‘సమైక్యం’కోసం మీ కృషి ప్రశంసనీయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయస్థాయిలో చేస్తున్న కృషి పట్ల పంచాయతీరాజ్ శాఖ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. జేఏసీ చైర్మన్ వి.మురళీకృష్ణ నాయుడు ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం గురువారం జగన్ను కలసి ప్రత్యేక అభినందనలు తెలిపింది. జగన్ను కలసిన వారిలో జేఏసీ నేతలు వై.మోహన్మురళీ, జంధ్యాల గోపాలకృష్ణ, సుజనప్రియ, బి.రవీంద్రబాబు తదితరులున్నారు. ఈ సందర్భంగా వారితోపాటు పార్టీ నేతలు శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ కూడా ఉన్నారు.