‘శశికళకు ఎలాంటి పదవి లేదు’
చెన్నై: శాసనసభలో బలనిరూపణకు అవకాశం ఇస్తే మెజారిటీ నిరూపించుంటామని అన్నాడీఎంకే ఎంపీ, పన్నీర్ సెల్వం మద్దతుదారుడు వి. మైత్రేయన్ తెలిపారు. అన్నాడీఎంకే నుంచి తమను సస్పెండ్ చేసే అధికారం శశికళ నటరాజన్ కు లేదని అన్నారు. అన్నాడీఎంకేలో ఆమెకు ఎలాంటి పదవి లేదని వెల్లడించారు. ఎమ్మెల్యేల నుంచి పళనిస్వామి బలవంతంగా సంతకాలు సేకరించారని ఆరోపించారు.
మరో నాయకుడు పాండ్యన్ తో పాటు మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా తమనే ఆహ్వానించాలని కోరారు. అన్నాడీఎంకే శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నికైన పళనిస్వామి అంతకుముందు గవర్నర్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.