Pakeezah Actress
-
పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ!
పాకీజా అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెహన్‌బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో తన పాత్రకు ప్రేక్షకులను మెప్పించింది. అలా తెరపై అందరినీ నవ్వించిన ఆమెకు నిజ జీవితంలో మాత్రం కష్టాలు వదలడం లేదు. తమిళనాడు సీఎం జయలలిత మరణం తర్వాత తన పరిస్థితి చాలా దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి కూడా సరిగా తిండి లేక ఇబ్బందులు పడ్డామని వాపోయింది. ఆమె అసలు పేరు వాసుకి కాగా.. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్‌తో పాకీజాగా మారిపోయింది. (ఇది చదవండి: దీనస్థితిలో పాకీజా.. అండగా నిలిచిన మంచు విష్ణు) అయితే జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆమెకు టాలీవుడ్ ప్రముఖులు అండగా నిలిచారు. మెగా ఫ్యామిలీతో పాటు మా అసోసియేషన్ ఆమె సాయం చేశారు. అంతేకాకుండా మా అసోసియేషన్ తరఫున మంచు విష్ణు ఆమెకు గుర్తింపు కార్డును సైతం అందజేశారు. ఈ తరుణంలో మళ్లీ సినిమాల్లో అవకాశాలు వస్తాయన్న ఆశతో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇక్కడే ఉంటూ నగరంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. అయితే పాకీజాకు ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. సీరియల్స్‌తో పాటు కామెడీ షో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె కష్టాలను తీర్చలేకపోయాయి. ఎప్పటిలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతోంది. దీంతో ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో తిరుపతిలో భిక్షాటన చేస్తూ కనిపించింది. తాను ఇంకా అర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. తిరుపతిలోని దుకాణాల యజమానులు ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ కనిపించింది. ఒక ఆర్టిస్ట్‌గా అందరి నవ్వించిన వాసుకిని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనకుండా ఉండలేరు. సినీ ఇండస్ట్రీలో అందరి జీవితాలు ఓకేలా ఉండవని ఆమె పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. (ఇది చదవండి: నా సొంతింటికి వచ్చినట్లు ఉంది.. చెన్నైకి వెళ్లను: సీనియర్ నటి పాకీజా) -
నా సొంతింటికి వచ్చినట్లు ఉంది.. చెన్నైకి వెళ్లను: సీనియర్ నటి పాకీజా
సినీ నటుల జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వారి జీవితంలో ఒడుదొడుకులు రావడం సహజం. ఇక కొందరి జీవితాలు మరీ దుర్భరమైన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడిన వారిలో సీనియర్ నటి పాకీజా ఒకరు. ఆమె దీన స్థితిని చూసిన టాలీవుడ్ హీరోలు ఆమెకు సాయం కూడా చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు. (ఇది చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్) కొన్నేళ్లుగా చెన్నైలో ఉంటున్న ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ వెండితెరపై ఆమెకు అవకాశాలు రావడంతో బిజీ అయిపోయారు. తెలుగులో మోహన్ బాబు నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీతో ఆమె ఫేమస్ అయిపోయారు. (ఇది చదవండి: దీనస్థితిలో పాకీజా.. అండగా నిలిచిన మంచు విష్ణు) అయితే ఆమె హైదరాబాద్‌లోనే అద్దెగదిలో ఉంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చెన్నైలో తాను చాలా ఇబ్బందులు పడినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు వచ్చాక ఆ పరిస్థితులు మారిపోయాయని తెలిపారు. ఇక్కడ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి హైదరాబాద్‌లోనే ఉంటానని.. చెన్నై వెళ్లనని సంతోషంగా చెబుతోంది పాకీజా వాసుకి. -
దీనస్థితిలో పాకీజా.. అండగా నిలిచిన మంచు విష్ణు
సినీ నటుల జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వారి జీవితంలో ఒడుదొడుకులు రావడం సహజం. ఇక కొందరి జీవితాలు మరీ దుర్భరమైన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి పాకీజా. ఆమె దీన స్థితిని చూసిన టాలీవుడ్ హీరోలు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు సాయం చేయగా.. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు. అసెంబ్లీ రౌడీ చిత్రంలో ఆమె పాత్రకు బాగా గుర్తింపు వచ్చింది. బ్రహ్మనందంతో కలిసి ఆమె చేసిన కామెడీకి తెలుగు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. చాలా సినిమాల్లో ఆర్టిస్ట్‌గా రాణించిన ఆమె పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెంటనే పాకీజాకి లక్షరూపాయలు అందించి మరోసారి మంచి మనసును చాటుకున్నారు. ఆ తర్వాత ఆమె విషయం తెలుసుకున్న మోహన్ బాబు.. స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. తాను అమెరికాలో ఉన్నానని ఇండియా రాగానే సాయం చేస్తానని మాట ఇచ్చినట్లుగా పాకీజా తెలిపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు. తన సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డును ఆమెకు అందించనున్నాడు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మా అసోసియేషన్ కార్డుకు గతంలో రూ.