Pagidyala
-
ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ నేతల వీరంగం..
-
ఢీ అంటే ఢీ: ఆకట్టుకున్న పొట్టేళ్ల పోటీలు
సాక్షి, పగిడ్యాల: ఉగాది పండుగను పురస్కరించుకుని పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో బుధవారం నిర్వహించిన పొట్టేళ్ల పోటీలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఫైనల్లో దామగట్ల జాకీర్ పొట్టేలు, పడమర ప్రాతకోట కాశీశ్వర యూత్ పొట్టేలు తలపడగా.. దామగట్ల పొట్టేలు విజేతగా నిలిచింది. దీని యాజమానితో పాటు వరుసగా ఐదు స్థానాల్లో నిలిచిన పొట్టేళ్ల యజమానులకు నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తువ్వా శివరామకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ రమేష్‌నాయుడు వెండి మెడల్స్, నగదు బహుమతులు అందజేశారు. చదవండి: విషాదం: మూడేళ్లకే ముగిసిన కథ! ప్రేమను గెలిపించిన పిడకల సమరం -
కృష్ణా నదిలో బోట్లు నడిపితే కఠిన చర్యలు
సాక్షి,కర్నూలు: కృష్ణానదిలో ఇంజిన్ బోట్ల ప్రయాణం నిషేధమని, ఎవరైనా బోట్లు తిప్పితే కఠిన చర్యలు తప్పవని కొత్తపల్లి ఎస్ఐ నవీన్‌బాబు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం సంగమేశ్వరం నుంచి తెలంగాణ ప్రాంతానికి ఇంజిన్‌బోట్లు నడుపుతున్న వారికి నోటీసులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ అనుమతుల్లేకుండా ఎవరైనా కృష్ణానది బ్యాక్‌వాటర్‌లో ఇంజిన్‌బోట్లల్లో ప్రయాణికులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామన్నారు. అలాగే పాతసిద్ధేశ్వరం గ్రామ సమీపం నుంచి తెలంగాణ రాష్ట్రం, సోమశిల ప్రాంతానికి చెందిన ఇంజిన్‌బోట్ల నిర్వాహకులు ప్రయాణికులను తరలిస్తున్నట్లు సమాచారం ఉందని ఎస్ఐ తెలిపారు. పర్యాటక కేంద్రం అనుమతులు ఉన్నవారు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. బోట్ల నిర్వాహకులకు నోటీసులు శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం పరిధిలోని కృష్ణానదిలో ప్రయాణికులను తీసుకెళ్లే బోట్ల యజమానులకు శ్రీశైలం సీఐ రవీంద్ర బుధవారం నోటీసులు జారీ చేశారు. ప్రతి బోటు నిర్వాహకుడు లైసెన్స్ కలిగి ఉండాలని, సుశిక్షులైన డ్రైవర్‌తో పాటూ సహాయకులుగా ఇద్దరు ఉండాలని, ప్రతి బోట్లో లైఫ్ జాకెట్లతో పాటూ లైఫ్‌బోట్ ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలు పాటించని బోటు నిర్వాహకులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కదలని ఇంజిన్ బోట్లు పగిడ్యాల: శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో అనుమతి లేకుండా ఇంజన్ బోట్లు తిప్పరాదని అధికారుల హెచ్చరికలతో మూర్వకొండ, ఆర్లపాడు ఘాట్లు నిర్మానుష్యంగా మారింది. ఇంజిన్ బోట్లను ఘాట్ చివర్లో రాళ్లకు కట్టి పడేశారు. కృష్ణానదికి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తున్నందున అలల ప్రభావం ఉధృతంగా కనిపిస్తోంది. అయితే మత్య్సకారులు చేపలు పట్టేందుకు నాటు పుట్టిల్లో వెళ్లి నదిలో వేట సాగిస్తున్నారు. బుధవారం ఉదయం ముచ్చుమర్రి ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఏఎస్ఐ కృష్ణుడు, కానిస్టేబుల్ శేషారాం సింగ్ ఘాట్‌ను సందర్శించి ప్రయాణికులను తరలిస్తే సమాచారం ఇవ్వాలని మత్య్సకారులకు సూచించారు. తహసీల్దార్ కె. శ్రీనివాసులు కూడా అర్లపాడు, మూర్వకొండ ఘాట్లపై ఆరా తీశారు. చదవండి : బోటును ఒడ్డుకు తీసుకురాలేం -
ఆగిన అన్నదాతల గుండె
సాక్షి, పగిడ్యాల(కర్నూలు): వ్యవసాయం కలిసి రాకపోవడం, పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడం.. వెరసి ఒకే గ్రామంలో ఇద్దరు రైతులు గుండెపోటుకు గురయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని ప్రాతకోట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఉద్దగిరి కృష్ణ(50) ఎకరా సొంత పొలంతోపాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసేవాడు. ఏటా పంటలు సాగు చేస్తున్నా వచ్చిన దిగుబడి ఖర్చులకు కూడా సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో పంట పెట్టుబడులతోపాటు కుటుంబ ఖర్చుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో ఆందోళనకు గురైన కృష్ణ ఆదివారం గుండెపోటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించగా కోలుకోలేక మరణించాడు. ఇదే గ్రామా నికి చెందిన బోయ నాగేష్(66) ఉదయం శేషగిరిరావు పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి గుండెపోటుకు గురై మరణించాడు. ఒకే రోజు ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాలకు సిద్ధార్థరెడ్డి పరామర్శ.. బాధిత కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పరామర్శించారు. ఉద్దగిరి కృష్ణ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌నాయుడు, నాయకులు కురుమన్న, అంకిరెడ్డి, మల్లయ్య, స్వాములు తదితరులున్నారు. -
