Paralympic athlete
-
సీఏఎస్ తీర్పు: భారత స్వర్ణ పతక విజేతపై నిషేధం
ప్యారిస్ పారాలింపిక్స్-2024కు ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో పారాలింపిక్ స్వర్ణ పతక విజేత, పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్‌పై వేటు పడింది. పద్దెనిమిది నెలల పాటు అతడు ఏ టోర్నీలో పాల్గొనకుండా బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య(BWF) నిషేధం విధించింది.అందుకే వేటు వేశాండోపింగ్ నిరోధక నిబంధనల నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘పన్నెండు నెలల వ్యవధిలో మూడుసార్లు పరీక్షకు రమ్మని ఆదేశించగా.. ప్రమోద్ భగత్ రాలేదు. అంతేకాదు.. ఆ సమయంలో తాను ఎక్కడ ఉన్నాను, ఎందుకు రాలేకపోయాను అన్న వివరాలు చెప్పడంలోనూ విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో మార్చి 1, 2024.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్(CAS) డోపింగ్ నిరోధక డివిజన్.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అతడిని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో SL3 అథ్లెట్ అయిన భగత్.. CASను సంప్రదించి నిషేధం ఎత్తివేయాలని కోరాడు. అయితే, జూలై 29, 2024లో అతడి పిటిషన్‌ను CAS కొట్టివేసింది. మార్చి 1 నాటి డివిజన్ ఇచ్చిన తీర్పును సమర్థించింది’’ అని బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య తన ప్రకటనలో ఈ మేరకు వివరాలు వెల్లడించింది.భారత్‌కు ఎదురుదెబ్బేకాగా శరీరంలోని ఒక పక్క మొత్తం పాక్షికంగా పనిచేయని లేదా కాలి కింది భాగం పనిచేయని.. అంటే వేగంగా నడవలేని, పరుగెత్తలేని స్థితిలో ఉన్న బ్యాడ్మింటన్ ప్లేయర్ SL3 విభాగంలో పోటీపడతారు. ఇక టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డానియెల్ బెథెల్‌ను ఓడించిన 35 ఏళ్ల ప్రమోద్ భగత్ పసిడి పతకం గెలుచుకున్నాడు. అంతేకాదు.. 2015, 2019, 2022లో వరల్డ్ చాంపియన్‌గానూ నిలిచిన ఘనత ఈ బిహారీ పారా అథ్లెట్ సొంతం. ప్యారిస్ పారాలింపిక్స్‌లోనూ కచ్చితంగా స్వర్ణం గెలుస్తాడనే అంచనాలు ఉండగా.. ఇలా 18 నెలల పాటు అతడిపై వేటు పడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనగా కేవలం ఆరు పతకాలే వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: Neeraj Chopra: రూ. 52 లక్షల వాచ్!.. కోట్ల ఆస్తి: కష్టపడి పైకొచ్చిన నీరజ్ చోప్రా -
Devendra Jhajaria: పార్లమెంట్ బరిలో పతకాల వీరుడు
Paralympian Devendra Jhajaria: రానున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. క్రీడా ప్రపంచంలో పేరుగాంచిన అథ్లెట్ దేవేంద్ర ఝజారియా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పారాలింపిక్స్‌లో రెండు బంగారు, ఒక రజత పతకం సాధించిన రాజస్థాన్‌కు చెందిన దేవేంద్ర ఝజారియా 2024 లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాజస్థాన్‌లోని చురు లోక్‌సభ స్థానం నుంచి ఆయనకు బీజేపీ అవకాశం కల్పించింది. భారత పారాలింపియన్ దేవేంద్ర ఝజారియా జావెలిన్ త్రోయర్. 2004 ఏథెన్స్లో జరిగిన సమ్మర్ పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో తన మొదటి బంగారు పతకాన్ని సాధించారు. అంతేకాదు దేశానికి రెండో పారాలింపిక్ బంగారు పతకాన్ని అందించిన క్రీడాకారుడు దేవేంద్ర ఝజారియా. ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక భారతీయుడు కూడా ఈయనే. రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా వచ్చే లోక్ సభ ఎన్నికలకు వీటిలో 15 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ తన తొలి జాబితాలో విడుదల చేసింది. వీరిలో పారాలింపియన్ దేవేంద్ర ఝజారియాతోపాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, నలుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు. దేవేంద్ర ఝజారియాకు టికెట్ ఇవ్వడం కోసం చురు నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచిన రాహుల్ కశ్వాన్‌ను బీజేపీ పక్కన పెట్టింది. ఈసారి ఆయనకు ఇక్కడి నుంచి టిక్కెట్ దక్కలేదు. క్రీడా క్షేత్రంలో పతకాలు గెలిచిన దేవేంద్ర ఝజారియా ప్రజా క్షేత్రంలో గెలుస్తాడో లేదో చూడాలి. -
మనసులు గెలుచుకున్న పారా కరాటే ఛాంపియన్
కౌలాలంపూర్: చిన్న గెలుపును కూడా ధూమ్ ధామ్ చేస్తూ ఆర్భాటంగా జరుపుకునే రోజులివి. అలాంటిది తన గెలుపును తనతో పాటు ఓడిన వ్యక్తితో కలిపి జరుపుకుని అసలైన ఛాంపియన్ గా నిలిచాడు పారా కరాటే ఛాంపియన్ ఫర్జాద్ సఫావి. మలేషియాలోని మెలాకాలో జరిగిన ఏషియన్ పారా కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో హృదయాలను కదిలించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పారా కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో ఇరాన్ ఆటగాడు ఫర్జాద్ సఫావి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడని ప్రకటించగానే అతడు మొదట ప్రేక్షకులకు సంప్రదాయబద్ధంగా వంగి అభివాదం చేశాడు. అనంతరం ఫైనల్లో తనపై ఓటమి పాలై రన్నరప్ గా నిలిచిన ఆటగాడు స్టేజి విడిచి వెళ్తోన్న విషయాన్ని గమనించి పరుగున అతడి వద్దకు వెళ్లి అతని చేతిని పైకి ఎత్తి తన విజయాన్ని అతనికి కూడా ఆపాదించాడు. దీంతో ఈ వీడియో చూసిన వారంతా ఛాంపియన్ ఆటగాడు ఛాంపియన్ లా వ్యవహరించాడంటూ అతడిపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ దృష్యాన్ని చూసిన వారెవరైనా భావోద్వేగానికి లోనుకావడం ఖాయం. శుభాకాంక్షలు ఫర్జాద్ క్రీడాస్ఫూర్తి అంటే ఏంటో చూపించావు. దయార్ద హృదయంతో మా హృదయాలను గెలుచుకున్నావు. నుసిక్యూ అసలైన చాంపియన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) ఇది కూడా చదవండి: నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు.. -
పారా అథ్లెట్లకు ఏఎంఎఫ్ ఆసరా
నేడు అమల చేతుల మీదుగా పరికరాల పంపిణీ ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఏఎంఎఫ్) పారా అథ్లెట్లకు ఆసరాగా నిలుస్తోంది. సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్‌లో శనివారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమంలో పారా అథ్లెట్లకు కావలసిన పరికరాలను, కృత్రిమ అవయవాలను అమల అక్కినేని చేతుల మీదుగా పంపిణీ చేయనుంది. విజయవాడకు చెందిన పారా స్విమ్మర్ శ్రీనివాస్ నాయుడు, కోల్‌కతాకు చెందిన పారా సైక్లిస్ట్ అలోక్ మండల్, నగరానికి చెందిన పారా సైక్లిస్ట్ అభిషేక్‌లకు రూ.4 లక్షల విలువ చేసే కృత్రిమ అవయవాలను, పరికరాలను అందజేయనున్నట్లు ఏఎంఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.