కల్లు డిపోలపై కేసీఆర్ ప్రకటన దారుణం
మాల మహానాడు తెలంగాణ ఇన్చార్జి పాలడుగు విమర్శ
ఇప్పటికే కల్తీ కల్లుతో పేదల బతుకులు ఛిద్రమవుతుంటే టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు హైదరాబాద్ నగరంలో మూతబడిన కల్లు డిపోలను తెరిపిస్తామని ప్రకటించడం దారుణమని మాల మహానాడు తెలంగాణ జిల్లాల ఇన్చార్జి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు అనిల్‌కుమార్ విమర్శించారు.
సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఒకవైపు మహిళలంతా మద్య నిషేధంపై ఉవ్వెత్తున ఉద్యమాలు నిర్మిస్తుంటే కేసీఆర్ కల్లు దుకాణాలు తెరిపిస్తాననడం ఎంతవరకు సమంజసమన్నారు