‘అధిక ఫీజు’ స్కూళ్ల వివరాలివ్వండి
పేరెంట్స్ అసోసియేషన్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ల వివరాలను 2 వారాల్లో సమర్పించాలని పేరెంట్స్ అసోసియే షన్‌ను హైకోర్టు ఆదేశించింది. స్కూళ్ల వివరాల్లే కుండా తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫీజులను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శంకర్ నారాయణల నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది.
ఫీజుల వివరాలను ముద్రిస్తున్నా, వన్‌టైం ఫీజు కింద ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని, వీటికి రశీదు కూడా ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది పి.వేణుగోపాల్ వాదనలు వినిపించారు. నిర్భంద విద్యా హక్కు చట్టం కింద పేదలకు సీట్లు కేటారుుంచడం లేదన్నారు. ఫీజులను నియంత్రిస్తూ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేందుకు ఏమైనా ఆధారాలున్నాయా అని పేరెంట్స్ అసోసియేషన్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ల వివరాలను ఇవ్వాలని తీర్పునిచ్చింది.