Paritala Subba Rao
-
అందరూ తెలంగాణ ఉద్యోగులే ఉండాలి
- ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ సుబ్బారావు - రేపు టీఎన్జీవోస్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం హన్మకొండ సిటీ : గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు తెలంగాణ ఉద్యోగులే ఉండాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో ఇంకా ఇక్కడ సీమాంధ్ర ఉద్యోగులు పనిచేయడాన్ని సహించేది లేదన్నారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం నుంచి టీఎన్జీవోస్ యూనియన్ కీలకంగా వ్యవహరిస్తోందని, జిల్లాలో ఈ యూనియన్ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ ఆవిర్భవించాక మొదటిసారిగా జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు గంట ముందు విధుల నుంచి వెళ్లేందుకు అనుమతించిన కలెక్టర్ కిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగాలు ఫణంగా పెట్టాం.. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యోగులు చేసిన పోరాటం మరువలేనిదని, ప్రజల కోసం ఉద్యోగాలను సైతం ఫణంగా పెట్టి పోరాడామని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడినందున ఉద్యోగులు హక్కులు సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యలు చర్చించి కావాల్సిన హక్కులు సాధించుకోవడానికి నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 19వ తేదీన టీఎన్జీవోస్ జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుందన్నారు. జిల్లాలోని ఉద్యోగులందరు ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కలెక్టర్ జి.కిషన్, టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.దేవీప్రసాద్‌రావు, కారం రవీందర్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సమావేశం కరపత్రాలను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో టీజీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నావీరాచారితో పాటు వెంకటేశ్వర్లు, హసనుద్దీన్, రాములు, రత్నాకర్ రెడ్డి, నరేందర్, కత్తి రమేష్, సోమయ్య, రాజేందర్, శ్రీనివాస్, మాధవరెడ్డి, వేణు, ప్రకాష్, జగదీష్, విజయలక్ష్మి పాలొన్నారు. -
కీర్తి స్థూపం
అమరుల త్యాగాలకు చిహ్నంగా ఏర్పాటు కలెక్టర్ కిషన్ ఆలోచనతోనే అంకురార్పణ తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర కీలకం రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపాలి ఉద్యోగ సంఘాల చైర్మన్, ఓరుగల్లు సేవాసమితి కన్వీనర్ పరిటాల సుబ్బారావు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘అలుపెరుగని ఉద్యమం.. 12 వందల మంది కిపైగా విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం.. అమరుల త్యాగా లకు చిహ్నంగా కలెక్టర్ నివాసం ఎదుట ఏర్పాటు చేసిన కీర్తి స్థూపాన్ని చూసినప్పుడల్లా మన బాధ్యత గుర్తుకురావాలి.. 29వ రాష్ట్రంగా అవతరి స్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలి పేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి’ అని ఉద్యోగ సంఘాల జిల్లా జేఏసీ చైర్మన్, ఓరుగల్లు సేవాసమితి కన్వీనర్ పరిటాల సుబ్బారావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ నేపథ్యంలో అమరుల కీర్తి స్థూపం విశేషాలు, రాష్ట్రంలో ఉద్యోగుల పాత్ర, ఓరుగల్లు సేవాసమితి తదుపరి కార్యాచరణ ను ‘న్యూస్‌లైన్’కు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కలెక్టర్ మానస పుత్రిక ఓరుగల్లు సేవాసమితి ప్రభుత్వ కార్యక్రమాలు అందనిచోట విద్య, వైద్యం, పర్యావరణం, సాంస్కృతిక అభివృద్ధి చేపట్టాలనే లక్ష్యంతో కలెక్టర్ జి.కిషన్ ఆలోచన నుంచి ఓరుగల్లు సేవాసమితి పురుడు పోసుకుంది. అదృష్టవశాత్తు అమరవీరుల కీర్తి స్థూపం ఏర్పాటు మొదటి కార్యక్రమం కావడం మా పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నాం. ఇక ముందు కూడా సమితి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందులో అన్నివర్గాలకూ అవకాశం కల్పిస్తున్నాం. డాక్టర్లు, లాయర్లు, రైస్ మిల్లర్లతోపాటు ప్రజాప్రతినిధులు సభ్యులుగా చేరే అవకాశం ఉంది. మొదటగా కలెక్టర్ రూ.ఐదు లక్షలు విరాళం ప్రకటించారు. ఉద్యోగులు సగంరోజు వేత నం సుమారు రూ.35 లక్షలు అంజేస్తున్నారు. ఇలా ప్రతిఒక్కరూ తోచినంత ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. స్థూపం ఆలోచన ఎలా వచ్చిందంటే .. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అపాయింటెడ్ డే ప్రకటించగానే స్వరాష్ర్ట కల సాకారం కావడానికి ఆత్మబలిదానాలు చేసుకున్న వారికి గుర్తుగా ఒక గుర్తింపు చిహ్నం ఏర్పాటు చేయాలని తెలంగాణ బిడ్డగా కలెక్టర్ ఆలోచించారు. ఇదే విషయం సమితి సభ్యులతో పంచుకున్నారు. ఆ వెంటనే పనులు చకచకా జరిగిపోయాయి. కుడా అధికారులు భీంరావు, అజిత్‌రెడ్డి పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రొఫెసర్ పాండురంగారావు ఆధ్వర్యంలో నిట్ ప్రొఫెసర్లు స్థూపం రూపం డిజైన్ చేశారు. స్థపతి శివకుమార్ ఆధ్వర్యంలో స్థూపాన్ని మలిచే పనులు పూర్తయ్యాయి. అమరవీరుల కీర్తి స్థూపం అని పొట్లపల్లి శ్రీనివాస్‌రావు నామకరణం చేశారు. అమరుల త్యాగాలు స్మరిస్తూ శ్రీనివాసరావు రాసిన నాలుగు వాక్యాలు స్థూపంపై చెక్కిస్తున్నాం. పార్లమెంట్, అసెంబ్లీల్లో కూడా అమరులగురించి కనీసం ప్రస్తావించకున్నా కలెక్టర్ స్పందించిన తీరు అభినందనీయం. తెలంగాణ పది జిల్లాల్లో అవతరణ రోజు ఇలాంటి కార్యక్రమం ఎక్కడా చేపట్టడంలేదు. జిల్లాకు గర్వకారణం. అమరుల త్యాగాలు మరవొద్దు 29వ రాష్ట్రంగా తెంగాణ ఏర్పాడుతున్నా అభివృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలి. అప్పుడే అమరులకు నిజమైన నివాళి. వారు కలలుగన్న తెలంగాణకోసం ప్రతి ఒక్కరూ అకుంటిత దీక్షతో పనిచేయాల్సి ఉంటుంది. అందుకే స్థూపం చూసినప్పుడు వారి త్యాగాలు మన కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. అందుకే ఆవిష్కరణ అనంతరం అక్కడ ప్రతిజ్ఞచేస్తున్నాం. స్ఫూర్తినిచ్చిన ఉద్యోగుల ఐక్యత పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేసుకునేందుకు ప్రతీ ఉద్యోగి రోజుకు రెండుగంటలు అదనంగా పనిచేసేం దుకు సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగుల పాత్ర ఎంతో ముఖ్యమైంది. మన జిల్లాలో ఉద్యోగుల మధ్య మంచి ఐక్యత ఉం టుంది. ఎలాంటి కార్యక్రమమైనా సునాయాసంగా చేయగలరు. లక్ష గళారచ్చన.. సకలజ నుల సమ్మె.. సహాయనిరాకరణ.. ఇలా ఏదైనా కావచ్చు ఉద్యోగుల ఐక్యత వల్లే విజయవం తం అయ్యాయి. రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం స్థూపంపై అమరులందరి పేర్లూ ఉండాలని.. ప్రస్తుతం తయారు చేస్తున్న అమరవీరుల జా బితా అధికారికం కాదు. రాష్ట్ర ఏర్పాటు తరువాత అమరవీరులను గుర్తించేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ కమిటీ అధికారికంగా తెలంగాణ అమరవీరుల జాబితా సిద్ధిం చేస్తుంది. గెజిట్‌లో పొందుపరిచాక తెంగాణ రాష్ట్రంలోని అమరవీరుల పేర్లన్నీ కీర్తి స్థూపంపై రాయిస్తాం. అందుకు అనుగుణంగా ప్రస్తుతం చెక్కడం చేయించాం. ‘వరంగల్ యాది’ డాక్యుమెంటరీ సిద్ధం తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా పాత్రను ఆవిష్కరిచే విధంగా 8 నిమిషాల నిడివిగల ‘వరంగల్ యాది’ పేరుతో డాక్యుమెంటరీ చిత్రం రూపొందించారు. ఏపీఆర్వో ఈవీ కిరణ్మయీ, ఐకేపీ ల్యాండ్ డీపీఎం నళినీనారాయణ, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తయింది. దీన్ని కలెక్టర్ ఆవిష్కరిస్తారు. జయశంకర్ స్మృతివనంపై దృష్టి ఇక సమితి తరువాతి కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సృ్మతివనం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, సూబేదారిలోని మాదన్న విగ్రహం వద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేట్టాలని నిర్ణయించాం. మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. -
...లేదంటే మహా ఉద్యమమే
=తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ =నేడు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ ప్రతిపాదన విరమించుకోవాలి.. లేదంటే తెలంగాణ ఉద్యమం మహా ఉద్యమంగా మారుతుం దని తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ బుధవారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు చేస్తే సివిల్‌వార్ తీసుకొస్తామం టూ ఏపీ ఎన్జీవోస్ నాయకుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ.. పోరాటం ఎలా చేయాలో ఈ ప్రాంత బిడ్డలకు తెలుసన్నారు. హైదరాబా ద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే వరకూ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని తిరగదోడి రాయల తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నాటి బంద్‌లో ఉద్యోగులంతా పాల్గొంటున్నామని, అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షు డు కోల రాజేష్ కుమార్ మాట్లాడుతూ రాయల తెలంగాణను నిరసిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట వెయ్యి మంది ఉద్యోగులతో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న మోసాలను అడ్డుకుంటామన్నారు. మహాధర్నాలో ఉద్యోగులంతా పాల్గొనాలని కోరారు. నిరసన కార్యక్రమంలో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి షేక్ హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు దాస్యానాయక్, టీఎన్జీవోస్ నాయకులు ఈగ వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, రాంకిషన్, సోమయ్య, ధరంసింగ్, శ్రీనివాస్, శ్యాంసుం దర్, సలీం, వేణు, రమేశ్, రత్నాకర్‌రెడ్డి, కిరణ్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.