padmavati bramhostavalu
-
వైభవంగా అమ్మవారి రథోత్సవం
తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి శనివారం ఉదయం రథోత్సవం నిర్వహించారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఊరేగింపు ముందు భక్తులు కోలాటం ప్రదర్శించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు -
సర్వభూపాల వాహనంపై పద్మావతీ అమ్మవారు
తిరుపతి: కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులో గురువారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వభూపాల వాహనంపై ఊరేగించారు. వాహనంపై ఊరేగుతున్న అమ్మవారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. భక్తులు సర్వభూపాల వాహనాన్ని మోసేందుకు పోటీపడ్డారు.