Palm oil industry
-
ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 పామాయిల్ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ఆయిల్ పామ్ సాగు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగం ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గుచూపేలా అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 5 ఆయిల్ పామ్ పరిశ్రమలు నెలకొల్పే ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ. 1,050 కోట్లతో ఈ పరిశ్రమలను స్థాపించనున్నారు. తర్వాత రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా రూ. 4.07 కోట్లతో సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని తీర్చిదిద్దేందుకు అవసరమైన రెండో ఫైలుపై సంతకం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు తరచూ అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వీలుగా రైతు వేదికలను తీర్చిదిద్దుతామన్నారు. సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందించేందుకు వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా.. మంత్రి మూడో ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా గద్వాలకు చెందిన పట్టు పరిశ్రమశాఖ అధికారి జగన్నాథ్ కుమారుడు ఆశిష్ కుమార్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కలి్పస్తూ నియామక పత్రం అందజేశారు. తర్వాత అధికారులతో తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమలను ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నెలకొల్పుతామన్నారు. పామాయిల్ సాగు విస్తరణకు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల స్థాపన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుతో రైతులకు ఎళ్లవేళలా మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పామాయిల్ సాగుతో రైతులకు ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. అలాగే అంతరపంటలతో అదనపు ఆదా యం లభిస్తుందన్నారు. ఆయిల్ ఫెడ్ ఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తుమ్మల తెలిపారు. -
పామాయిల్ సాగుకన్నా ముఖ్యం ఇదీ...
ప్రపంచ వాణిజ్య సంస్థ విధివిధానాలను నెరవేర్చడం కోసం దిగుమతి పన్నులను క్రమానుగతంగా తగ్గించడాన్ని భారత్ మొదలెట్టినప్పుడు ‘ఎల్లో రివల్యూషన్’ (నూనెగింజల ఉత్పత్తి) ద్వారా దేశం సాధించిన ఫలితాలు హరించుకుపోయాయి. వంటనూనెల దిగుమతిపై దేశం 300 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు దిగుమతి లాబీలు, మరోవైపు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల ఒత్తిడితో దిగుమతి పన్ను రేట్లను ఒక దశలో జీరోకి తగ్గించేశారు. దీంతో స్వల్ప కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా భారత్ మారిపోయింది. పామాయిల్ సాగుకోసం భూమిని అధికంగా కేటాయించడానికి బదులుగా, మనం మర్చిపోయిన ‘నూనెగింజల విప్లవా’న్ని పునరుద్ధరించడం తక్షణావసరంగా ఉంది. కొన్ని రోజుల క్రితం పామాయిల్ని దేశీ యంగా ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంటనూనెలు– ఆయిల్ పామ్‌పై జాతీయ మిషన్ (ఎన్ఎమ్ఈఓ–ఓపీ) కోసం రూ. 11,040 కోట్లకు ఆమోదముద్ర వేసింది. వంట నూనెల దిగుమతిపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే దీని లక్ష్యం. కాయధాన్యాలు, నూనెగింజలకు సంబంధించిన ఉత్పత్తి పరి స్థితులపై చర్చించడానికి ఒక టీవీ ప్యానెల్లో కూర్చున్నాను. ఆ ప్యానెల్లో నీతి ఆయోగ్ సభ్యుడొకరు ముఖ్యమైన సమాచారం తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో దేశీయ వంటనూనెల అవసరాల్లో 40 శాతం పైగా పామాయిల్ సాగు ద్వారా పూరించాలన్నదే ఈ పథకం లక్ష్యమట. పర్యావరణ, వాతావరణ కారణాల వల్ల పామాయిల్ ఇప్పటికే ఆరోగ్యపరమైన వివాదంలో చిక్కుకుని ఉన్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వ తాజా పథకం దిగ్భ్రాంతిని కలిగించింది. ఇతర వంటనూనెలతో పోలిస్తే పామాయిల్ ధర తక్కువ కాబట్టి నీతినియమాలు లేని వర్తకులు తరచుగా పామాయిల్ని ఇతర వంటనూనెలతో కల్తీ చేసి ప్రయోజనం పొందుతున్నారు. పైగా స్థానిక ఉత్పత్తి, స్థానిక అవసరాలపై ఆధారపడి దేశంలో అనేకరకాల ఆరోగ్యకరమైన