రూ. కోటికి పైగా జీతంతో జాబ్స్.. ఏకంగా 85 మందికి.. | IIT Bombay Records 85 Job Offers Over Rs 1 Crore Per Annum - Sakshi
Sakshi News home page

రూ. కోటికి పైగా జీతంతో జాబ్స్.. ఏకంగా 85 మందికి..

Published Fri, Jan 5 2024 3:26 PM | Last Updated on Fri, Jan 5 2024 3:58 PM

85 IIT Bombay Students Get Job Offers Over Rs 1 Crore Packages - Sakshi

భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన బాంబే, ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) 2023-24 ప్లేస్‌మెంట్ సీజన్ ఫేజ్-1లో 85 మంది విద్యార్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక ప్యాకేజీలతో జాబ్ ఆఫర్‌లను పొందారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఐఐటీ బాంబే ఇన్‌స్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 388 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. ఇందులో యాక్సెంచర్, ఎయిర్‌బస్, యాపిల్, బార్‌క్లేస్, గూగుల్, జెపి మోర్గాన్ చేజ్, మైక్రోసాఫ్ట్, టాటా గ్రూప్ వంటి ప్రముఖ రిక్రూటర్‌లు ప్లేస్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఉన్నాయి.

రిక్రూట్‌మెంట్‌లో 1,340 మంది విద్యార్థులు హాజరు కాగా, ఇందులో 1,188 మంది ఉద్యోగాలు సాధించారు. ఇందుకో కూడా ఎక్కుమంది ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో ఉద్యోగాలు సాధించారు. ఆ తరువాత ఐటీ/సాఫ్ట్‌వేర్‌, ఫైనాన్స్‌/బ్యాంకింగ్‌/ ఫిన్‌టెక్‌, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌, డేటా సైన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, డిజైన్‌ వంటి వాటిలో ఉద్యోగాలు పొందారు.

సగటు ప్యాకేజీ వివరాలు

  • ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ: రూ. 21.88 లక్షలు
  • ఐటీ/సాఫ్ట్‌వేర్: రూ. 26.35 లక్షలు
  • ఫైనాన్స్: రూ. 32.38 లక్షలు
  • కన్సల్టింగ్: రూ. 18.68 లక్షలు
  • రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్: రూ. 36.94 లక్షలు

ఇదీ చదవండి: గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్‌

కొన్ని సంస్థలు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించగా.. మరికొన్ని సంస్థలు వర్చువల్‌గా పాల్గొన్నాయి. జపాన్, తైవాన్, సౌత్ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, హాంకాంగ్‌ వంటి అంతర్జాతీయ స్థానాల్లో 63 మంది ఉద్యోగాలు సాధించారు. ఎంపికైన మొత్తం 1188 మంది విద్యార్థుల్లో ఏడు మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో, 297 మంది ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్‌లను పొందారు. గతంలో ఎన్నికైన ఉద్యోగులతో పోలిస్తే.. ఈ సారి ఎంపికైన ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement