Parents Association
-
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు
-
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేరెంట్స్ అసోసియేషన్ తెలంగాణ హైకోర్టుకు వివరించింది. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకున్నా అడ్డగోలు ఫీజులు చెల్లించాలని ప్రైవేటు పాఠశాలలు తమపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపింది. ప్రైవేటు స్కూళ్ల దోపిడిని అరికట్టాలంటూ పేరెంట్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు, ఆన్లైన్ క్లాసులపై హైకోర్టును ఆశ్రయించిన పేరెంట్స్ అసోసియేషన్ పిటీషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జీవో 46ను ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. వసూళ్ల కోసం స్కూళ్లు పంపించిన సందేశాలను, వాయిస్‌లను సాక్షాలుగా కోర్టుకు చూపించింది. దీంతో ఆన్లైన్ క్లాస్‌ల నిర్వాహణపై ప్రభుత్వం ఏమైనా సర్క్యూలర్ జారీ చేసిందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. (తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా) హర్యానా రాష్ట్రంలో ఇప్పటికే ఆన్లైన్ క్లాస్‌లను నిషేధించారని పేర్కొన్న హైకోర్టు.. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో విద్యార్థులపై ఒత్తిడి తీసుకు రావద్దని ప్రభుత్వాలు స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చారని వెల్లడించింది. ఆన్లైన్ క్లాస్‌లపై యూనిఫామ్ పాలసీ తీసుకు రావాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ క్లాస్‌లపై ఎలాంటి నిర్ణయం తీసుకుందని హైకోర్టు ప్రశ్నించగా, జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై పరిశీలిస్తున్నారని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు అన్లైన్ క్లాస్‌లపై ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారే విషయం కోర్టుకు తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆన్లైన్ క్లాస్‌లు ఉంటాయా.. ఉండవా అన్న ప్రభుత్వ నిర్ణయం కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. (ఆన్లైన్ ‘దందా’) -
ఇంగ్లిష్ మీడియంపై పేదల వాదనా వినండి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తున్నామని విజయవాడలోని జక్కంపూడి ఎంపీపీ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని ఆ కమిటీ ఎక్స్ అఫిషియో సభ్యురాలు బి.శ్వేతా భార్గవి హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యానికి సంబంధించి తమ వాదనలూ వినాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఇంగ్లిష్ మీడియం ఉన్న ప్రైవేటు స్కూళ్లలో భారీ ఫీజులు చెల్లించి, తమ బిడ్డలను చదివించేంత స్థోమత తమకు లేదని, అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తాము మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పారు. ఎస్టీ కులానికి చెందిన తాను ఇంగ్లిష్ మీడియంలో మిగతా 2వ పేజీలో u చదివే స్థోమత లేక తెలుగు మీడియంలోనే విద్యాభ్యాసం కొనసాగించానని, ఉన్నత చదువుల సమయంలో ఇంగ్లిష్ రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని శ్వేతా భార్గవి వివరించారు. ఇంగ్లిష్ రాక ఎంతో మానసిక వేదన అనుభవించానని చెప్పారు. అనేక ఉద్యోగావకాశాలను కూడా కోల్పోయానని పేర్కొన్నారు. సామాజిక వివక్ష కూడా ఎదుర్కొన్నానని, చిన్నప్పటి నుంచి సరైన పునాది లేకపోవడం వల్ల ఇంగ్లిష్‌ను పూర్తి స్థాయిలో నేర్చుకోలేకపోయానని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల్లో గుబులు ప్రస్తుత ప్రపంచీకరణలో ఇంగ్లిష్ విశ్వభాషగా మారిపోయిందని శ్వేతా భార్గవి తెలిపారు. ప్రతి దశలో, ప్రతి చోట ఇంగ్లిష్ అవసరం చాలా ఉందని, అందుకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారని వివరించారు. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివి, ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చదవాల్సిన పరిస్థితులు ఉన్నాయని, దీంతో ఆయా సబ్జెక్టులు సులభంగా అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివిన విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి పరిష్కారం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేయడమేనన్నారు. అటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేక, ఇటు ప్రైవేటు పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేక పేద పిల్లలు సతమతమైపోతున్నారని ఆమె వివరించారు. దీనికి మందుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉత్తర్వులని, ఈ ఉత్తర్వుల వల్ల ప్రైవేటు పాఠశాలల్లో గుబులు మొదలైందని, ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తూ దాఖలైన ఈ వ్యాజ్యాల వెనుక ఆ పాఠశాలలే ఉన్నాయని ఆమె ఆరోపించారు. పేద పిల్లల తల్లిదండ్రుల వాదనలు వినండి పేదల పిల్లలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం ఓ వరం అని శ్వేతా భార్గవి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేద పిల్లలంతా లబ్ధి పొందుతారని, అందువల్ల ఈ విషయంలో న్యాయస్థానం ఎటువంటి వ్యతిరేక ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు. ఈ వ్యవహారంలో తమ వాదనలు కూడా వినాలని, అందువల్ల తమనూ ఈ వ్యాజ్యంలో ఇంప్లీడ్ చేసుకోవాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యం గురించి తల్లిదండ్రుల కమిటీ తరఫు న్యాయవాది మహేష్ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీంతో ధర్మాసనం విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఇంగ్లిష్ మీడియం ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై కూడా ఆ రోజు వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయ్
హైదరాబాద్: కవాడిగూడలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు ఎక్కువ అయ్యాయని విమర్శించారు. ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నారు తప్ప విద్యార్థుల బాగోగులు చూసే మేనేజెంట్లు లేవని మండిపడ్డారు. ఫీజు కట్టలేదని యాజమాన్యం, స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని తండ్రి రెండింటి మధ్య పిల్లలు నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు యాజమాన్యాలకు వంత పాడుతున్నారని ఆరోపించారు. యాజమాన్యాల దగ్గర పోలీసులు డబ్బులు దండుకుని..కేసులను తప్పు దోవ పట్టిస్తున్నారని చెప్పారు. స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉండటం లేదని, ఇందులో బాలికల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. చేతగాని ప్రభుత్వం, స్కూళ్లల్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని, ఫీజులు ఇష్టారీతిన పెంచుకుంటూ పోతున్నా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కవాడీగూడ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వాన్నపరిస్థితి నెలకొందని వెల్లడించారు. నగరంలో జరిగేది ఒకటి కేంద్ర ప్రభుత్వానికి మునిసిపల్ శాఖ మంత్రి ఇచ్చే నివేదిక మరోలా ఉందని మండిపడ్డారు. ప్రైవేట్ యాజమాన్యాల ఆగడాలు అరికట్టకపోతే పేరెంట్స్ అసోసియేషన్ తరుపున రాబోయే రోజున మరింత ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. -
‘అధిక ఫీజు’ స్కూళ్ల వివరాలివ్వండి
పేరెంట్స్ అసోసియేషన్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ల వివరాలను 2 వారాల్లో సమర్పించాలని పేరెంట్స్ అసోసియే షన్ను హైకోర్టు ఆదేశించింది. స్కూళ్ల వివరాల్లే కుండా తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫీజులను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శంకర్ నారాయణల నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఫీజుల వివరాలను ముద్రిస్తున్నా, వన్‌టైం ఫీజు కింద ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని, వీటికి రశీదు కూడా ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది పి.వేణుగోపాల్ వాదనలు వినిపించారు. నిర్భంద విద్యా హక్కు చట్టం కింద పేదలకు సీట్లు కేటారుుంచడం లేదన్నారు. ఫీజులను నియంత్రిస్తూ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేందుకు ఏమైనా ఆధారాలున్నాయా అని పేరెంట్స్ అసోసియేషన్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ల వివరాలను ఇవ్వాలని తీర్పునిచ్చింది.