రంజిత్, పాలక్ లాల్వానీ హీరో హీరోయిన్లుగా ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేమ్ త్రికోటి పేట దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘జువ్వ’. ఎస్వీ రమణ సమర్పణ లో సొమ్మి ఫిలింస్‌పై భరత్ సొమ్మి నిర్మించారు. హైదరాబాద్, వైజాగ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు, బెంగళూర్‌లో కార్ ఛేజ్, మలేసియాలో రెండు పాటలు చిత్రీకరించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
త్వరలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సినిమా ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. జనవరి మూడో వారంలో ఆడియోను, ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలీ, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, లత, తులసి, రఘుబాబు, ఏడిద శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ–మాటలు: ఎమ్.రత్నం, సాహిత్యం: అనంత శ్రీ రామ్, వశిష్ఠ, కెమెరా: సురేష్, సంగీతం: యం.యం.కీరవాణి.
Comments
Please login to add a commentAdd a comment