కీర్తి స్థూపం | Telagana formation day | Sakshi
Sakshi News home page

కీర్తి స్థూపం

Published Mon, Jun 2 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM

కీర్తి స్థూపం

కీర్తి స్థూపం

  •       అమరుల త్యాగాలకు చిహ్నంగా ఏర్పాటు
  •      కలెక్టర్ కిషన్ ఆలోచనతోనే అంకురార్పణ
  •      తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర కీలకం
  •      రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపాలి
  •      ఉద్యోగ సంఘాల చైర్మన్, ఓరుగల్లు సేవాసమితి కన్వీనర్ పరిటాల సుబ్బారావు
  •  కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘అలుపెరుగని ఉద్యమం.. 12 వందల మంది కిపైగా విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం.. అమరుల త్యాగా లకు చిహ్నంగా కలెక్టర్ నివాసం ఎదుట ఏర్పాటు చేసిన కీర్తి స్థూపాన్ని చూసినప్పుడల్లా మన బాధ్యత గుర్తుకురావాలి.. 29వ రాష్ట్రంగా అవతరి స్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలి పేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి’ అని ఉద్యోగ సంఘాల జిల్లా జేఏసీ చైర్మన్, ఓరుగల్లు సేవాసమితి కన్వీనర్ పరిటాల సుబ్బారావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ నేపథ్యంలో అమరుల కీర్తి స్థూపం విశేషాలు, రాష్ట్రంలో ఉద్యోగుల పాత్ర, ఓరుగల్లు సేవాసమితి తదుపరి కార్యాచరణ ను ‘న్యూస్‌లైన్’కు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
     
    కలెక్టర్ మానస పుత్రిక ఓరుగల్లు సేవాసమితి

    ప్రభుత్వ కార్యక్రమాలు అందనిచోట విద్య, వైద్యం, పర్యావరణం, సాంస్కృతిక అభివృద్ధి చేపట్టాలనే లక్ష్యంతో కలెక్టర్ జి.కిషన్ ఆలోచన నుంచి ఓరుగల్లు సేవాసమితి పురుడు పోసుకుంది. అదృష్టవశాత్తు అమరవీరుల కీర్తి స్థూపం ఏర్పాటు మొదటి కార్యక్రమం కావడం మా పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నాం. ఇక ముందు కూడా సమితి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందులో  అన్నివర్గాలకూ అవకాశం కల్పిస్తున్నాం. డాక్టర్లు, లాయర్లు, రైస్ మిల్లర్లతోపాటు ప్రజాప్రతినిధులు సభ్యులుగా చేరే అవకాశం ఉంది. మొదటగా కలెక్టర్ రూ.ఐదు  లక్షలు విరాళం ప్రకటించారు. ఉద్యోగులు సగంరోజు వేత నం సుమారు రూ.35 లక్షలు అంజేస్తున్నారు. ఇలా ప్రతిఒక్కరూ తోచినంత ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.
     
    స్థూపం ఆలోచన ఎలా వచ్చిందంటే ..
     
    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అపాయింటెడ్ డే ప్రకటించగానే స్వరాష్ర్ట కల సాకారం కావడానికి ఆత్మబలిదానాలు చేసుకున్న వారికి గుర్తుగా ఒక గుర్తింపు చిహ్నం ఏర్పాటు చేయాలని తెలంగాణ బిడ్డగా కలెక్టర్ ఆలోచించారు. ఇదే విషయం సమితి సభ్యులతో పంచుకున్నారు. ఆ వెంటనే పనులు చకచకా జరిగిపోయాయి. కుడా అధికారులు భీంరావు, అజిత్‌రెడ్డి పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు.