వంటనూనెలు అంటే– ఆవ, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, కుసుమలు, వెర్రి నువ్వులు (ఒడిసలు) వంటి నూనె గింజలపై భారతీయులు సాంప్రదాయకంగా ఆధారపడి ఉన్నారు. అందుకే భారతీయులు పామాయిల్ పట్ల ఏ ఆసక్తీ చూపలేదు. పైగా పామాయిల్ని జంక్ ఫుడ్, ప్రాసెసింగ్ పరిశ్రమ, సౌందర్య ఉత్పత్తులు, షాంపూ, డిటర్జెంట్స్, క్యాండిల్స్, టూత్ పేస్టులు వంటి వేగంగా అమ్ముడయ్యే వినియోగదారీ ఉత్పత్తులలో ఉపయోగించడానికే పరిమితం చేస్తున్నారు. పామాయిల్ దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రతిపాదిం చిన కేంద్ర పథకం గురించి మనం మొదటగా తెలుసుకుందాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సమాచారం ప్రకారం 2025–26 నాటికి దేశంలో పది లక్షల హెక్టార్లలో పామాయిల్ తోటల సాగును పెంచాలనీ, 2029–30 నాటికి దీన్ని 16.7 లక్షల హెక్టార్లకు విస్తరించాలని కేంద్ర పథకం లక్ష్యం. ఈ కొత్త పంటలో చాలా భాగాన్ని పర్యావరణపరంగా దుర్బలంగా ఉండే ఈశాన్య భారత్‌లో, అండమాన్, నికోబార్ దీవుల్లో సాగు చేయనున్నారు. పామాయిల్ సాగుకోసం అవసరమైన ఉత్పాదకాలకు రాయితీ కల్పించడతోపాటు, ప్రారంభ సంవత్సరాల్లో ఎరువులపై ఖర్చును నూరుశాతం రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వనున్నారు కాబట్టి రైతులు పామాయిల్ సాగుపట్ల తప్పక ఆకర్షితులవుతారు. పైగా ధరల హెచ్చుతగ్గులను అధిగమించడానికి పామాయిల్ సాగుకు గ్యారంటీ ధర చెల్లిస్తామనే హామీని కూడా కేంద్ర పథకం ప్రతిపాదిం చింది. టోకు ధరల సూచీకి అనుగుణంగా గత అయిదేళ్లలో సగటు ముడి పామాయిల్ ధరపై ఆధారపడి పామాయిల్ ధరను నిర్ణయించనున్నారని సమాచారం. ఒకవేళ ప్రాసెసింగ్ పరిశ్రమ పామాయిల్ సాగు రైతులకు ఇచ్చిన హామీమేరకు ధర చెల్లించకపోతే, రెండు శాతం ప్రోత్సాహకాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. భారతదేశం తన వంట నూనెల అవసరాల్లో దాదాపు 55 నుంచి 60 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది కానీ, దిగుమతుల చెల్లింపుల అంతరం మొత్తంమీద రూ. 75 వేల కోట్లకు చేరుకుంది. పర్యావరణ వైపరీత్యాలకు ప్రధాన కారణం పెరుగుతున్న అడవుల నిర్మూలన, జీవవైవిధ్య విధ్వంసమేనని వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) పదేపదే హెచ్చరిస్తూ వచ్చింది. సహజ వర్షాటవుల స్థానంలో వైవిధ్య రహితమైన తోటలను సాగుచేసే ప్రయత్నాలు అత్యంత విలువైన జీవజాతులు నశించిపోయేలా చేస్తున్నాయని, కర్బన ఉద్గారాలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చూపించాయి. 2020 జనవరిలో సమర్పించిన ఒక నివేదిక ప్రకారం భారతీయ అటవీ పరిశోధనా, విద్యా మండలి కూడా జీవవైవిధ్య పరంగా మెరుగ్గా ఉన్న ప్రాంతాలను పామాయిల్ తోటల సాగుకు అప్పగించడంపై తీవ్రంగా హెచ్చరించింది. భారీస్థాయిలో పెరిగిపోతున్న దిగుమతుల బిల్లును తగ్గించడానికి దేశీయంగా వంటనూనెల ఉత్పత్తిని పెంచాలనుకోవడంలో ఆర్థికపరంగా ఔచిత్యం ఉన్నప్పటికీ, 1993–94 నాటికే దేశీయ వంటనూనెల అవసరాల్లో 97 శాతాన్ని ఉత్పత్తి చేసి దాదాపుగా స్వయంసమృద్ధిని సాధించిన భారతదేశం... ఇంత తక్కువ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా ఎలా మారిపోయిందన్నది పెద్ద ప్రశ్న. 1985–86లో భారత్ ప్రారంభించిన చమురుగింజల టెక్నాలజీ మిషన్ లక్ష్యం ఏమిటంటే, దేశీయ ప్రాసెసింగ్ ఉత్పత్తిని బలోపేతం చేస్తూనే నూనెగింజల ఉత్పత్తి పెంపుదలపై దృష్టిపెట్టడమే. దీన్నే తదనంతరం ‘ఎల్లో రివల్యూషన్’ అని ప్రశంసించారు. వ్యవసాయంపై డబ్ల్యూటీఓ ఒడంబడిక ప్రకారం భారతదేశం సోయాబీన్ మినహా ఇతర వంటనూనెలపై 300 శాతం వరకు దిగుమతి పన్నులు విధించవచ్చు. వంటనూనెల దిగుమతిపై దేశం ఇంత అత్యధిక శాతం పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు దిగుమతి లాబీలు, మరోవైపు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల ఒత్తిడి కారణంగా ఎగుమతి పన్ను రేట్లను తగ్గించేశారు. ఇది ఏ స్థాయికి చేరుకుం దంటే ఒక దశలో దిగుమతి పన్నులు దాదాపుగా జీరోకి చేరుకున్నాయి. దీంతో చౌక నూనె దిగుమతుల వెల్లువ మొదలై దేశీయ నూనెగింజల సాగుదారులు రంగం నుంచే తప్పుకోవలసివచ్చింది. దేశీయ వంటనూనె ఉత్పత్తిని ప్రోత్సహించే ఉత్తమ మార్గం ఏదంటే, ఎల్లో రివల్యూషన్ ఎక్కడ తన ప్రభను కోల్పోయిందో గ్రహించి, నూనె గింజల ఉత్పత్తిని తిరిగి పెంచడంపై దృష్టి పెట్టడమే. ప్రభుత్వం దేశంలోని పామాయిల్ సాగుదారులకు గ్యారంటీ ధర కల్పించాలని భావిస్తున్నట్లయితే, నూనె గింజల సాగుదారుల్లో చాలామంది చిన్న రైతులే కాబట్టి, వీరికి గ్యారంటీ ధరకు హామీని కల్పించకపోవడంలో ఎలాంటి హేతువును నేను చూడటం లేదు. ఆర్థిక నిచ్చెనలో రైతులు అత్యంత దిగువన ఉంటున్నారన్న వాస్తవాన్ని గుర్తించి గ్యారంటీ ధర, మార్కెటింగ్ వ్యవస్థ కల్పనతో నూనె గింజల సాగుకు తిరిగి ప్రాణం పోయాలి. ఇది ఆర్థికంగా చెల్లుబాటు కాగల ప్రత్యామ్నాయంగా మారితే అధిక నీటిని ఉపయోగించి వరి సాగు చేసే పంజాబ్ రైతులు కూడా తమ ప్రాధాన్యతను మార్పు చేసుకుంటారు. పైగా ఆబ్సెంటీ భూస్వాములకు, కొద్దిమంది పారిశ్రామిక దిగ్గజాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే పామాయిల్ సాగుకి కాకుండా, నూనెగింజల సాగును ప్రోత్సహిస్తే అది దేశంలోని కోట్లాది సన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తుంది. ఎల్లో రివల్యూషన్ కుప్పగూలిపోయాక దేశంలో నూనె గింజల సాగుదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పైగా నూనెగింజల సాగుకు భూముల విస్తరణ కోసం పెద్ద ఎత్తున సహజ అడవులపై వేటు వేయాల్సిన అవసరం లేదు. దేశంలో భూగర్భజలాలు అడుగంటిపోవడానికి విస్తృతంగా గోధుమ, వరి పంటలను పండించడమే కారణమని నిపుణులు మొత్తుకుంటున్న సమయంలో, నీటిని అధికంగా ఉపయోగించుకునే పామాయిల్ సాగువైపు దేశాన్ని నెట్టడంలో అర్థం లేదు. సగటున ఒక పామ్ చెట్టు రోజుకు 300 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. ఒక హెక్టార్‌లోని పామ్ చెట్ల సంఖ్యను లెక్కించి చూస్తే పామాయిల్ తోటలు నీటిని తోడేస్తాయని చెప్పాలి. కాబట్టే మరో పర్యావరణ సంక్షోభంలో మనం కూరుకుపోవడానికి ముందుగా ఖర్చులు తగ్గించుకునే నిష్పత్తిని సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంది. పామాయిల్ సాగుకోసం సాగుభూమి విస్తరణను ప్రతిపాదించడానికి బదులుగా, మనం మర్చిపోయిన నూనెగింజల విప్లవాన్ని పునరుద్ధరించడం తక్షణావసరంగా ఉంది. నూనె గింజల్లో స్వయం సమృద్ధిని సాధించే మార్గం ఇదే. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
భారత్‌తో విభేదాలు తాత్కాలికమే: మలేషియా
కౌలాలంపూర్: వాణిజ్యపరంగా భారత్‌తో తలెత్తిన విభేదాలు త్వరలోనే సమసిపోతాయని మలేషియా పరిశ్రమల శాఖ మంత్రి థెరిసా కోక్ పేర్కొన్నారు. మలేషియా పామాయిల్ ఉత్పత్తులపై భారత్ విధించిన నిషేధం తాత్కాలికమైందని భావిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా భారత ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మలేషియా ప్రధాని మహతీర్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్న ఆయన.. ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్‌పై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే పామాయిల్ అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్... మలేషియా పామాయిల్‌ను కొనుగోలు చేయకూడదని నిర్ణయించింది. మలేషియాకు బదులు ఇండోనేషియా నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాలని సంబంధిత వ్యాపార సంస్థలకు సూచించింది. దీంతో వాణిజ్యపరంగా మలేషియాకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ నేపథ్యంలో మలేషియా మంత్రి థెరిసా కోక్ మంగళవారం మాట్లాడుతూ.. ‘‘భారత్- మలేషియాల మధ్య సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ఇరు దేశాలు అధిగమిస్తాయని భావిస్తున్నాం. పరస్పర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాం. పామాయిల్ కొనుగోలుపై భారత్ నిర్ణయం తాత్కాలికమే అని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. బీ20 బయోడీజిల్ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని... తద్వారా పామాయిల్ ధరలు నిలకడగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.(చిన్నవాళ్లం... భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం!) -
చిన్నవాళ్లం... భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం!
కౌలాలంపూర్: భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దవాళ్లం కాదని మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్(94) వ్యాఖ్యానించారు. వాణిజ్యపరంగా భారత్‌తో ఏర్పడ్డ విభేదాలను అధిగమించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గత కొన్ని నెలలుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మలేషియా ప్రధాని మహతీర్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబరులో ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో మహతీర్ మాట్లాడుతూ.. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్నారు. కశ్మీరీ లోయ దురాక్రమణకు గురైందని.. ఇది చాలా తప్పుడు చర్య అని భారత్‌పై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మలేషియా పామాయిల్‌ను కొనుగోలు చేయకూడదని భారత్‌కు చెందిన ప్రముఖ ఆయిల్ ప్రాసెసర్ సంస్థలు నిర్ణయించాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారుగా ఉన్న భారత్ తాజా నిర్ణయంతో మలేషియా తీవ్రంగా నష్టపోతోంది. దాదాపు 10 శాతం మేర ఎగుమతులు పడిపోయాయి. ఇప్పటికిప్పుడు నూతన దిగుమతిదారు దొరక్కపోవడంతో మలేషియా వాణిజ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో లంగ్వావీలో సోమవారం విలేకరులతో మాట్లాడిన మహతీర్... తమ పామాయిల్ ఉత్పత్తులను భారత్ బాయ్‌కాట్ చేసినంత మాత్రాన తాము ప్రతీకార చర్యలకు దిగబోమన్నారు. ‘మేం చాలా చిన్నవాళ్లం. ప్రతీకారం తీర్చుకోలేం. అయితే దీనిని అధిగమించడం లేదా ఇందుకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనే మార్గాలు అన్వేషిస్తున్నాం’ అని పేర్కొన్నారు. (ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మలేషియా ప్రధాని) అదే విధంగా సీఏఏ ప్రవేశపెట్టడం సరైంది కాదని మరోసారి అభిప్రాయపడ్డారు. ఇక పరారీలో ఉన్న వివాదాస్పద మత ప్రబోధకుడు జాకీర్ నాయక్ అప్పగింత విషయంలోనూ భారత్- మలేషియాల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడటం, విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జాకీర్ నాయక్.. ప్రస్తుతం మలేషియాలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జాకీర్‌ను అప్పగించాల్సిందిగా భారత్ ఎన్నిసార్లు విఙ్ఞప్తి చేసినప్పటికీ మలేషియా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో జాకీర్‌ను విచారిస్తామని భారత్ చెప్పినప్పటికీ... అతడికి చెడు తలపెట్టే అవకాశాలు ఉన్నాయన్న మహతీర్.. జాకీర్‌ను భద్రంగా చూసుకుంటూ.. అతడికి ఎటువంటి హాని తలపెట్టని దేశం (భారత్ కాకుండా)ఉందని భావించినపుడు మాత్రమే అతడిని తమ దేశం నుంచి బయటకు పంపించగలమని పేర్కొన్నారు. -
ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మలేషియా ప్రధాని
కౌలాలంపూర్ : జమ్మూ కశ్మీర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సూచించిన పరిష్కారాలను అగ్రరాజ్యం అమెరికా సహా భారత్, పాకిస్తాన్ వంటి ప్రతీ దేశం స్వాగతించి తీరాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఐరాస 74వ సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో ప్రసంగించిన మహతీర్.. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా కశ్మీరీ లోయ దురాక్రమణకు గురైందని.. ఇది చాలా తప్పుడు చర్య అని పేర్కొన్నారు. శాంతియుత చర్చలతోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. అయితే జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మహతీర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ... మలేషియా ప్రధాని మహతీర్ వ్యాఖ్యలు విచారకరమని పేర్కొన్నారు. భారత్- మలేషియాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. అయితే ఆ దేశ ప్రధాని మాత్రం అసత్యాలను అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించడం బాగాలేదని విమర్శించారు. ఇక ఈ విషయంపై మంగళవారం స్పందించిన మహతీర్.. కశ్మీర్‌పై తన మనసులో ఉన్న కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించానని.. దానిని ఎవరికోసమో మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. ‘ఇతర దేశాలతో ఉన్న దౌత్యపరమైన సంబంధాలను కాపాడుకోవడంతో పాటు అక్కడి ప్రజలతో కూడా స్నేహంగా ఉండాలని మేము భావిస్తున్నాం. మాది వాణిజ్య అనుకూల దేశం. అందుకే అతిపెద్ద మార్కెట్ల కోసం అన్వేషిస్తాం. అంతమాత్రాన ప్రజల పక్షాన మాట్లాడేందుకు మేము వెనకడుగువేయం. అయినా నిజాలు మాట్లాడినపుడు కొంత మంది స్వాగతిస్తారు. మరికొంత మంది వ్యతిరేకిస్తారు’ అని పేర్కొన్నారు. అదే విధంగా కశ్మీర్‌పై తన వ్యాఖ్యల నేపథ్యంలో మలేషియా పామ్ ఆయిల్‌ను కొనుగోలు చేయకూడదని ముంబైకి చెందిన ప్రముఖ ఆయిల్ ప్రాసెసర్ సంస్థలు నిర్ణయించిన విషయంపై కూడా ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టికి తీసుకువెళ్లాలని భావించడం లేదని తెలిపారు. -
తెట్టులోనే ఉంది గుట్టు?
ఆయిల్‌ఫెడ్‌లో రూ.450 కోట్ల కుంభకోణం..! అశ్వారావుపేట ఆయిల్‌ఫాం {Mషింగ్ ఫ్యాక్టరీ కేంద్రంగా పామాయిల్ చమురు దోపిడీ భారీ ముడి చమురున్న తెట్టును పీపాల్లో అక్రమంగా తరలిస్తున్న వైనం ఇదే ఫ్యాక్టరీ రిక వరీనే ప్రామాణికంగా తీసుకొని ధర నిర్ణయిస్తున్న ప్రైవేట్ కంపెనీలు రైతుల్లో ఆందోళన.. అక్రమాలు నిజమేనన్న ఆయిల్‌ఫెడ్ ఎండీ విష్ణు హైదరాబాద్: పామాయిల్ పరిశ్రమలో తెట్టు మాటున చేస్తున్న ముడిచమురు అక్రమ రవాణా గుట్టుర ట్టు అయింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఆయిల్‌ఫాం క్ర షింగ్ ఫ్యాక్టరీలో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. ఈ క్రషింగ్ ఫ్యాక్టరీ ప్రారంభమైన ఏడేళ్ల నుంచి జరుగుతోన్న ఈ తంతుతో పామాయిల్ రైతులను ఆర్థికంగా పీల్చి పిప్పిచేశారు. ఫ్యాక్టరీ అధికారులు మొదలుకొని ఆయిల్‌ఫెడ్‌లోని కొందరు ఉన్నతాధికారులు.. ప్రైవేట్ కంపెనీ దళారులతో కుమ్మ క్కై ఈ భారీ కుంభకోణానికి ఒడిగట్టారు. రెండురోజుల క్రితం అక్రమంగా తరలిస్తున్న ముడిచమురున్న తెట్టును రైతులు పట్టుకోవడంతో ఈ బండారం బట్టబయలైంది. దీనిపై విచారణ జరుగుతోంది. అక్రమాలు నిజమేనని సాక్షాత్తూ ఆయిల్‌ఫెడ్ ఎండీ విష్ణు అనడంతో ఎంత కుంభకోణం జరిగిందనే చ ర్చ జరుగుతోంది. దోపిడీ జరుగుతోందిలా...! గెలలు క్రషింగ్ అయిన తర్వాత వ్యర్థాలను (మడ్డి) వదిలేందుకు అశ్వారావుపేటలో 3 చెరువులను తవ్వారు. రోజూ వీటిని అందులోకి పంపుతారు. నిజానికి వీటిలో 2.3 శాతానికి మించి ముడిచమురు ఉండకూడదు. కానీ అధికారులు ఒకరోజు అకస్మాత్తుగా వెళ్లి చూస్తే క్రషింగ్ అనంతర వ్యర్థాల్లో ఏకంగా 73 శాతం ముడి చమురు ఉన్నట్లు తేలింది. ఒకసారి రైతులు చేయించిన పరీక్షలో ఏకంగా 98 శాతం నూనె ఉన్నట్లు తేలింది. విచారణాధికారుల కమిటీ ముందే ఈ విషయం బట్టబయలైంది. ఈ మడ్డిపై చెరువులో తెట్టు తేలి ఉంటుంది. దాన్ని తీసుకువెళ్లేందుకు కొందరు కాంట్రాక్టర్లు వస్తారు. ఆ తెట్టును అతి తక్కువ ధర కే అమ్ముతారు. అయితే కేవలం తెట్టునే కాకుండా ముడిచమురు కలిసి ఉండేలా ఈ వ్యర్థాలను కూడా పీపాల్లో పోసుకొని దానిపైన తెట్టు వేస్తారు. చూసేవారికి కేవలం తెట్టు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇలా పెద్దఎత్తున ముడిచమురు తరలివెళుతోంది. ఆ ముడి చమురును ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకొని వారు కోట్లు గడిస్తుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెట్టును తీసుకెళ్లే లారీలు వచ్చిన రోజునే ఈ మడ్డిలో ముడిచమురును పెద్దఎత్తున కలిపేస్తారు. మిగిలిన రోజుల్లో కలపడానికి అవకాశం ఉండదు. అలా కలిపితే చెరువులు ఓవర్‌లోడ్ అవుతాయి. నెలకు ఐదారుసార్లు ఇలా చేస్తున్నారు. తెట్టును బస్తా సంచుల్లో తీసుకెళ్లవచ్చు. కానీ పీపాల్లో తరలిస్తుండటం గమనార్హం. ఆయిల్‌ను ఉత్పత్తి చేసే సమయంలో వృథాగా బైటకు వెళ్లే తెట్టు బాగా అట్టకట్టుకొని ఉంటుందని.. దాన్ని బస్తా సంచుల్లో ఎత్తి పంపేయవచ్చని అంటున్నారు. పీపాల్లోనూ.. ట్యాంకర్లలోనూ తెట్టును నింపాల్సిన అవసరం ఉండనే ఉండదంటున్నారు. అంటే ముడిచమురుతో నిండిన తెట్టును అక్రమంగా తరలిస్తూ రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలా నెలకు రూ. 5 కోట్లకుపైగా కొల్లగొడుతున్నారని అంచనా. ఇంకో మార్గంలో దోపిడీ.. రైతులకు నెలకోసారి వారి గెలలకు ఎంత రికవరీ (ముడిచమురు) వచ్చిందో దాని ప్రకారం పేమెంట్ చేస్తారు. సహజంగా ఇక్కడ 24 శాతం రికవరీ ఉండాలి. కాని వ్యర్థపు నీటిలో ముడిచమురును తరలించడం వల్ల గెలల ద్వారా వచ్చే ముడిచమురు రికవరీని కేవలం 18 శాతానికి మించనీయకుండా అధికారులు చూస్తారు. ఆ ప్రకారం రైతులకు ఐదారు శాతం రికవరీ తగ్గుతుండటంతో పెద్దఎత్తున నష్టపోతున్నారు. ఇంకో గమ్మత్తై విషయం ఏమింటంటే అశ్వారావుపేట క్రషింగ్ ఫ్యాక్టరీ రికవరీ రేటునే ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మిగిలిన 13 (అందులో ఒకటి ప్రభుత్వ సంస్థ) ప్రైవేటు కంపెనీలు రికవరీ ధర నిర్ణయిస్తాయి. దీని రికవరీ ప్రభావం రెండు రాష్ట్రాల్లోని రైతులపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు దేశంలో ఉన్న మిగిలిన ప్రైవేటు కంపెనీలు కూడా దీన్నే అనుసరిస్తాయని అంటున్నారు. ఎందుకంటే దేశంలో అధికంగా మన ఉమ్మడి రాష్ట్రాల్లోనే పామాయిల్ తోటలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అశ్వారావుపేటలో ఉన్న ఆయిల్‌ఫెడ్ వారి క్రషింగ్ ఫ్యాక్టరీ రికవరీ రేటునే ప్రామాణికంగా గుర్తిస్తారు. అంటే అన్నిచోట్ల కూడా రైతులకు ఐదారు శాతం రికవరీ రేటును తగ్గించి ధర ఇవ్వడంతో రైతులు వందల కోట్లు నష్టపోతున్నారు. ఇలా మొత్తంగా అన్ని ప్రాంతా ల రైతులను దోపిడీ చేస్తున్నారు. తద్వారా దాదాపు ఈ నాలుగైదేళ్లలో దాదాపు రూ. 450 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు సంబంధిత ఉన్నతాధికారే ఒకరు చెప్పడం గమనార్హం. అంతేగాకుండా దీని రికవరీ రేటును మరింత తగ్గించి చూపించి నష్టాలబాట పట్టేట్లు చేస్తే ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయవచ్చనేది మరో కుట్రగా చెబుతున్నారు. ముడిచమురు దోచుకెళ్లడం.. రికవరీ రేటును తగ్గించి చూపడం.. నష్టాలబాట పట్టించడం అన్న కోణంలో ఇక్కడ కుట్ర జరుగుతోంది. దీనికి ఆయిల్‌ఫెడ్‌కు చెందిన కొందరు అధికారులు కూడా కుమ్మక్కయినట్లు ఓ అధికారే వెల్లడించారు. రైతులు మొత్తుకున్నా పట్టించుకోని వైనం... పామాయిల్ తోటలు సాగు చేసే రైతులు క్రషింగ్ కు వచ్చినప్పుడు తమకు ఎకరానికి రావాల్సిన ఆదాయం రాకపోవడంపై అనేకసార్లు తమ గోడును వెళ్లగక్కారు. విదేశాల్లో ఎక్కువ ఆయిల్ వస్తున్నప్పుడు ఇక్కడ తక్కువ రావడానికి కారణమేంటని ప్రశ్నిస్తే... ఇక్కడి నేలల్లో పండే పామాయిల్‌తో అంతస్థాయిలో ఆయిల్ రాదని చెప్పేవారు. దీంతో వారు తీవ్రమైన నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. పెపైచ్చు వందల కోట్ల రూపాయలు ఆర్జించాల్సిన ఆయిల్‌ఫెడ్ ఆదాయం గణనీయంగా తగ్గింది. అయినా ఇటువంటి దారుణమైన కుంభకోణం జరగడం దారుణమని రైతులు అంటున్నారు. కోట్లల్లో వ్యాపారం... ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 35 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆయిల్‌ఫాం గెలల నుంచి పామాయిల్ తీస్తారు. అందుకోసం తెలంగాణలో అశ్వారావుపేటలో ఆయిల్‌ఫాం గెలల క్రషింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో ప్రభుత్వ ఫ్యాక్టరీ ఉంది. దీంతోపాటు ఆ రాష్ట్రంలో మరో 12 ప్రైవేటు క్రషింగ్ ఫ్యాక్టరీలున్నాయి. వీటి ద్వారా వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక హెక్టారు పామాయిల్ తోటలకు రూ. 30 వేల మేర సబ్సిడీ ఇస్తుంది. ఒక్కో ఎకరానికి 12 టన్నుల ఆయిల్‌ఫాం గెలలు వస్తాయి. వాటిని క్రషింగ్ చేస్తే 30 శాతం ఆయిల్ వస్తుంది. అశ్వారావుపేట ఫ్యాక్టరీలో గంటకు 20 టన్నులు క్రష్ చేస్తారు. తద్వా రా 6 టన్నుల ఆయిల్ వస్తుంది. అలా రోజుకు 20 గంటలపాటు 400 టన్నుల పామాయిల్ గెలలను క్రషింగ్ చేస్తే 120 టన్నుల ముడిచమురు వస్తుంది. టన్ను ముడిచమురు ఆయిల్ మార్కెట్లో రూ. 