున్న పాశం సునీల్ కుమార్ 2019లో పోటీచేసి వి.వరప్రసాద్ చేతిలో 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్‌్జగా కొనసాగుతున్న సునీల్‌కు 2024 ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ లేదు. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పోటీపడుతున్నారు. మరోవైపు జనసేన కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశిస్తోంది. జగ్గంపేట– జ్యోతుల నెహ్రూ సీనియర్ నాయకుడైన జ్యోతుల నెహ్రూ 2019లో టీడీపీ టికెట్ దక్కించుకున్నప్పటికీ జ్యోతుల చంటిబాబు చేతిలో 23 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జిగా నెహ్రూ కొనసాగుతున్నప్పటికీ జగ్గంపేట నుంచి పోటీకి జనసేన పట్టుపడుతోంది. ఆ పార్టీ ఇన్చార్జి పాఠంశెట్టి సూర్యచంద్రరావు సీటు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్తిపాడు– వరుపుల సుబ్బారావు టీడీపీ కండువా కప్పుకున్న వరుపులకు చంద్రబాబు గత ఎన్నికల్లో టికెట్ కాదుకదా కనీసం నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా బాధ్యతలు ఇవ్వలేదు. సుబ్బారావును కాదని వరుపుల రాజా(గతేడాది చనిపోయారు)కు ఇచ్చారు. తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చిన వరుపుల సుబ్బారావు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. పలమనేరు– ఎన్.అమర్నాథ్రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమరనాథ్ రెడ్డి టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవిని పొందారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకటేగౌడ చేతిలో 33 వేల ఓట్లతో చిత్తుగా ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. బొబ్బిలి– ఆర్వీఎస్కే రంగారావు (సుజయ్‌కృష్ణ రంగారావు) టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయిన సుజయ్ కృష్ణ రంగారావు 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు చేతిలో 8,352 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. రానున్న ఎన్నికల్లో ఆయన సోదరుడు బేబినాయనకు టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. పామర్రు (ఎస్సీ): ఉప్పులేటి కల్పన పామర్రు నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరారు. 2019లో ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. విజయవాడ వెస్ట్– జలీల్‌ఖాన్ టీడీపీలో చేరిన జలీల్‌ఖాన్ కుమార్తెకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చినప్పటికీ ఆమె ఓటమి పాలై రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తరువాత పరిణామాలలో జలీల్‌ఖాన్ నియోజకవర్గ ఇన్చార్జిగా కోరినా ఫలితం లేకుండా పోయింది. జమ్మలమడుగు: సి.ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన సి.ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి 3.80 లక్షల ఓట్లు తేడాతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఇప్పటికీ అదే పార్టీలో రాష్ట్ర ఉపా«ధ్యక్షుడి హోదాలో ఉన్నారు. బద్వేలు (ఎస్సీ) టి.జయరాములు బద్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ ఫిరాయించిన తిరువీధి జయరాములుకు 2019లో టీడీపీ టికెట్ నిరాకరించింది. ఓబులాపురం రాజశేఖర్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆ ఎన్నికల తర్వాత జయరాములు రాజకీయంగా కనుమరుగయ్యారు. కదిరి– అత్తర్ చాంద్ బాషా కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా 2014లో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. 2019లో టికెట్ కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నారు. శ్రీశైలం– బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నా ఈ ఎన్నికల్లో టికెట్ దక్కడం అనుమానమే. ఏరాసు ప్రతాప్ రెడ్డి పోటీపడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆళ్లగడ్డ– భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి గెలుపొందిన భూమా అఖిల ప్రియ టీడీపీలోచేరి మంత్రి పదవి పొందారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ స్థానం నుంచి టికెట్ కోసం భూమాకు పోటీ ఎదురవుతోంది. ఆళ్లగడ్డ కోసం జనసేన కూడా డిమాండ్ చేస్తోంది. నంద్యాల– భూమా బ్రహ్మానందరెడ్డి భూమా నాగిరెడ్డి చనిపోవడంతో 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. కొన్ని నెలల కిందటి వరకు అతన్నే ఇన్చార్జిగా కొనసాగించిన చంద్రబాబు ఆయన్ను తప్పించి మాజీ మంత్రి ఎండీ ఫరూక్‌ను ఇన్చార్జిగా నియమించారు. కర్నూలు– ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి టీడీపీలో చేరినా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. కోడుమూరు– మణిగాంధీ మణిగాంధీ టీడీపీలో చేరినా టికెట్ ఇవ్వలేదు సరికదా కనీసం ఇన్చార్జి పదవి కూడా కట్టబెట్టలేదు. తిరిగి వైసీపీలో కొనసాగుతున్నారు. -
పాడేరు టీడీపీలో
పాడేరు నియోజకవర్గంలో టీడీపీ నేతల వ్యవహారశైలి తలోదారి అన్నట్టుగా ఉంది. గత 20 ఏళ్లుగా ఉనికే లేని ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరడంతో అధిష్టానానికి మింగుడు పడటం లేదు. పార్టీ ప్రధాన నేతలంతా ఐదు వర్గాలుగా విడిపోయారు. వీరంతా వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం తలనొప్పిగా మారింది. ● వెలుగులోకి వర్గపోరు.. క్యాడర్ తలోదారి ● ఐదు గ్రూపులుగా విడిపోయిన నేతలు ● ఎవరికి వారే కార్యక్రమాల నిర్వహణ ● అసెంబ్లీ టికెట్ కోసం సిగపట్లు