'ఎమ్మెల్యేల సంతకాలన్నీ ఫోర్జరీ'
చెన్నై: తనకు 120పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని శశికళ నటరాజన్ చెప్పుకోవడాన్ని పన్నీర్ సెల్వం మద్దతుదారులు తప్పుబడుతున్నారు. శశికళ చెబుతున్న ఎమ్మెల్యేల సంతకాలన్నీ ఫోర్జరీ అని అన్నాడీఎంకే సీనియర్ నేత, పన్నీర్ సెల్వం మద్దతుదారుడు వి.మైత్రేయన్ ఆరోపించారు. ప్రస్తుతం తలెత్తిన సంక్షోభం పరిష్కారం కావాలంటే అసెంబ్లీలో బలం నిరూపించుకోవడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. పార్టీ మొత్తం పన్నీర్ సెల్వం వెంటే ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా 'సేఫ్ గేమ్' ప్లే చేయాలనుకుంటున్నారని, పరిస్థితులను బట్టి ఎటు కావాలంటే అటు మొగ్గేందుకు సానుకూలంగా ఉన్నారని మైత్రేయన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కావాలంటే నైతిక మద్దతు మాత్రమే ఇవ్వచ్చు గానీ రాజకీయ మద్దతు కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా, తనకు మద్దుతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను శశికళ గురువారం రాత్రి గవర్నర్ విద్యాసాగర్ రావుకు అందజేశారు.
చదవండి :
క్షణక్షణం.. గవర్నర్తో శశికళ భేటీ!