40 వేలకుపైగా ధర పలుకుతుం ది. అంటే రోజుకు రూ. 48 లక్షల విలువైన ఆయి ల్ అశ్వారావుపేటలో క్రషింగ్ అవుతోందన్నమా ట. ఇంత భారీగా ఆయిల్ వస్తుండటంతో దాన్ని కొల్లగొట్టేందుకు భారీ ఫ్లాన్ వేశారు. పారిశ్రామి క నేపథ్యం ఉన్న రాజకీయ ప్రముఖులు, ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు ఇందులో కీలకంగా ఉన్నారు. దాన్ని నష్టాల బాటన తీసుకొచ్చి కాజేసే కుట్ర జరుగుతోంది. ఔను.. అక్రమాలు జరిగాయి: వీఎన్.విష్ణు, ఆయిల్‌ఫెడ్ ఎండీ అశ్వారావుపేట పామాయిల్ గెలల క్రషింగ్ ఫ్యాక్టరీలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే తెట్టును బస్తాల్లో కాకుండా పీపాల్లో తీసుకెళ్లారు. ఫ్యాక్టరీ స్థాయిలోనే ఈ అక్రమాలకు తెరలేచింది. దీనిపై విచారణకు ఆదేశించాను. ఏమేర అక్రమాలు జరిగాయో విచారణ నివేదిక వచ్చాక తెలుస్తుంది. -
కదంతొక్కిన ‘పామాయిల్’ కార్మికులు
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: ఆయిల్‌ఫెడ్ ప్రభుత్వరంగ సంస్థకు చెందిన అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమలో జరిగిన అవకతవకలపై కార్మికులు కదంతొక్కారు. ఫ్యాక్టరీ ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. వారికి వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్షనేత తాటి వెంకటేశ్వర్లు అండగా నిలిచారు. కాంట్రాక్టు కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకున్న వారి నుంచి తిన్నదంతా క క్కిస్తానని కార్మికులకు మద్దతుగా ఫ్యాక్టరీ ఎదుట బైఠాయించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. అశ్వారావుపేటలో సమస్య పరిష్కారం కాకపోతే హైదరాబాదులోని ఆయిల్‌ఫెడ్ ప్రధాన కార్యాలయానికి కార్మికులకు తన సొంత ఖర్చులతో తీసుకెళ్లి ఆయిల్‌ఫెడ్ ఎండీతో మాట్లాడిస్తానన్నారు. కార్మికుల కష్టార్జితం నుంచి మినహాయించుకున్న ప్రావిడెంట్‌ఫండ్(పీఎఫ్) సొమ్మును అణా పైసతో సహా తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తమ పీఎఫ్ సొమ్మును కాంట్రాక్టర్లు దోచుకున్నారని ఫ్యాక్టరీ మేనేజర్ చంద్రశేఖరరెడ్డికి కార్మికులు వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. తమకు ఫీఎఫ్ డబ్బు ఒక్కపైస కూడా అందలేని ఆరోపించారు. ఇదే విషయాన్ని కార్మికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పీఎఫ్ కార్యాలయం నుంచి కార్మికులు సాధించిన కొన్ని కీలకపత్రాలను మేనేజర్ చంద్రశేఖరరెడ్డికి తాటి అందజేశారు. పీఎఫ్ సొమ్ము ఇప్పించాలని కోరారు. ఫోర్మన్ విల్సన్రాజుపై దాడి చేసిన పాతకాంట్రాక్టర్ కుమారుడు మధుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏడేళ్ల పీఎఫ్ చెల్లించాలి.. 2007లో అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించినప్పటి నుంచి పనిచేసిన కార్మికులకు పీఎఫ్ సొమ్ము చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఫోర్మన్ దాడిచేసిన దుండగులను అరెస్ట్ చేయాలని, విల్సన్రాజుపై బనాయించిన కేసును ఎత్తివేయాలని ని నాదాలు చేశారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టర్లు ఇచ్చినంత తీసుకుంటే ఉంచుతున్నారని, హక్కులపై ప్రశ్నిస్తే పనిలోనుంచి తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కాంట్రాక్టర్ కుమారుడు మధుకు అనుకూలంగా ఉన్నవారే ఫ్యాక్టరీలో ఉద్యోగం చే యాలని, అతని మాట వినకున్నా, చెప్పిన ట్టు చేయకపోయినా, అధికారులను బదిలీ చేయిస్తాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే విల్సన్ రాజును రౌడీలతో కొట్టించాడని అన్నారు. కార్మికుల ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పాలో తెలియక మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి మౌనంగా ఉండిపోయారు. తిన్నదంతా కక్కిస్తా: ఎమ్మెల్యే తాటి కార్మికులు, విల్సన్‌రాజు సమస్యలను విన్న ఎమ్మెల్యే ఫ్యాక్టరీ మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి, డివిజనల్ అధికారి రమేష్కుమార్రెడ్డిలపై ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోజుకూలీ చేసుకునే వారిని మీ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటూ పోతే ఊరుకునేదిలేదు. ఇంతకుముందు ఇక్కడ ఎవరున్నారో నాకు అనవసరం. ఈ ప్రజలు నన్ను నమ్మారు. నా ప్రజలను ఎవరు అన్యాయం చేసినా ఊరుకోను. కార్మికుల సొమ్ములు ఎవరెంత తిన్నారో అణాపైసాలతో సహా కక్కిస్తా.. కాంట్రాక్టర్లకు సహకరించిన అధికారులను వదిలిపెట్టేది లేదు. మీరు (మేనేజర్‌ను ఉద్దేశించి) ఎన్నిసార్లు సస్పెండ్ అయినా మళ్లీ అశ్వారావుపేటకే ఎందుకు వస్తున్నారు..? ఆయిల్‌ఫెడ్‌లో మీకు ఎక్కడా ఉద్యోగం లేదా..? దేశంలో ఎన్నో ప్రభుత్వ ఫ్యాక్టరీలు ఉండగా.. ఎప్పుడూ అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీనే ఎందుకు వార్తల్లోకెక్కుతుంది..? మీరు ఇక్కడ ఎందుకోసం ఉంటున్నారో నాకు తెలుసు.. అంతా కక్కిస్తా.. మీ వైఖరి మార్చుకోకుంటే చాలా ఇబ్బంది పడతారు. ప్రతి నెల కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేటపుడు పీఎఫ్ చెల్లింపును ఎందుకు పరిశీలిచడంలేదు. కార్మికులకు పీఎఫ్ సొమ్ము తిరిగి ఇప్పించేంత వరకు ఇక్కడే కూ ర్చుంటాను’ అంటూ తాటి ఫ్యాక్టరీ గేటు ఎదుట బైఠాయించారు. ఫ్యాక్టరీలో ఆయిల్ రికవరీని త క్కువగా చూపుతూ ప్రైవేటు కంపెనీలతో కు మ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్న సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి బాధ్యులపై చర్యలకు ప్రభుత్వాన్ని కోరతానన్నారు. రైతులు పండించే పామాయిల్ కు పూర్తి మద్దతు ధర సాధించడం తన లక్ష్యమన్నారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం నుంచి ఏ కార్మికునికి ఎంత పీఎఫ్ సొమ్ము అం దాలో లెక్కలతో సహా నెల రోజులలోపు వివరం గా తెలియజేస్తామని మేనేజర్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా అక్కడి వచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నారాయణ వెంట ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సింగు నర్సింహరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఉన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో జెడ్పీటీసీ అంకత మల్లికార్జునరావు, ఆయిల్‌ఫాం రైతు సంఘం రాష్ట్ర నాయకులు మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు జూపల్లి రమేష్‌బాబు, జూపల్లి ప్రమోద్, నండ్రు రమేష్‌బాబు, టీడీపీ నాయకులు ఆలపాటి రామ్మోహనరావు, బండి పుల్లారావు, సీపీఎం నాయకులు బుడితి చిరంజీవి నాయుడు, టీఆర్ఎస్ నాయకులు కోటగిరి సీతారామస్వామి, జూపల్లి కోదండ వెంకటరమణారావు, చంటిబాబు ఉన్నారు.