మహిళపై విసిరిన పంచె.. 13 మందికి గాయాలు | Clashes In Chekka Bhajana In YSR Kadapa | Sakshi
Sakshi News home page

మహిళపై విసిరిన పంచె.. 13 మందికి గాయాలు

Published Sun, Jan 3 2021 10:08 AM | Last Updated on Sun, Jan 3 2021 2:21 PM

Clashes In Chekka Bhajana In YSR Kadapa - Sakshi

సాక్షి, కడప అర్బన్‌: కడప నగరంలోని మరియాపురంలో ఈ నెల 1న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చెక్కభజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆనందోత్సాహాలతో ఓ వ్యక్తి చెక్కభజన చేస్తూనే, తన పంచెను గుంపులోకి విసిరేశాడు. ఆ పంచె కాస్త ఓ మహిళపై పడింది. ఈ క్రమంలో పరస్పరం వాగ్వివాదం జరిగింది. బాధిత మహిళ వైపు ఓ మహిళ.. పంచె విసిరేసిన వ్యక్తిని నిలదీసింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి, వత్తాసుకు వచ్చావా? అంటూ చెంపచెళ్లుమనిపించాడు. దీంతో గొడవ జరిగింది. ఈ విషయమై శనివారం ఉదయం కడప తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువైపులా వున్న వారికి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించారు. కానీ ఎవరిళ్లకు వారు రాగానే.. ఇరువైపులా వారు కత్తులు, గొడ్డళ్లు, కట్టెలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకవైపు ఏడుగురు, మరోవైపు ఆరుగురు గాయపడ్డారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. (చదవండి: అయ్యో కొడుకా.. అమ్మ ఉరికి వేలాడుతోంది)

► ఒకవైపు మనోజ్‌(27) తీవ్రంగా గాయపడ్డాడు. ఇంకా శ్రీకాంత్, పృధ్వీరాజ్, రమణ, పెంచలయ్య, శ్రీరాముడు, రెడ్డెయ్య గాయపడ్డారు. వీరిలో శ్రీకాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మంది, ఇంకా కొంత మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.నాగభూషణం తెలియజేశారు.  
► మరోవైపు అగస్టీన్‌(30) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిలో ఇంకా బాలసౌరి, ఆనంద్, ప్ర శాంత్, ప్రసాద్, శ్రీనివాసులు గాయపడ్డారు. వీరివైపు బాలసౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 11 మంది, ఇంకా కొంత మందిపై హత్యాయత్నం కేసు నమో దుచేశారు. ఈ సంఘటన జరిగిన ప్ర దేశంలో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement