సాంకేతికతతోనే అభివృద్ధి
– జి.పుల్లారెడ్డి ప్రారంభమైన జాతీయ క్రియశాల జిగ్‌నాసా–2016
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మావన వనరుల శాఖాధికారి డాక్టర్ కె. పాండు రంగారావు అన్నారు. సోమవారం జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల జాతీయ క్రియశాల జిగ్‌నాసా–2016 వర్కుషాప్ ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతోందని, రోజుకో పరిజ్ఞానం ఆవిష్కరణ అవుతోందన్నారు. వీటిని ఎప్పటికప్పుడు విద్యార్థులు ఒంటబట్టించుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంతరం వర్కుషాప్‌కు హాజరైన నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఇంజినీరింగ్ చదువుతున్న 470 మంది పేపర్ ప్రజేంటేషన్ చేశారు. కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ పి.జయరామిరెడ్డి పాల్గొన్నారు.