Pankaj Munjal
-
గిఫ్ట్ అందుకున్న ‘అను’
సాక్షి, చెన్నై: వర్షాలు, వరదలు విపత్తు ఈ పదాలకు అర్థాలు తెలియకపోయినా, తన తోటి చిన్నారుల కష్టాన్ని చూసి చలించిపోయిన తమిళనాడు అనుప్రియ (9) దానగుణంతో తన కోరికను నెరవేర్చుకుంది. అలాగే అనుప్రియకు కొత్త సైకిల్ ఇస్తామని ప్రకటించిన హీరో సైకిల్స్ కూడా తన మాటను నిలబెట్టుకుంది. మంగళవారం అనుప్రియను కలిసిన సంస్థ ఎండీ, ఛైర్మన్ పంకజ్ ఎం ముంజాల్ బ్రాండ్ న్యూ సైకిల్‌ను బహూకరించారు. ఈ సందర్బంగా అనుప్రియతో మాట్లాడటం, ఆమె తల్లిని కలవడం సంతోషంగా ఉందని, జీవితాంతం అనుప్రియ ఇదే వ్యక్తిత్వాన్ని కలిగి వుండాలంటూ ఆయన ట్వీట్ చేశారు. కేరళ వరదల్లో తన తోటి చిన్నారుల కష్టాలను టీవీలో చూసి కేవలం బాధపడి ఊరుకోకుండా, తనవంతు సాయం చేసేందుకు పెద్ద మనసు చేసుకుంది. యతద్వారా తమిళనాడు విల్లుపురానికి చెందిన అనుప్రియ(9) వార్తల్లో నిలిచింది. సైకిల్ కొనుక్కునేందుకు ఐదు పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును వరద బాధితులకు విరాళమిచ్చి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేరళ వరద విరాళాల ట్రాన్సాక్షన్స్ ద్వారా లక్షలాదిమంది యూజర్లను సాధిస్తూ, కోట్లాది రూపాయల టర్నోవర్‌ను సొంతం చేసుకుంటున్న పేటీఎం సీఈవో విజయ్‌శేఖర్ శర్మకంటే ఈ చిన్నారి చాలా నయం. అనుప్రియకు సాల్యూట్స్ అంటూ నెటిజన్లు చిన్నారిని అభినందించారు. అటు అనుప్రియ ఔదార్యానికి స్పందించిన హీరో మోటార్ సైకిల్స్ సంవత్సరానికి ఒక బైక్ (కిడ్స్) అందిస్తామని ట్విటర్ ద్వారా వెల్లడించింన సంగతి తెలిసిందే. Thanks to you dear Anupriya and pleasure to talk to your mom. I had read every act of kindness has a ripple effect. Through you I experienced, “Some act of kindness may bring an avalanche “. You are truly blessed and keep up this character of strength that you carry. pic.twitter.com/Ab8plZnKHM — Pankaj M Munjal (@PankajMMunjal) August 20, 2018 -
హీరో సైకిల్స్ చేతికి బీఎస్ హెచ్ వెంచర్స్
శ్రీలంక కంపెనీలో 60% వాటా కొనుగోలు న్యూఢిల్లీ: శ్రీలంకకు చెందిన బీఎస్‌హెచ్ వెంచర్స్‌లో 60 శాతం వాటాను హీరో సైకిల్స్ కొనుగోలు చేసింది. దీంతో హీరో సైకిల్స్ కంపెనీ ఆరు నెలల్లో మూడు కంపెనీలను కొనుగోలు చేసినట్లయింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు, అంతర్జాతీయంగా తమ స్థానాన్ని మరింత పటి ష్టం చేసుకునేందుకుగాను బీఎస్‌హెచ్ వెంచర్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేశామని హీరో సైకిల్స్ తెలిపింది. ఈ శ్రీలంక సైకిల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నామని హీరో సైకిల్స్ సీఎండీ పంకజ్ ముంజాల్ చెప్పారు. ఇంతకు ముందు హీరో సైకిల్స్ కంపెనీ ఇంగ్లాండ్‌కు చెందిన అవోసెట్ స్పోర్ట్స్, ఫైర్ఫాక్స్ బైక్స్ కంపెనీలను కొనుగోలు చేసింది. అవొసెట్ స్పోర్ట్స్ కొనుగోలుతో యూరప్ సైకిల్ మాస్ సెగ్మంట్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఫైర్ఫాక్స్ బైక్స్ కంపెనీ కొనుగోలు- భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం సైకిల్ సెగ్మెంట్లో హీరో స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని అంచనా. -
సైకిళ్ల కొనుగోళ్లకు నిరుపేదలకు రుణాలివ్వాలి: హీరో సైకిల్స్
హైదరాబాద్: దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదలు సైకిళ్లు కొనుగోలు చేయడానికి వారికి మైక్రోఫైనాన్స్ ద్వారా తగిన ఆర్థిక తోడ్పాటునందించాల్సిన అవసరం ఉందని హీరో సైకిల్స్ కో-చైర్మన్, ఎండీ పంకజ్ ముంజాల్ పేర్కొన్నారు. ఇందుకు తాము ఆర్థిక సంస్థలతో భాగస్వాములు కావడానికి సిద్ధంగా వున్నామని చెప్పారు. దేశంలోదారిద్య్రరేఖకు దిగువన 40 కోట్లమంది ప్రజలున్నారని, సైకిళ్లు వారికి అందించగలిగితే వారి జీవనానికి అవి ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రపతి 79వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో ముంజాల్ పాల్గొన్నారని హీరో సైకిల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రణబ్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి భవన్ సిబ్బందికి 50 కస్టమైజ్డ్ హీరో సైకిళ్లను బహుమతిగా ప్రదానం చేశామని పేర్కొంది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఉన్న రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయ పిల్లలకు స్కాలర్షిప్లను ముంజాల్ ప్రదానం చేశారని వివరించింది.