పగిడ్యాల (కర్నూలు జిల్లా) : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు దండుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదయింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం పీకే ప్రాగటూరు గ్రామానికి చెందిన గువ్వల బాబుకు ఎస్‌ఐ లేదా కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. హైదరాబాదుకు చెందిన మల్లేశం అనే వ్యక్తి రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు.
అయితే నెలలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకుండా, తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా.. ఫోన్‌లో కూడా అందుబాటులో లేకపోవడంతో మోసానికి గురయ్యానని తెలుసుకున్న బాధితుడు గువ్వల బాబు గురువారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పట్టణానికి చెందిన మల్లేశంపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముచ్చుమర్రి ఎస్‌ఐ శివాంజల్ తెలిపారు.
ఉద్యోగం పేరుతో రూ.2.50 లక్షలకు టోపీ
Published Thu, Dec 17 2015 7:39 PM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM
Advertisement
Advertisement