    ప్రొఫెసర్ పాండురంగారావు ఆధ్వర్యంలో నిట్ ప్రొఫెసర్లు స్థూపం రూపం డిజైన్ చేశారు. స్థపతి శివకుమార్ ఆధ్వర్యంలో స్థూపాన్ని మలిచే పనులు పూర్తయ్యాయి. అమరవీరుల కీర్తి స్థూపం అని పొట్లపల్లి శ్రీనివాస్‌రావు నామకరణం చేశారు. అమరుల త్యాగాలు స్మరిస్తూ శ్రీనివాసరావు రాసిన నాలుగు వాక్యాలు స్థూపంపై చెక్కిస్తున్నాం. పార్లమెంట్, అసెంబ్లీల్లో కూడా అమరులగురించి కనీసం ప్రస్తావించకున్నా కలెక్టర్ స్పందించిన తీరు అభినందనీయం. తెలంగాణ పది జిల్లాల్లో అవతరణ రోజు ఇలాంటి కార్యక్రమం ఎక్కడా చేపట్టడంలేదు. జిల్లాకు గర్వకారణం.
     
    అమరుల త్యాగాలు మరవొద్దు
     
    29వ రాష్ట్రంగా తెంగాణ ఏర్పాడుతున్నా అభివృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలి. అప్పుడే అమరులకు నిజమైన నివాళి. వారు కలలుగన్న తెలంగాణకోసం ప్రతి ఒక్కరూ అకుంటిత దీక్షతో పనిచేయాల్సి ఉంటుంది. అందుకే స్థూపం చూసినప్పుడు వారి త్యాగాలు మన కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. అందుకే ఆవిష్కరణ అనంతరం అక్కడ ప్రతిజ్ఞచేస్తున్నాం.

    స్ఫూర్తినిచ్చిన ఉద్యోగుల ఐక్యత
     
    పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేసుకునేందుకు ప్రతీ ఉద్యోగి రోజుకు రెండుగంటలు అదనంగా పనిచేసేం దుకు సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగుల పాత్ర ఎంతో ముఖ్యమైంది. మన జిల్లాలో ఉద్యోగుల మధ్య మంచి ఐక్యత ఉం టుంది. ఎలాంటి కార్యక్రమమైనా సునాయాసంగా చేయగలరు. లక్ష గళారచ్చన.. సకలజ నుల సమ్మె.. సహాయనిరాకరణ.. ఇలా ఏదైనా కావచ్చు ఉద్యోగుల ఐక్యత వల్లే విజయవం తం అయ్యాయి. రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం
     
    స్థూపంపై అమరులందరి పేర్లూ ఉండాలని..
     
    ప్రస్తుతం తయారు చేస్తున్న అమరవీరుల జా బితా అధికారికం కాదు. రాష్ట్ర ఏర్పాటు తరువాత అమరవీరులను గుర్తించేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ కమిటీ అధికారికంగా తెలంగాణ అమరవీరుల జాబితా సిద్ధిం చేస్తుంది. గెజిట్‌లో పొందుపరిచాక తెంగాణ రాష్ట్రంలోని అమరవీరుల పేర్లన్నీ కీర్తి స్థూపంపై రాయిస్తాం. అందుకు అనుగుణంగా ప్రస్తుతం చెక్కడం చేయించాం.
     
    ‘వరంగల్ యాది’ డాక్యుమెంటరీ సిద్ధం
     
    తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా పాత్రను ఆవిష్కరిచే విధంగా 8 నిమిషాల నిడివిగల ‘వరంగల్ యాది’ పేరుతో డాక్యుమెంటరీ చిత్రం రూపొందించారు. ఏపీఆర్వో ఈవీ కిరణ్‌మయీ, ఐకేపీ ల్యాండ్ డీపీఎం నళినీనారాయణ, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తయింది. దీన్ని కలెక్టర్ ఆవిష్కరిస్తారు.
     
    జయశంకర్ స్మృతివనంపై దృష్టి

     
    ఇక సమితి తరువాతి కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సృ్మతివనం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, సూబేదారిలోని మాదన్న విగ్రహం వద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేట్టాలని నిర్ణయించాం. మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement