Para-athletes
-
‛స్వర్ణ’ సుందర్
దుబాయ్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్ త్రోయర్ సుందర్ సింగ్ గుర్జర్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఎఫ్–46 కేటగిరిలో తలపడిన అతను బంగారు పతకం సాధించాడు. దీంతో టోక్యో పారాలింపిక్ గేమ్స్‌కు అర్హత సంపాదించాడు. ఈ పోటీల్లో కాంస్య పతకం సాధించిన అజిత్ సింగ్, రింకూలకూ టోక్యో బెర్త్‌లు లభించాయి. సోమవారం జరిగిన ఈ పోటీలో సుందర్ ఈ సీజన్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈటెను 61.22 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. అజిత్ 59.46 మీటర్లతో మూడో స్థానంలో నిలువగా... రింకూకు నాలుగో స్థానం దక్కింది. 23 ఏళ్ల సుందర్ గుర్జర్ తాజా స్వర్ణంతో వరుస ప్రపంచ ఈవెంట్లలో టైటిల్ నెగ్గిన రెండో పారా అథ్లెట్‌గా ఘనతకెక్కాడు. అతను లండన్ (2017) ఈవెంట్లోనూ బంగారం గెలిచాడు. గతంలో దేవేంద్ర జజారియా లియోన్–2013, దోహా–2015 ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో పసిడి పతకాలు నెగ్గాడు. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఎఫ్–56 డిస్కస్ త్రోలో యోగేశ్ కథునియా రజతం గెలిచాడు. అతను డిస్క్‌ను 42.05 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. -
పారా ఏషియాడ్‌లో భారత పతాకధారిగా తంగవేలు
రియో పారాలింపిక్స్ చాంపియన్ తంగవేలు మరియప్పన్ పారా ఆసియా క్రీడల్లో భారత పతాకధారిగా జట్టును నడిపించనున్నాడు. ఇండోనేసియాలోని జకార్తాలో ఈ నెల 6 నుంచి 13 వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. ఈసారి పారా క్రీడల్లో ఎన్నడూ లేని విధంగా భారత్ జంబో బృందంతో బరిలోకి దిగుతోంది. అథ్లెట్లు, సహాయ సిబ్బంది సహా మొత్తం 302 మందితో కూడిన భారత బృందం పతకాల వేటకు సిద్ధమైంది. తొలి విడతగా వెళ్లిన కొంత మంది భారత జట్టు సభ్యులకు సోమవారం క్రీడాగ్రామం వద్ద చేదు అనుభవం ఎదురైంది. బస ఏర్పాట్లకు నిర్దేశిత ఫీజు రూ. కోటి 80 లక్షలు చెల్లించకపోవడంతో అథ్లెట్లను గేమ్స్ విలేజ్‌లోకి అనుమతించలేదు. చివరకు 4వ తేదీకల్లా చెల్లిస్తామన్న హామీతో నిర్వాహకులు ఆలస్యంగానైనా అనుమతించారు. -
సపోర్ట్ టు పారా అథ్లెట్స్
విధి చేతిలో ఓడిన అతను.. ఇప్పుడు విధిని ఎదిరిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఓ కాలు కోల్పోయినా.. సైక్లింగ్‌లో సత్తా చాటుతున్నాడు. అంతేకాదు.. తోటి పారా అథ్లెట్లకు ఆసరాగా నిలుస్తున్నాడు విజయవాడకు చెందిన అశోక్ మెహతా. ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఏఎంఎఫ్) పేరుతో పారా అథ్లెట్లకు సహకారం అందిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్‌లో శనివారం పారా అథ్లెట్లకు కావలసిన పరికరాలను సినీ నటి అక్కినేని అమల చేతుల మీదుగా అందజేశారు. విజయవాడకు చెందిన పారా స్వివ్ముర్ శ్రీనివాస్ నాయుుడు, కోల్‌కతాకు చెందిన పారా సైక్లిస్ట్ అలోక్ వుండల్,నగరానికి చెందిన పారా సైక్లిస్ట్ అభిషేక్‌లకు కృత్రివు అవయువాలు, సైకిళ్లను పంపిణీ చేశారు. ‘రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన అశోక్ మెహతా సైక్లింగ్‌లో రాణించడమే కాకుండా తోటి పారా అథ్లెట్లకు సహాయం చేయడం గర్వించదగ్గ విషయం’ అని అమల అన్నారు.