pageantry
-
మహారాణి కాలేజీలో అందాలపోటీలు..
యలహంక: బెంగళూరు నగరంలోని మహారాణి ఉమెన్స్ ఆర్ట్స్ కామర్స్ మేనేజ్మెంట్ కాలేజీలో శుక్రవారం అందాల పోటీలు నిర్వహించారు. ఈ అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన హిమబిందు విజేతగా నిలిచి మిస్మహరాణి–2017 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విద్యార్థిణిలు పాల్గొనగా హిమబిందు విజేతగా నిలిచినట్లు కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించిన కుశల, చేతన, గీతాలు తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ శాంతకుమారి తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
మిస్ యూనివర్స్ పోటీలు షురూ..
విశ్వ సౌందర్యం ఫిలిప్పైన్స్‌లో అందాలు విందులు చేస్తున్నాయి. జనవరి 30న ఆ దేశంలో జరగనున్న ‘మిస్ యూనివర్స్’ పోటీల కోసం దాదాపు 85 దేశాల నుంచి అందాల భామలంతా రాజధాని మనీలా చేరుకున్నారు. స్థానిక ప్రజలు వీరికి కరతాళధ్వనులతో, కేరింతలతో స్వాగతం చెబుతున్నారు. పోలీసు విభాగం హడావిడి చేసి దాదాపు 1300 మంది పోలీసులను ఈ పోటీలకు కేటాయిం చింది. ఎందరు అందాల భామలు ఉన్నా 15 దేశాల వారు అంతిమంగా బరిలో నిలువవచ్చనీ, వారిలో ఒకరు ‘మిస్ యూనివర్స్’ కావచ్చుననీ పండితులు అంచనాలు కడుతున్నారు. కొలంబియా, జర్మనీ, అమెరికా, చిలీ, ఫిలిప్పైన్స్, వెనిజులా, మెక్సికో దేశాలకు చెందిన సుందరీమణులకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వీరి ఉవాచ. భారతదేశం నుంచి రోష్మిత హరిమూర్తి ఈ పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అన్నట్టు మలేసియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిరణ్మీత్ కౌర్ కూడా మన భారతీయ సంతతికి చెందిన అమ్మాయే. మొత్తానికి కిరీటధారిణి ఎవరో తేలాలంటే జనవరి 30 వరకు ఆగాలి. -
విశాఖలో నేడు హిజ్రాల అందాల పోటీలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ సాగరతీరం గురువారం సాయంత్రం హిజ్రాల అందచందాల ప్రదర్శనకు వేదికగా నిలవనుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ‘ట్రాన్స్ క్వీన్’ పేరిట ట్రాన్స్‌జెండర్ (హిజ్రాలు) అందాల పోటీలు ఇక్కడ జరగబోతున్నాయి. 25 మంది హిజ్రాలు వీటిలో పాల్గొంటున్నారు. నాంది సర్వీస్ సొసైటీ, మూన్‌పవర్ ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను సొసైటీ అధ్యక్షుడు సూరాడ ఎల్లాజీ, సినీ నటి పూర్ణిమ, ప్రముఖ కొరియోగ్రాఫర్ అమిత్ పాండే బుధవారం విశాఖలో మీడియాకు వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు వంద ఎంట్రీలు రాగా, 25 మంది హిజ్రాలను ఎంపిక చేశామని ఎల్లాజీ తెలిపారు. వీరికి గురువారం సాయంత్రం 5 గంటలకు సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ పోటీలకు హీరోయిన్ కామ్న జెఠ్మలానీ, నేపథ్య గాయకుడు రేవంత్, సారు శిల్ప, రింగ్ డ్యాన్సర్ అంబికా, సినీ ఆర్టిస్ట్ చందుతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పా రు. న్యాయనిర్ణేతలుగా ఫొటోగ్రాఫర్ అగర్వాల్, సినీ నటి పూర్ణిమ, లెబెన్‌షిల్ఫే డెరైక్టర్ సరస్వతీదేవి వ్యవహరిస్తారని తెలిపారు. కాగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,400 మంది హిజ్రాల సంక్షేమం కోసం తమ సొసైటీ పని చేస్తున్నట్టు ఎల్లాజీ చెప్పారు.