ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లీష్ | Spoken english can learn with in six weeks | Sakshi
Sakshi News home page

ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లీష్

Published Wed, May 4 2016 8:40 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లీష్ - Sakshi

ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లీష్

సాక్షి ఎడ్జ్, పనాచె ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు


సాక్షి, హైదరాబాద్: కేవలం ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యం సొంతం చేసుకునేందుకు సాక్షి ‘ఎడ్జ్’, ‘పనాచె’ సంస్థలు సంయుక్తంగా స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును అందిస్తున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో సాక్షి ఎడ్జ్ భాగస్వామి అయిన ‘పనాచె’ ప్రభావవంతమైన, విలక్షణమైన శిక్షణా పద్ధతుల ద్వారా ఈ కోర్సును అందిస్తోంది. ప్రపంచ భాష ఇంగ్లీష్‌తో పరిచయం.. ఇంగ్లీష్‌ లో సాధారణంగా దొర్లే తప్పులు.. ఫ్లూయన్సీ- లింకింగ్.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, అనవసర భయాలను అధిగమించడం.. వాయిస్, యాక్సెంట్.. ముఖ్యమైన గ్రామర్ వంటి ఆరు అంశాలతో స్పోకెన్ ఇంగ్లీష్‌ కోర్సును రూపొందించారు.
 
ఈ కోర్సు మే 9 నుంచి జూన్ 11 వరకు ఉంటుంది. ఉదయం 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు మార్నింగ్ బ్యాచ్, సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు ఈవినింగ్ బ్యాచ్ క్లాసులు ఉంటాయి. కోర్సు ఫీజు రూ.4,600. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం 9603533300, 9666284600 అనే నంబర్లలో కాని, sakshiedge@gmail.com మెయిల్‌లో కానీ, సాక్షి ఎడ్జ్, 8-2-696, క్యారమెల్ పాయింట్, రోడ్ నంబర్ 12, హైదరాబాద్-34లో కానీ సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్లు బంజారాహిల్స్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో జరుగుతాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement