Palak Alwani
-
అనుష్కలా సినిమాలు చేయాలనుంది
‘‘అనుష్క, సాయి పల్లవి చేస్తున్నట్లుగా డిఫరెంట్, స్ట్రాంగ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. కానీ నేను స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాను. ప్రస్తుతానికి దర్శకులను నమ్మి సినిమాలు చేస్తాను. ఆ తర్వాత నా ఛాయిస్‌కి తగ్గ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటాను’’ అన్నారు హీరోయిన్ పాలక్ లల్వానీ. రంజిత్, పాలక్ లల్వానీ జంటగా ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేమ్ త్రికోటి దర్శకత్వంలో భరత్ సోమి నిర్మించిన చిత్రం ‘జువ్వ’. కీరవాణి స్వరకర్త. ఈ నెల 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పాలక్ లల్వానీ మాట్లాడుతూ – ‘‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాలో నా నటన చూసి దర్శకుడు త్రికోటì గారు ఈ సినిమా కోసం సెలెక్ట్ చేశారు. ఈ సినిమా కథ బాగా నచ్చింది. రంజిత్ మంచి కో–స్టార్. అతను చాలా బాగా చేశాడు. నా ఫస్ట్ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. కానీ అది నన్ను అంతగా ఎఫెక్ట్ చేయలేదు. ఎందుకంటే సినిమా రిజల్ట్ హీరోయిన్లను అంతగా ఎఫెక్ట్ చేయవని అనుకుంటున్నాను. ప్రస్తుతం తమిళంలో జీవీ ప్రకాష్‌తో ఓ సినిమా, ‘కేరింత’ ఫేమ్ విశ్వాంత్ సరసన ఓ సినిమా చేశాను. అవి రెండూ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. ఫ్యూచర్లోనూ మంచి రోల్స్ సెలెక్ట్ చేసుకుంటాను’’ అన్నారు. -
ఎగిసే తారాజువ్వ
రంజిత్, పాలక్ లాల్వానీ హీరో హీరోయిన్లుగా ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేమ్ త్రికోటి పేట దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘జువ్వ’. ఎస్వీ రమణ సమర్పణ లో సొమ్మి ఫిలింస్‌పై భరత్ సొమ్మి నిర్మించారు. హైదరాబాద్, వైజాగ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు, బెంగళూర్‌లో కార్ ఛేజ్, మలేసియాలో రెండు పాటలు చిత్రీకరించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సినిమా ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. జనవరి మూడో వారంలో ఆడియోను, ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలీ, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, లత, తులసి, రఘుబాబు, ఏడిద శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ–మాటలు: ఎమ్.రత్నం, సాహిత్యం: అనంత శ్రీ రామ్, వశిష్ఠ, కెమెరా: సురేష్, సంగీతం: యం.యం.కీరవాణి. -
చూస్తే ప్రేమలో పడిపోతారు!
ఓ జంట మధ్య చిగురించిన ప్రేమ వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో టీజర్ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ- ‘‘నేను మంచి హీరో అవుతానని రమేష్ వర్మ ఎప్పుడో నమ్మారు. అందుకే నాకోసం మంచి కథ సృష్టించారు. ఈలోగా నేను వేరే సినిమాలతో బిజీ అయిపోయా. అయినా నా కోసం రెండేళ్లు ఆగారు. ఇది కచ్చితంగా హిట్టయ్యే మూవీ. ఇళయరాజాగారితో చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది. నేను అందగాణ్ణే అనే ఫీలింగ్ కలగచేసిన కెమేరామేన్ శ్యామ్ కె. నాయుడుగారికి నా కృతజ్ఞతలు’’ అని చెప్పారు. ‘‘రమేష్ వర్మ ఓ అద్భుత మైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీజర్ చూస్తేనే ఈ సినిమాతో ఎవరైనా ప్రేమలో పడిపోతారు’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో మల్టీ డైమన్షన్ వాసు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: పాత్రికేయ.