panche
-
శోభిత-నాగ చైతన్య పెళ్లి : అప్పుడు అలా.. ఇపుడు ఇలా!
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్ల వేడుకతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లికి వధువు శోభితా ధూళిపాళ సింపుల్ మేకప్, టెంపుల్ జ్యుయల్లరీతో బంగారు రంగు కంజీవరం ప్యూర్ గోల్డ్ జరీ చీరలో అందంగా ముస్తాబైంది. వరుడు నాగచైతన్య టెంపుల్ బోర్డర్ఉన్న పంచె (మధుపర్కం) కట్టుకొని ఎలిగెంట్ లుక్‌లో అలరించాడు. అయితే కుటుంబ వారసత్వాన్ని గౌరవిస్తూ, తన జీవితంలో కీలకమైన శుభకార్యానికి తాతగారి పంచెను కట్టుకున్నాడంటూ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం నాగ చైతన్య శోభిత ధూళిపాళతో తన పెళ్లికి తన తాత పంచెను ధరించాడుట. కుర్తా-పైజామాతో పాటు ముహూర్తం సమయానికి తనతాత టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంతగ అక్కినేని నాగేశ్వరావు తెల్లటి పంచెను ఎంచుకున్నాడట. అలా అక్కినేని కుటుంబ వారసత్వాన్ని పాటించాడు అంటున్నారు ఫ్యాన్స్. (మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం)తాజాగా సోషల్‌మీడియాలో వీరి పెళ్లి ఫోటోలతో పాటు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాతో చైతన్య మొదటి పెళ్లినాటి ఫోటోలు, సమంత ఎంగేజ్మెంట్కు, పెళ్లికి కట్టుకున్న చీర వివరాలు కూడా మరోసారి వార్తల్లో నిలిచాయి. అప్పుడు సమంతా అమ్మమ్మ చీరను మురిపెంగా కట్టుకుంటే, ఇపుడు చైతన్య తాత పంచెను కట్టుకున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. కాగా నాగ చైతన్యతో పెళ్లి సందర్బంగా సమంత ‘చే’ అమ్మమ్మ చీరను ప్రత్యేకంగా రీడిజైన్ చేయించుకుంది. అలాగే చే, సామ్ లవ్ స్టోరీతో ఆధారంగా వారి ఎంగేజ్మెంట్ చీరను తీర్చిదిద్దుకున్న సంగతి తెలిసిందే. -
మహిళపై విసిరిన పంచె.. 13 మందికి గాయాలు
సాక్షి, కడప అర్బన్: కడప నగరంలోని మరియాపురంలో ఈ నెల 1న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చెక్కభజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆనందోత్సాహాలతో ఓ వ్యక్తి చెక్కభజన చేస్తూనే, తన పంచెను గుంపులోకి విసిరేశాడు. ఆ పంచె కాస్త ఓ మహిళపై పడింది. ఈ క్రమంలో పరస్పరం వాగ్వివాదం జరిగింది. బాధిత మహిళ వైపు ఓ మహిళ.. పంచె విసిరేసిన వ్యక్తిని నిలదీసింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి, వత్తాసుకు వచ్చావా? అంటూ చెంపచెళ్లుమనిపించాడు. దీంతో గొడవ జరిగింది. ఈ విషయమై శనివారం ఉదయం కడప తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువైపులా వున్న వారికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు. కానీ ఎవరిళ్లకు వారు రాగానే.. ఇరువైపులా వారు కత్తులు, గొడ్డళ్లు, కట్టెలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకవైపు ఏడుగురు, మరోవైపు ఆరుగురు గాయపడ్డారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. (చదవండి: అయ్యో కొడుకా.. అమ్మ ఉరికి వేలాడుతోంది) ► ఒకవైపు మనోజ్(27) తీవ్రంగా గాయపడ్డాడు. ఇంకా శ్రీకాంత్, పృధ్వీరాజ్, రమణ, పెంచలయ్య, శ్రీరాముడు, రెడ్డెయ్య గాయపడ్డారు. వీరిలో శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మంది, ఇంకా కొంత మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.నాగభూషణం తెలియజేశారు. ► మరోవైపు అగస్టీన్(30) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిలో ఇంకా బాలసౌరి, ఆనంద్, ప్ర శాంత్, ప్రసాద్, శ్రీనివాసులు గాయపడ్డారు. వీరివైపు బాలసౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 11 మంది, ఇంకా కొంత మందిపై హత్యాయత్నం కేసు నమో దుచేశారు. ఈ సంఘటన జరిగిన ప్ర దేశంలో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. -
ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లీష్
సాక్షి ఎడ్జ్, పనాచె ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు సాక్షి, హైదరాబాద్: కేవలం ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యం సొంతం చేసుకునేందుకు సాక్షి ‘ఎడ్జ్’, ‘పనాచె’ సంస్థలు సంయుక్తంగా స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును అందిస్తున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో సాక్షి ఎడ్జ్ భాగస్వామి అయిన ‘పనాచె’ ప్రభావవంతమైన, విలక్షణమైన శిక్షణా పద్ధతుల ద్వారా ఈ కోర్సును అందిస్తోంది. ప్రపంచ భాష ఇంగ్లీష్‌తో పరిచయం.. ఇంగ్లీష్ లో సాధారణంగా దొర్లే తప్పులు.. ఫ్లూయన్సీ- లింకింగ్.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, అనవసర భయాలను అధిగమించడం.. వాయిస్, యాక్సెంట్.. ముఖ్యమైన గ్రామర్ వంటి ఆరు అంశాలతో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సును రూపొందించారు. ఈ కోర్సు మే 9 నుంచి జూన్ 11 వరకు ఉంటుంది. ఉదయం 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు మార్నింగ్ బ్యాచ్, సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు ఈవినింగ్ బ్యాచ్ క్లాసులు ఉంటాయి. కోర్సు ఫీజు రూ.4,600. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం 9603533300, 9666284600 అనే నంబర్లలో కాని, sakshiedge@gmail.com మెయిల్లో కానీ, సాక్షి ఎడ్జ్, 8-2-696, క్యారమెల్ పాయింట్, రోడ్ నంబర్ 12, హైదరాబాద్-34లో కానీ సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్లు బంజారాహిల్స్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో జరుగుతాయని చెప్పారు.