Paktika
-
Afghan earthquake: జీవచ్ఛవాలు
గయాన్ (అఫ్గానిస్తాన్): అఫ్గానిస్తాన్‌ను కుదిపేసిన పెను భూకంపం భారీ విధ్వంసాన్ని మిగిల్చింది. ఊళ్లకు ఊళ్లు నేలమట్టమయ్యాయి. వ్యవప్రయాసల కోర్చి సహాయ చర్యల కోసం వెళ్లిన సిబ్బంది కొండల్లో మృతదేహాలు ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా పడి ఉండటం చూసి కంటతడి పెడుతున్నారు. వాటిని వెలికి తీయడం తప్ప చేయడానికి అక్కడేమీ లేదని సహాయ సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేశారు. బుధవారం నాటి భూకంపంలో వెయ్యి మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. పక్తిక ప్రావిన్స్‌లోని గయాన్, బర్మల్ జిల్లాల్లో అత్యధికంగా విధ్వంసం జరిగింది. అక్కడి ఊళ్లన్నీ శిథిలాల దిబ్బలుగా మిగిలాయి. ప్రాణాలతో బయట పడ్డవారు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. జీవచ్ఛవాలుగా మారారు. అయిన వారి కోసం వారు ఏడుస్తూ వెదుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. భారీ వర్షం సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. ఉత్తర వజరిస్తాన్ నుంచి అఫ్గాన్‌కు వెళ్లిన 30 మంది పాకిస్తానీలు భూకంపానికి బలైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. చేతులే ఆయుధాలుగా గ్రామాలన్నీ నేలమట్టం కావడంతో శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో చూసేందుకు గ్రామస్తులు చేతులనే ఆయుధాలుగా మార్చుకున్నారు. గుట్టలుగా పడున్న రాళ్లు, రప్పలను చేతులతో తొలగిస్తున్నారు. తలదాచుకోవడానికి తమకు కనీసం టెంట్ కూడా లేదని వాళ్లు వాపోతున్నారు. పరిసర ఊళ్ల వాళ్లు తప్ప ప్రభుత్వం నుంచి ఎవరూ సాయానికి రావడం లేదని చెబుతున్నారు. తిండికి కూడా లేక వారంతా అల్లాడుతున్నారు. ఎక్కడ చూసినా మరణించిన తమవారి ఆత్మశాంతి కోసం బాధితులు చేస్తున్న ప్రార్థనలే వినిపిస్తున్నాయని కవరేజీకి వెళ్లిన బీబీసీ జర్నలిస్టు చెప్పారు. సహాయ చర్యలకు రంగంలోకి దిగినట్టు యునిసెఫ్ చెప్పింది. మృతుల్లో చిన్నారులే అధికం భూకంపంలో పిల్లలు, యువతే అత్యధికంగా బలైనట్టు వైద్య సిబ్బంది వెల్లడించారు. రెండు హెలికాఫ్టర్లలో పక్తిక ప్రావిన్స్‌కు వెళ్లిన వైద్యులకు ఎటు చూసినా పిల్లలు, యువత శవాలే కనిపిస్తున్నాయి. భూకంప తీవ్రతకు సెల్ టవర్లు కూడా కూలి కమ్యూనికేషన్లు తెగిపోవడంతో సమాచారం తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది. ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో కొద్ది రోజులైతే తప్ప తేలేలా లేదు. -
అఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి
కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ నెత్తుటేర్లు పారాయి. పక్తికా రాష్ట్రంలోని మారుమూల పట్టణం ఉర్గున్‌లో మంగళవారం రద్దీ మార్కెట్, మసీదు వద్ద ఓ ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో పలువురు పిల్లలు, మహిళలు సహా 89 మంది అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారు. మరో 42 మంది గాయపడ్డారు. మృతుల్లో పలువురు పిల్లలు, మహిళలు ఉన్నారు. తూర్పు అఫ్ఘాన్‌లో పాక్ సరిహద్దుకు దగ్గరున్న ఈ పట్టణంలో మానవ బాంబర్ జనంతో రద్దీగా మార్కెట్లోకి పేలుడు పదార్థాలు నింపిన కారును నడుపుకుంటూ వెళ్తూ ఆ వాహనాన్ని పేల్చేసుకున్నాడు. రంజాన్ పండుగ కోసం సరుకులు కొనుక్కోవడానికి జనం పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు రావడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. పేలుడు ధాటికి 20 దుకాణాలు, పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దారుణానికి పాల్పడింది తాము కాదని తాలిబన్లు పేర్కొన్నారు. -
సుస్మిత హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
భారతీయ రచయిత్రి సుస్మిత బెనర్జీ హత్య కేసులో ఆఫ్ఘాన్ పోలీసులు పురోగతి సాధించారు. ఆ కేసుకు సంబంధించి ఇద్దరు తీవ్రవాదులను గత అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు పక్నిక గవర్నర్ అధికార ప్రతినిధి మెక్లిస్ ఆఫ్ఘాన్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. ఆమె రచన ద్వారా తాలిబన్లను ఆగౌరవ పరిచిందని, ఈ నేపథ్యంలో సుష్మితను చంపమని తమకు పై నుంచి ఆదేశాలు అందాయని తీవ్రవాదులు ఇద్దరు తమ విచారణలో వెల్లడించారని ఆఫ్ఘాన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటర్నేట్ ద్వారా ఆమె ఆఫ్ఘాన్ దేశ రహస్యాలను భారత్‌కు చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడుతోందని వారు ఆరోపించినట్లు తెలిపారు. నిందితులు తాలిబన్ అనుబంధ సంస్థ హక్కానికి చెందిన తీవ్రవాదులుగా భావిస్తున్నామన్నారు. పక్నిక ప్రావెన్స్ రాజధాని సహర్నలో వీరిని సోమవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. భారత్‌కు చెందిన సుస్మిత ఆఫ్ఘానిస్థాన్‌లో వ్యాపారవేత్త జాన్బాజ్ ఖాన్‌ను వివాహాం చేసుకున్నారు. అనంతరం ఆమెపై మతం మార్చుకోవాలని తాలిబాన్లు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆ క్రమంలో ఆమెను అపహరించుకు పోయారు. ఆమె వారి చెర నుంచి తప్పించుకుని కొల్‌కత్తాలో కొంత కాలం నివసించారు. ఆ సమయంలో ఆమె కాబూలీవాలాస్ బెంగాలీ వైఫ్ పేరిట ఓ పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2003లో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఓ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. గత మంగళవారం ఆఫ్ఘానిస్థాన్‌లోని సుస్మిత నివాసంలో హత్యకు గురైయ్యారు.