palle pragati scheme
-
మంత్రి ఎర్రబెల్లిపై సీఎం ప్రశంసలు
సాక్షి, హన్మకొండ : ‘నంబర్–1 మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఇంటర్నల్ సర్వేల్లో వచ్చిన రిపోర్టులు తేల్చిన సత్యమిది... పని చేస్తుంటే ప్రశంసలు అవే వస్తుంటాయి.. ఆయన పని తీరు బాగుంది.. ఆ శాఖ ఉద్యోగులతోనూ మంచిగా పనిచేయించడం ద్వారానే ఇది సాధ్యమైంది.. అందుకే మంత్రి దయాకర్‌రావు, ఆయన సిబ్బందిని అభినందిస్తున్నా..’ అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో శుక్రవారం ప్రశంసల వర్షం కురింపించారు. అసెంబ్లీలో పల్లె ప్రగతిపై శుక్రవారం జరిగిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ మధ్య చేసిన తమ ఇంటర్నల్ సర్వే టాప్ ఫర్‌ఫార్మర్‌గా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవార్డు వచ్చిందని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా దయాకర్‌రావు విస్తృతంగా పర్యటించి సిబ్బంది బాగా పనిచేసేలా ప్రోత్సహించినట్లు సర్వే రిపోర్టులో వచ్చిందని సీఎం వివరించారు. మంత్రిని తాను కావాలని పొగడడం లేదని.. పనిచేస్తుంటే ఇలాంటి అవార్డులు, రివార్డులు అభినందనలు వాటంతట అవే వస్తుంటాయని సీఎం కేసీఆర్ అన్నారు. -
ఇంటింటికీ వెళ్లి.. తలుపు తట్టిన మంత్రి
సాక్షి, సిద్దిపేట : ఇంటింటికీ వెళ్లి తడి,పొడి చెత్త విభజనపై ఆరా తీస్తూ, మున్సిపల్ ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని వివరిస్తూ బల్దియాకు సహకరించాలని సూచిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం రెండో రోజు సిద్దిపేటలో పారిశుధ్య సిబ్బంది తరహాలో ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేశారు. స్థానిక 1వ వార్డులోని బారాయిమామ్, ఎల్లమ్మ దేవాలయం, రాంనగర్, తదితర ప్రాంతాల్లో సుమారు రెండు గంటలపాటు మార్నింగ్ వాక్ చేపట్టారు. కొన్ని చోట్ల నివాసగృహాల తలుపులు మూసి ఉండడంతో తలుపు కొట్టి మరీ ఇంటి యజమానులకు అవగాహన కల్పించారు. వార్డులో పర్యటిస్తున్న క్రమంలో మహిళలతో ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియ, మున్సిపల్ సిబ్బంది పనితీరు, పారిశుధ్య వాహనాల వేళలు గురించి ఆరా తీశారు. కొన్ని చోట్ల మురుగు కాలువల్లో చెత్త చెదారం, ఖాళీ బహిరంగా ప్రదేశాల్లో సమీప నివాసగృహాల చెత్త కుప్పలను చూసిన మంత్రి సంబంధిత గృహాల మహిళలను పిలిచి స్వచ్ఛతపై అవగాహన కల్పించడంతో పాటు మన ఆరోగ్యంతో పాటు కాలనీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని సున్నితంగా సూచించారు. పలుచోట్ల కాలనీ ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టి తీసుకురాగా వెంటనే ఉన్న చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిలకు సిఫారస్ చేసి పరిష్కారించాలని ఆదేశించారు. రాంనగర్ చౌరస్తా నుంచి ఎల్లమ్మ దేవాలయం వరకు హరీశ్‌రావు కాలినడకన వార్డు బాట çపట్టారు. మార్గ మధ్యలో మురికి కాలువలను పరిశీలించారు. విద్యుత్ తీగలను సరి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలని సంబంధిత çస్థలాల యాజమానులకు సూచించారు. జకీర్... గజ్వేల్‌లో కూడా చేయాలి.. సిద్దిపేటలో వారంలో ఐదు రోజులు తడి, రెండు రోజలు పొడి చెత్తను సేకరిస్తున్నాం. ముందుగా ప్రజలకు తడి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని వివరిస్తున్నాం. నేను, మా కౌన్సిలర్లు, అధికారులు గల్లీలో ఇళ్లు ఇళ్లు తిరిగి చెప్పుతున్నాం. మీరు కూడా గజ్వేల్‌లో ఇదే తరహాలో వార్డులో తిరగండి. ప్రజలను చైతన్యం చేయండి. స్వచ్ఛ గజ్వేల్ సాధనకు కృíషి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. 1 వార్డులో పర్యటిస్తున్న క్రమంలో కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీర్‌తో పాటు కౌన్సిలర్లు వచ్చారు. వారికి కొంత దూరం వరకు తనవెంట పర్యటనలో తీసుకెళ్లి తడి పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని చూపించారు. పారిశుధ్య సిబ్బంది తరహాలో క్లాస్... స్థానిక 1వ వార్డులోని పలు కాలనీల్లోని ప్రజలు పారిశుధ్య వాహనానికి చెత్తను అందించడానికి రావడం, వాహనం వెంటే ఉన్న మంత్రి హరీశ్‌రావు మహిళల వద్ద నుంచి చెత్త డబ్బాలను తీసుకుని పరిశీలించారు. మున్సిపల్ ఆదేశాలకు అనుగుణంగా వారంలో ఐదు రోజులు తడి చెత్త సేకరణ నేపథ్యంలో మంగళవారం మంత్రి పర్యటన సందర్భంగా మహిళలు తెచ్చిన తడి చెత్తను క్షుణ్ణంగా పరిశీలించారు. కొందరు మహిళలు తెచి్చన చెత్త బుట్టల్లో ప్లాస్టిక్ కవర్లు ఇతరాత్ర ఉండడం పట్ల వాటిని స్వయంగా మంత్రి హరీశ్‌రావు చేతికి గ్లౌజ్ ధరించి దగ్గరుండి వేరు చేసి చూపించారు. ప్రతి రోజూ తడి చెత్తను మాత్రమే ఇవ్వాలని మహిళలకు హితవు పలికారు. ఆయన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, వెంట అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాం, కౌన్సిలర్లు బర్ల మల్లిఖార్జున్, స్వప్న బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
రూ. 7,457 కోట్లతో ‘పేదరిక నిర్మూలన’!
బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన సెర్ప్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం లో రూ.7,457 కోట్లు అవసరమవుతాయని సర్కారు అంచనా వేసింది. 2017–18 బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనకు కసరత్తు చేసిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తాజాగా బడ్జెట్ అంచనాలను ప్రభుత్వానికి అందజేసింది.ఇందులో సింహభాగం ఆసరా పింఛన్లకే పోతుండటంతో ఇతర కార్యక్రమా ల అమలుపై ప్రభావం పడుతుందని కొంద రు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా 36లక్షల మంది ఆసరా లబ్ధిదారుల పింఛన్ల కోసం ఏటా రూ.4,787 కోట్లు అవసరమని సెర్ప్ పేర్కొంది. తాజాగా ప్రభుత్వం ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి అందించాలని నిర్ణయించడంతో, సుమారు 2లక్షల మందికి రూ.247కోట్లు అవసరమని అంచ నా వేసింది.మొత్తం రూ.5,034 కోట్లు ఆసరా పింఛన్ల కింద ప్రభుత్వం ఖర్చు చేయాలని భావిస్తోంది. సామాజిక భద్రతా పింఛన్లకు కేంద్రం నుంచి రూ.209.58కోట్లు వస్తాయని అధికారులు అంచానా వేశారు. గత రెండున్నరేళ్లుగా వడ్డీలేని రుణాలు తీసుకొని తిరిగి చెల్లించిన స్వయంసహాయక సంఘాల మహిళలకు వడ్డీల బకాయిలతో కలిపి మొత్తం రూ.663.51 కోట్లు అవసరమవుతాయని అంచనా. పట్టాలెక్కనున్న ‘పల్లె ప్రగతి’! రాష్ట్రంలోని 150 వెనుకబడ్డ మండలాల్లో పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.642 కోట్లతో ప్రారంభించిన తెలంగాణకు పల్లె ప్రగతి పథకానికి గతేడాది రూ.40 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించినా.. సర్కారు నిధులివ్వలేదు. దీంతో ప్రపంచ బ్యాంకూ నిధులివ్వలేదు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా పేద మహిళలకు రుణాలందించేందుకు గతేడాది కన్నా ఈ సారి ఎక్కువ మొత్తంలో నిధులివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తాజా ప్రతిపాదనలలోరూ.274 కోట్లు ఇవ్వాలని పేర్కొనడం స్త్రీ బ్యాంకు సిబ్బందికి ఊరటనిచ్చే అంశం. