30న ‘అరుణోదయ’ జిల్లా సదస్సు
నకిరేకల్, న్యూస్‌లైన్: ఈ నెల 30న నల్లగొండలోని టౌన్హాల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా సదస్సును నిర్వహిస్తున్నట్లు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైలం సంతోష్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్సూర్, పల్స నిర్మల తెలిపారు. సదస్సుకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం నకిరేకల్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ 30వ తేదీన ఉదయం 11 గంటలకు టౌన్‌హల్‌లో జిల్లా సదస్సు, సాయంత్రం 6 గంటలకు క్లాక్‌టవర్ తెలంగాణ చౌక్ వద్ద బహిరంగా సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సదస్సుకు జిల్లాలోని వివిధ రంగాల కళాకారులు 200 మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సమాఖ్య రాష్ట్ర , జిల్లా కమిటీల నియామకం, భవిష్యత్ లక్ష్యా ల కోసం సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సదస్సుకు ముఖ్య అతిథులుగా విమలక్క, కవి,పరిశోధకుడు జయధీర్, తెలంగాణ జేఏసీ కోచైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మకంటి కొమరయ్య, పీడీఎస్‌యూ జిల్లా కన్వీనర్ ఆవుల నాగరాజు, జిల్లా నాయకులు యానాల లింగారెడ్డి, పల్సగిరి, బోడ్డు శంకర్, మిట్టా నర్సిరెడ్డి, రంగన్న, రామలింగయ్య, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.