Paris robbery
-
‘రేప్ చేసి చంపేస్తారనుకున్నా’
పారిస్ దోపిడీ ఘటన తర్వాత జీవితం పట్ల తన దృక్కోణం మారిందని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ వెల్లడించింది. దోపిడీ దొంగలను తనను రేప్ చేసి, చంపేస్తారని భావించానని తెలిపింది. గతేడాది అక్టోబర్ లో పారిస్ హోటల్ లో కర్దాషియన్ ను తుపాకీతో బెదిరించి ఆమె నగలను దుండగులు ఎత్తుకుపోయారు. ఈ ఘటన సందర్భంగా తనను ఎదురైన అనుభవాన్ని తన సోదరీమణులతో పంచుకుంది. ‘అదో భయానక అనుభవం. ఆ క్షణంలో దోపిడీ దొంగలు తుపాకీతో నా తలలో కాలుస్తారని భావించాను. కానీ అలా జరగలేదు. నేను అరవకుండా నోటికి ప్లాస్టర్ వేయడంతో నన్ను రేప్ చేస్తారని అనుకున్నాను. అందుకు మానసికంగా సిద్ధమయ్యాన’ని కర్దాషియన్ వెల్లడించింది. దుండగులు ఆమెకు భౌతికంగా ఎటువంటి హాని తలపెట్టలేదు. ఆమెను స్నానాల గదిలో బంధించి ఆభరణాలు ఎత్తుకుపోయారు. ఈ కేసులో జనవరిలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నేరం అంగీకరించాడు. -
క్రైమ్ సీన్ ఫొటోలు బయటకు వచ్చాయి
పారిస్: రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ నగల చోరీ కేసుకు సంబంధించిన ఫోటోలను ఫ్రెంచ్ మీడియా బయటపెట్టింది. గతేడాది అక్టోబర్ లో పారిస్ హోటల్ లో కర్దాషియన్ ను తుపాకీతో బెదిరించి ఆమె నగలను దుండగులు ఎత్తుకుపోయారు. 4 మిలియన్ డాలర్లు విలువ చేసే ఉంగరంతో సహా ఖరీదైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, సీసీ టీవీ ఫుటేజీని ఫ్రెంచ్ మీడియా నెట్ వర్క్ టీఎఫ్ఐ వెలుగులోకి తెచ్చింది. హోటల్ లో కర్దాషియన్ బసచేసిన గదిలోపలి ఫొటోలు ఇందులో ఉన్నాయి. కర్దాషియన్ ను బంధించేందుకు దుండగులు ఉపయోగించిన డక్ట్ టేపు, ప్లాస్టిక్ తాడు తదితర వస్తువులను కూడా ఫొటోలు తీశారు. దుండగులు హోటల్ లోపలికి ప్రవేశిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించాయి. ఈ కేసులో 10 మంది నిందితులను జనవరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నేరం అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. -
అది ఫేక్ అంటావా.. వెబ్‌సైట్‌పై టీవీ నటి కేసు!
న్యూయార్క్: ప్రముఖ టీవీ సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ ఓ వెబ్‌సైట్‌పై పరువునష్టం దావా వేసింది. పారిస్‌లో తనపై జరిగిన సాయుధ దోపిడీ ఉత్త నాటకమేనని, బీమా సొమ్ము నొక్కేసేందుకే కిమ్ ఈ నాటకం ఆడి.. అందరినీ బోల్తా కొట్టించిందని ‘మీడియాటేక్అవుట్.కామ్’ ఓ కథనం ప్రచురించింది. ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తంచేసిన కిమ్ న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో పరువునష్టం దావా వేసింది. వదంతులు రాసే ఆ వెబ్సైట్ తనపై జరిగిన దోపిడీ విషయంలో అసత్యాలు ప్రచురించిందని కిమ్ ఆరోపించింది. గత నెల 3న పారిస్‌లోని తన అపార్ట్మెంట్లో కిమ్ కర్దాషియన్‌పై దోపిడీ దొంగలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తుపాకులతో బెదిరించి 10 మిలియన్ డాలర్ల విలువచేసే సొమ్మును దోచేశారు. అయితే, తనకు ఇన్సూరెన్స్ ఉండటంతో దోపిడీకి గురైన సొమ్మును చెల్లించాలమని ఆమె బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దోపిడీ నేపథ్యంలో 35 ఏళ్ల కిమ్ ఇప్పటివరకు టీవీ షోల్లోకానీ, సోషల్ మీడియాలోకానీ కనిపించలేదు. కిమ్ వ్యాఖ్యాతగా ఉన్న ‘కీపింగ్ అప్ విత్ ద కర్దాషియన్స్’ కార్యక్రమాన్ని కూడా నిలిపివేశారు. తనపై జరిగిన దోపిడీ అఘాయిత్యంతో కిమ్ భయభ్రాంతులకు గురైందని, తమ కుటుంబ భద్రతపై తాము తీవ్రంగా మథనపడుతున్నామని కిమ్ సోదరి ఖ్లోషి కర్దాషియన్ పేర్కొంది.