అట్టహాసంగా ప్రారంభమైన బండలాగుడు పోటీలు
పగిడ్యాల (కర్నూలు జిల్లా) : సంక్రాంతి తిరుణాళ్లను పురస్కరించుకుని పడమర ప్రాతకోటలోని శ్రీ కాశీవిశ్వేశ్వర, నందీశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో శనివారం పాలపళ్ళ సైజు వృషభరాజముల బండలాగుడు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను మాల మహానాడు తాలుకా అధ్యక్షుడు, పవన్ సీడ్స్ అధినేత అచ్చన్న, ప్రతిభ బయోటెక్ సెల్స్ ఆఫీసర్ బాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బండలాగుడు పోటీలను నిర్వహించడం వలన రైతుల్లో నూతనోత్తేజం వస్తుందన్నారు. హలం పట్టి దుక్కి దున్ని తన చెమటను రక్తంగా మార్చి ఆహార ఉత్పత్తులను పండిస్తున్నా గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విఫలం కావడం వలన రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సంక్రాంతి పండుగను పురష్కరించుకుని నిర్వహించే శ్రీ కాశీవిశ్వేశ్వర, నందీశ్వరస్వామి తిరుణాళ్లలో బండలాగుడు పోటీలను ఏర్పాటు చేయాలని కోరిన గ్రామ కమిటీ విజ్ఞప్తి మేరకు తమ వంతు సాయంగా రూ. 2 వేలు, రూ. 10 వేలు అందజేశామని వెల్లడించారు. ఇంకా మొదటి బహుమతికి గ్రామకమిటీ రూ. 25 వేలు ఇవ్వగా మిగిలిన నాల్గవ, ఐదవ బహుమతుల కింద ఇచ్చే నగదు పారితోషికాన్ని మాజీ సర్పంచ్ గట్టన్న, అంబటి శివశంకరరెడ్డిలు ఇచ్చారని వివరించారు. ఇలా చేయి చేయి కలిపి నిర్వహించే తిరుణాల వేడుకలలో పోటీలను ప్రారంభించేందుకు అవకాశం లభించడం హర్షనీయమన్నారు. బండలాగుడు పోటీలలో పాల్గొన్న 15 జతల వృషభాల యజమానులు తమ గెలుపు కోసం శ్రమించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ శేషు, ఎం.వి.శేషయ్య, యర్రం వెంకటరెడ్డి, అంబటి శివశంకరరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గుర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
పగిడ్యాల (కర్నూలు జిల్లా) : పోలియో మహమ్మారిని నిర్మూలించడానికి ఆదివారం(జనవరి 17) చేపట్టనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి విశ్వేశ్వరరెడ్డి కోరారు. శనివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి గ్రామ పురవీధుల్లో నినాదాలు చేయిస్తూ ర్యాలీ చేట్టారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. రోజుల నుంచి 5 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. బస్స్టాప్ల్లోను, ప్రధాన కూడళ్ల వద్ద, ఆరోగ్య ఉపకేంద్రాల వద్ద పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. అలాగే ఇతర గ్రామాల నుంచి పండుగకు వచ్చిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించుకోవడం మరువరాదన్నారు. చుక్కలు వేయించడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని, రియాక్షన్ రాదని వివరించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ పార్వతీ, ఏపీఎంవో నారాయణరావు, హెల్త్‌సూపర్‌వైజర్ కరీం, మెహరున్నీసా బేంగం, ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు, అంగన్వాడవీ కార్యకర్తలు తదితరులు పాల్గొనారు. -
ఉద్యోగం పేరుతో రూ.2.50 లక్షలకు టోపీ
