‘శశికళకు ఎలాంటి పదవి లేదు’ | Panneerselvam supporter V Maitreyan meet Governor | Sakshi
Sakshi News home page

‘శశికళకు ఎలాంటి పదవి లేదు’

Published Tue, Feb 14 2017 7:10 PM | Last Updated on Thu, May 24 2018 12:05 PM

‘శశికళకు ఎలాంటి పదవి లేదు’ - Sakshi

‘శశికళకు ఎలాంటి పదవి లేదు’

చెన్నై: శాసనసభలో బలనిరూపణకు అవకాశం ఇస్తే మెజారిటీ నిరూపించుంటామని అన్నాడీఎంకే ఎంపీ, పన్నీర్‌ సెల్వం మద్దతుదారుడు వి. మైత్రేయన్‌ తెలిపారు. అ​న్నాడీఎంకే నుంచి తమను సస్పెండ్‌ చేసే అధికారం శశికళ నటరాజన్‌ కు లేదని అన్నారు. అన్నాడీఎంకేలో ఆమెకు ఎలాంటి పదవి లేదని వెల్లడించారు. ఎమ్మెల్యేల నుంచి పళనిస్వామి బలవంతంగా సంతకాలు సేకరించారని ఆరోపించారు.

మరో నాయకుడు పాండ్యన్‌ తో పాటు మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావును కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా తమనే ఆహ్వానించాలని కోరారు. అన్నాడీఎంకే శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నికైన పళనిస్వామి అంతకుముందు గవర్నర్‌ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement