సాక్షి, హన్మకొండ : ‘నంబర్–1 మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఇంటర్నల్ సర్వేల్లో వచ్చిన రిపోర్టులు తేల్చిన సత్యమిది... పని చేస్తుంటే ప్రశంసలు అవే వస్తుంటాయి.. ఆయన పని తీరు బాగుంది.. ఆ శాఖ ఉద్యోగులతోనూ మంచిగా పనిచేయించడం ద్వారానే ఇది సాధ్యమైంది.. అందుకే మంత్రి దయాకర్‌రావు, ఆయన సిబ్బందిని అభినందిస్తున్నా..’ అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో శుక్రవారం ప్రశంసల వర్షం కురింపించారు.
అసెంబ్లీలో పల్లె ప్రగతిపై శుక్రవారం జరిగిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ మధ్య చేసిన తమ ఇంటర్నల్ సర్వే టాప్ ఫర్‌ఫార్మర్‌గా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవార్డు వచ్చిందని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా దయాకర్‌రావు విస్తృతంగా పర్యటించి సిబ్బంది బాగా పనిచేసేలా ప్రోత్సహించినట్లు సర్వే రిపోర్టులో వచ్చిందని సీఎం వివరించారు. మంత్రిని తాను కావాలని పొగడడం లేదని.. పనిచేస్తుంటే ఇలాంటి అవార్డులు, రివార్డులు అభినందనలు వాటంతట అవే వస్తుంటాయని సీఎం కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment