parashuramulu
-
తెలంగాణలో ఇద్దరికి జాతీయ సేవాపథకం అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఏటా ఇచ్చే జాతీయ సేవా పథకం అవార్డు– 2021–22ను తెలంగాణకు చెందిన ఇద్దరు దక్కించుకున్నారు. హనుమకొండకు చెందిన గుండె పరశురాములు, హైదరాబాద్‌కు చెందిన దావెర మనోజ్ ఖన్నా చేపట్టిన స్వచ్ఛంద సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి అవార్డులు అందజేశారు. గుండె పరశురాములు స్వచ్ఛంద సేవ హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీరు గుండె పరశురాములు మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలపై చొరవ చూపేవారు. 1,300 మొక్కలు నాటిన పరశురాములు 10 రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ ప్రచారంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో వాల్‌పోస్టర్లు, షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా అవగాహన కల్పించారు. ఉజ్వల యోజన, పీఎం జీవన్‌బీమా యోజన, పీఎం జన్‌ధన్ యోజన తదితర పథకాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాల గురించి దత్తత గ్రామాల్లో అవగాహన కల్పించారు. పథకాలపై మనోజ్ ఖన్నా ప్రచారం మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీరు మనోజ్ ఖన్నా ఉజ్వల యోజన, పీఎం జీవన్‌బీమా యోజన, పీఎం జన్‌ధన్ యోజన వంటి ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాలపై దత్తత గ్రామాల్లో 650పైగా కార్యక్రమాలు నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాపులు నిర్వహించారు. ఇతర వలంటీర్లతో కలిసి శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయడం, కోవిడ్ వేళ పేద పిల్లలకు ఆహారం సేకరించి అందించడం వంటి పనులు చేశారు. మనోజ్ రక్తదాన శిబిరాల ద్వారా 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. -
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సై వీడియో వైరల్
-
పరశురాములుకు తొలి ‘పాయింట్’
హెల్మెట్ లేనందుకు విధించిన ట్రాఫిక్ పోలీసులు గ్రేటర్లో అమలులోకి ‘ట్రాఫిక్’పాయింట్ల విధానం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులకు పెనాల్టీ పాయింట్లు విధించే విధానం మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు తమ తమ పరిధుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ.. చలాన్ టికెట్ జారీ చేయడంతో పాటు పాయింట్లు వడ్డించారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును సంయుక్త పోలీసు కమిషనర్ వి.రవీందర్ స్వయంగా పర్యవేక్షించారు. నగరానికి సంబంధించి తొలి పాయింట్‌ను నల్లకుంట పోలీసులు విధించారు. మంగళవారం ఉదయం 10.49 గంటల ప్రాంతంలో హెల్మెట్ లేకుండా టీఎస్07ఎఫ్డీ3298 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన వాహనంపై వస్తున్న ద్విచక్ర వాహనచోదకుడు పరశురాములును సబ్–ఇన్స్పెక్టర్ బి.రాజునాయక్ నల్లకుంట ప్రాంతంలో ఆపారు. ఆయనకు చలాన్ జారీ చేయడంతో పాటు ఒక పెనాల్టీ పాయింట్ విధించారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు సిటీ ట్రాఫిక్ పోలీసులు మొత్తం 1,324 మంది వాహనచోదకులకు 1,493 పెనాల్టీ పాయింట్లు విధించారు. కనిష్టంగా ఒకటి నుంచి గరిష్టంగా నాలుగు వరకు ఈ పాయింట్లు పడ్డాయి. వీటిలో అత్యధికంగా ద్విచక్ర వాహన చోదకులకు, హెల్మెట్ ధరించని ఉల్లంఘనపై విధించారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో మధ్యాహ్నం, సైబరాబాద్‌లో సాయంత్రం పాయింట్ల విధింపు ప్రక్రియ ప్రారంభమైంది. మూడు కమిషరేట్లలోనూ క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు తమ వద్ద ఉన్న పీడీఏ మిషన్ల ద్వారా పెనాల్టీ పాయింట్లను వాహనచోదకుడి డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఆధారంగా నమోదు చేశారు. తొలి పాయింట్ పడిన నాటి నుంచి 24 నెలల్లో 12 పాయింట్లు వస్తే సదరు వాహనచోదకుడి డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది పాటు సస్పెండ్ అవుతుంది. నమోదైన కేసుల్లో విధించిన పెనాల్టీ పాయింట్లు ఇవీ.. వాహన రకం కేసులు విధించిన పాయింట్లు ద్విచక్ర వాహనాలు 1,239 1,346 త్రిచక్ర వాహనాలు 13 23 తేలికపాటి వాహనాలు 33 47 భారీ వాహనాలు 39 77 మొత్తం 1,324 1,493 – ఓ వాహనంపై ఒకే కేసు నమోదు చేసినా.. ఉల్లంఘనను బట్టి ఒకటి కంటే ఎక్కువ పాయింట్లు విధించే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య కంటే పాయింట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.