పగిడ్యాల (కర్నూలు జిల్లా) : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు దండుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదయింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం పీకే ప్రాగటూరు గ్రామానికి చెందిన గువ్వల బాబుకు ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. హైదరాబాదుకు చెందిన మల్లేశం అనే వ్యక్తి రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. అయితే నెలలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకుండా, తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా.. ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో మోసానికి గురయ్యానని తెలుసుకున్న బాధితుడు గువ్వల బాబు గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పట్టణానికి చెందిన మల్లేశంపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముచ్చుమర్రి ఎస్ఐ శివాంజల్ తెలిపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళన
పగిడ్యాల (కర్నూలు): ప్రేమించి.. పెళ్లి చేసుకుని వంచించిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ సోమవారం కర్నూలు జిల్లా పగిడ్యాల మండలంలోని పడమర ప్రాతకోట మైనార్టీ కాలనీలోని ప్రియుడి ఇంటి ముందు నిరాహారదీక్ష చేపట్టింది. బాధితురాలి కథనం ప్రకారం.. పడమర ప్రాతకోట గ్రామానికి చెందిన షేక్ జబివుల్లా నాలుగేళ్ల క్రితం పని నిమిత్తం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం బోడుప్పల్‌కు వెళ్లాడు. అక్కడ హోటల్ నిర్వాహకుడి కుమార్తె భావనతో పరిచయమైంది. కొంతకాలానికి అతడు ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. తాను వివాహితనని, తనకు భర్త, పిల్లలు ఉన్నారని చెప్పినా జబివుల్లా వినిపించుకోలేదు. జబివుల్లాతో భావనకు ఉన్న పరిచయాన్ని చూసి ఆమెను భర్త వదిలేశాడు. ఈ నేపథ్యంలో జబీవుల్లా, భావన 2011 ఏప్రిల్‌లో భువనగిరిలోని ఎల్లమ్మ దేవాలయంలో స్నేహితుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో రెండున్నరేళ్లు కాపురం చేశారు. ఆ తర్వాత తన తల్లిదండ్రులను ఒప్పించి ఇంటికి తీసుకెళ్తానంటూ ఈఏడాది ఏప్రిల్‌లో జబివుల్లా ప్రాతకోటకు వెళ్లాడు. అయితే, ఆరు నెలలుగా ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి భావన ప్రాతకోటలో ఆరా తీసింది. మరొక యువతిని జబివుల్లా పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న ఆమె నిర్ఘాంతపోయింది. తనకు న్యాయం చేయాలని ఆవాజ్ కమిటీ సభ్యుల వద్ద పంచాయితీ పెట్టినా న్యాయం జరగలేదు. దీంతో భావన జబివుల్లా ఇంటిముందు నిరాహారదీక్ష చేపట్టింది. తనను భార్యగా జబివుల్లా అంగీకరించకపోతే అతని ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె విలేకరులకు తెలిపింది. డబ్బుల కోసం వచ్చానని జబివుల్లా తల్లిదండ్రులు తనపై లేనిపోని నిందలు మోపుతున్నారని భావన కన్నీటిపర్యంతమైంది. ఈ విషయమై ముచ్చుమర్రి ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా.. విషయం తన దృష్టికి వచ్చిందని.. బాధితురాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే నిందితుడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
వైఎస్సార్సీపీ ఏజెంట్ హఠాన్మరణం
పగిడ్యాల, న్యూస్‌లైన్: స్థానిక 18వ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తరఫున ఏజెంట్‌గా ఉన్న కుమ్మరి నరసింహులు(30) హఠాన్మరణం చెందాడు. ఉదయం 7 గంటలకు ఏజెంట్‌గా కూర్చున్న ఆయన మధ్యాహ్నం 12 గంటలకు పోలింగ్ కేంద్రంలోనే మూర్చ వచ్చి కింద పడిపోయాడు. గమనించిన పోలింగ్ సిబ్బంది వెంటనే స్థానిక ఆర్ఎంపీ వైద్యుదుడికి వద్దకు తీసుకెళ్లగా ఆయన చికిత్స చేస్తుండగా కొద్ది సేపటికే మృతి చెందాడు. మృతునికి విజయలక్ష్మి, భార్గవి, వైష్ణవి, హేమంత్‌కుమార్ నలుగురు పిల్లలు సంతానం. భార్య కూడా ఆరు నెలల క్రితమే మృతి చెందింది. పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరు దూరం కావడంతో వృద్ధురాలైన మృతుని తల్లి నాగమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. విషయం తెలుసుకున్న వైఎఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పగిడ్యాలకు చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. నలుగురు పిల్లలను బాగా చదివించే బాధ్యతను తీసుకుంటానని మాండ్ర శివానందరెడ్డి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పగిడ్యాల -2 ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన రమాదేవి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే ఒక ఆడపిల్లను దత్తత తీసుకుంటానని ముందుకు వచ్చారు. పలువురు నాయకులు మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.