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు చేయకపోవడం గమనార్హం. అభయహస్తం పథకం కోసం తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ.399.33 కోట్లు ఇవ్వాలని భావిస్తోంది. -
పల్లె ప్రగతికి పట్టుగొమ్మ తిమ్మాపూర్
జగదేవ్‌పూర్: రాష్ర్టంలో పల్లె ప్రగతి పథకం ద్వారా పల్లెలో సకల సమస్యలు తీరనున్నట్లు, పల్లె ప్రగతికి మూడు జిల్లాలు ఎంపిక చేయడం జరిగిందని తెలంగాణ సెర్ఫ్ మానవాభివృద్ధి విభాగం డెరైక్టర్ మృదుల పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మెదక్ జిల్లాలో జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామం ఎంపిక కావడంతో శనివారం ఆమె గ్రామాన్ని సందర్శించారు. ముందుగా ఆమె గ్రామంలోని మహిళ సంఘాల సభ్యులతో, అంగన్వాడి, పౌష్టిక ఆహార కేంద్రాల నిర్వాహకులు, గ్రామ సర్పం చ్తో సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ముఖ్య ఉద్దేశం పల్లెలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఒక గ్రామాన్ని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి వంద శాతం అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే జిల్లా తిమ్మాపూర్ గ్రామాన్ని ఎంపిక చేశారని చెప్పారు. గ్రామంలో సకల సమస్యలను తెలుసుకొని వాటిని ప రిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించడం, గర్భిణులకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందన్నారు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మురికి కాల్వలు నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, కలుషితం లేని తాగునీరు అందించడం, అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడం లాంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే పల్లె ప్రగతి లక్ష్యమన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వాడకంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అలాగే టాటా కంపెనీ ఆధ్వర్యంలో త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 45 రోజుల్లో తిమ్మాపూర్ గ్రామంలో మార్పు వస్తుందన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామంలో 3 సీఆర్పీలను నియమించి మరుగుదొడ్ల వాడకంపై రోజువారి సర్వేను చేపడతామని తెలిపారు. జీవనోపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ కలపతో కట్టుకున్న పాతకాలం ఇళ్లు, చెట్ల పెంపకం స్థలాన్ని అక్కడ నీటి వసతిని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమా, యంగ్ ప్రొఫెషనల్ శివా, హెచ్.డి ప్రేరణ, మండల ఎపిఎం యాదగిరి, క్లస్టర్ ఎపిఎం దుర్గయ్య, సిసి స్వామి, గ్రామ మహిళ సంఘం అధ్యక్షులు లక్ష్మి, విఓఎ నందిని, హెచ్ఎ పూజరాణి, టీఆర్ఎస్ నాయకులు సుమన్ తదితరులు పాల్గొన్నారు.