లక్ష రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు రూ. 90 వేలకు తగ్గించారు. మా అసోసియేషన్‌కు కట్టాల్సిన రూ.90 వేల రూపాయలను మంచు విష్ణు చెల్లించి పాకీజాకు కార్డు ఇస్తారంటూ కల్యాణి వెల్లడించింది. దీంతో ఆమె కుటుంబానికి మా అసోసియేషన్ ద్వారా లభించే అన్నింటికీ అర్హత దక్కుతుందని తెలిపింది. -
నటి కన్నుమూత.. కొడుకు జాడలేదు
సాక్షి, ముంబై: దుర్భర పరిస్థితులను ఎదుర్కున్న అలనాటి బాలీవుడ్ నటి గీతా కపూర్(57) ఇక లేరు. శనివారం ఆమె ఉంటున్న వృద్ధాశ్రమంలో కన్నుమూసినట్లు ఫిల్మ్‌మేకర్- సీబీఎఫ్సీ సభ్యుడు అశోక్ పండిట్ వెల్లడించారు. ‘మేం ఆమెను మాములు మనిషిని చేయాలని యత్నించాం. కానీ, కొడుకు-కూతురు గురించి ఆలోచించి ఆమె రోజురోజుకీ కుంగిపోయారు. ఏడాదిగా వారి జాడ కోసం మేం చెయ్యని యత్నంలేదు. అనారోగ్యంతో చివరకు ఆమె కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని కూపర్ ఆస్పత్రిలో ఉంచాం. వారి పిల్లలు, బంధువులు వస్తారేమో రెండు రోజులపాటు ఎదురుచూస్తాం. రానిపక్షంలో మేమే అంత్యక్రియలు జరిపిస్తాం’ అని పండిట్ చెబుతున్నారు. పాకీజా వంటి క్లాసిక్ చిత్రంలో నటించిన(రాజ్‌కుమార్ రెండో భార్య పాత్రలో) గీతా కపూర్‌ను అనారోగ్యం కారణంగా గతేడాది మే నెలలో తనయుడు ముంబై గోరేగావ్‌లోని ఎస్వీఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆపై డబ్బు తేవాలంటూ ఏటీఎంకు వెళ్లిన అతను అటునుంచి అటే పారిపోయాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. ఆపై మీడియా కథనాల ఆధారంగా ఆమె దుస్థితి గురించి తెలుసుకున్న అశోక్ పండిట్ ఆ బిల్లులను చెల్లించి వృద్ధాశ్రమంలో చేర్పించారు. తల్లి మరణం నేపథ్యంలో ఇప్పటికైనా వారు తిరిగొస్తారని వృద్ధాశ్రమంలోని ఆమె సహచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆమె మీడియాతో చెప్పిన మాటలు... 'అతని చర్యలను తప్పుబట్టడంతో నన్ను కొట్టేవాడు. నాలుగు రోజులకు ఒకసారే అన్నం పెట్టేవాడు. కొన్నిసార్లు నన్ను గదిలో పెట్టి బంధించాడు. నేను వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడు. అతడు ఉద్దేశపూర్వకంగా ఆకలితో మాడ్చి.. నేను అనారోగ్యానికి గురయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. నా ప్రాణం పోయినా ఫర్వాలేదు. కానీ, ఇప్పుడు నా కొడుకు నాక్కావాలి. ఒక్కసారి చూడాలని ఉంది' అని ఆమె తెలిపారు. -
ఆ నటిని ఓల్డ్ ఏజ్ హోమ్ కు తరలించారు
'పాకీజా' చిత్రంలో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన అలనాటి నటి గీతా కపూర్ ను ఇటు కొడుకు.. అటు కూతురు ఇద్దరూ అనాథగా వదిలేశారు. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను తన కొడుకు ఆసుపత్రిలో నిస్సహాయస్థితిలో వదిలేసి వెళ్లడంతో ప్రస్తుతం గీతా కపూర్ ను వృద్ధశ్రమానికి తరలించారు.గీతాజీని చాలా గౌరవప్రదమైన ఓల్డ్ ఏజ్ హోమ్ కు తరలించామని, తల్లిని కొడుకు వదిలిపెట్టడం అతిపెద్ద నేరమని ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ అన్నారు. గత నెల ముంబైలోని గోరేగావ్‌లోని ఎస్వీఆర్ ఆస్పత్రిలో ఆమెను తన కుమారుడు చేర్పించాడు. ఆ తరువాత బిల్లు కట్టేందుకు ఏటీఎం నుంచి డబ్బు తీసుకొస్తానంటూ చెప్పి వెళ్లిపోయిన అతడు ఇంతవరకు తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది. కుమార్తెకు ఫోన్ చేసినా రాంగ్ నంబర్ అంటూ పెట్టేసింది. దీంతో అనాథగా ఆసుపత్రిలో ఏడుస్తూ ఉండిపోయింది. తనను వదిలించుకోవాలని తన కొడుకు చూసేవాడని, అందుకే తనను ఆస్పత్రిలో వదిలేసి పోయాడని ఆమె మీడియాకు తెలిపింది. 'అతని చర్యలను తప్పుబట్టడంతో నన్ను కొట్టేవాడు. నాలుగు రోజులకు ఒకసారే అన్నం పెట్టేవాడు. కొన్నిసార్లు నన్ను గదిలో పెట్టి బంధించాడు. నేను వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడు. అతడు ఉద్దేశపూర్వకంగా ఆకలితో మాడ్చి.. నేను అనారోగ్యానికి గురయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు' అని ఆమె తెలిపింది. ఇక గీతాకపూర్ కూతురు పూజ కూడా ఈ విషయంలో పట్టనట్టు దూరంగా ఉండటంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆమెను వృద్ధశ్రమానికి తరలించారు.