parking fee
-
పార్కింగ్ బాధ్యత యజమానులదే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్‌లు, సినిమా థియేటర్లు.. తదితర చోట్ల వినియోగదారులకు పార్కింగ్ వసతి కల్పించాల్సిన బాధ్యత వాటి యజమానులదే అని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెయింటనెన్స్ పేరు చెప్పి పార్కింగ్ ఫీజు వసూలు చేయడాన్ని తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అక్రమంగా పార్కింగ్ ఫీజుల వసూలు విషయం న్యాయ మూర్తుల దృష్టికి రావడంతో హైకోర్టు ఈ అంశాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)గా విచారణకు స్వీకరించింది. దీనిపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్‌లు, సినిమా థియేటర్లు.. లాంటి భవనాలను నిర్మించే సమయంలోనే మున్సిపల్ నిబంధనల ప్రకారం పార్కింగ్ సదుపాయం ఉందా? లేదా? అని చూసిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అక్రమంగా ఫీజు వసూలు చేయడం గతంలో తాము ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మున్సిపల్ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ ప్రణాళిక శాఖ డైరెక్టర్‌తో పాటు రెవెన్యూ, హోం శాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది. -
బంజారాహిల్స్: రూ. 20 పార్కింగ్ ఫీజుకు రూ. 50 వేల జరిమానా
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లుగా సోషల్ యాక్టివిస్ట్ విజయ్‌గోపాల్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సదరు ఆస్పత్రికి రూ. 50 వేల జరిమానా విధించింది. వివరాలివీ... ఈ నెల 15వ తేదీన రోగిని చూసేందుకు వచ్చిన సహాయకుడు తన స్కూటర్‌ను ఆ కార్పొరేట్ ఆస్పత్రి పార్కింగ్ ఆవరణలో పార్కింగ్ చేసి వెళ్లాడు. చదవండి: హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు అరగంటసేపు పార్కింగ్‌లో ఉంచినందుకుగాను రూ. 20 ఫీజు వసూలు చేశారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా విజయ్‌గోపాల్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ సెల్ మంగళవారం ఆస్పత్రిలో పార్కింగ్ ఫీజు వసూలు చేసినందుకు సదరు ఆస్పత్రికి రూ. 50 వేల జరిమానా విధిస్తూ ఈ–చలానా జారీ చేసింది. చదవండి: హుజుర్నగర్లో వింత కేసు.. పోలీస్‌స్టేషన్‌కు చేరిన పిల్లి పంచాయితీ.. -
సామాన్య భక్తురాలిగా వచ్చి.. కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని..
సాక్షి, వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులు వాహనాల పార్కింగ్ పేరిట దోపిడీకి గురవుతున్న వైనంపై వచ్చిన ఫిర్యాదులపై ఈవో రమాదేవి స్పందించారు. గురువారం ఉదయం సామాన్య భక్తురాలిగా వచ్చిన ఈవో పార్కింగ్ టెండర్ కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వేములవాడలో రాజన్న ఆలయ టీటీడీ ధర్మశాలల పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలుపుకునేందుకు రూ.30 పార్కింగ్ ఫీజు వసూలు చేయాలి. కానీ కాంట్రాక్టర్ రూ.100 వసూలు చేస్తున్నట్లు ఈవో రమాదేవికి ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం సామన్య భక్తురాలిగా ఓ ప్రైవేట్ వాహనంలో వచ్చిన ఈవో రూ.100 పార్కింగ్ ఫీజు చెల్లించి, కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఈవో రమాదేవి మాట్లాడుతూ.. పబ్బ లచ్చయ్య, పబ్బ శ్రీనాథ్‌లకు చెందిన పార్కింగ్ ఫీజు, టెంకాయ టెండర్లను రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ముగిసే వరకు ఉచిత పార్కింగ్, నాంపల్లి గుట్టపైకి ఉచితంగా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: హైదరాబాదీలకు ఊరట.. నగరంలో మరో రైల్వే టర్మినల్ రూ.30కి బదులు రూ.100 వసూలు వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలకు టీటీడీ ధర్మశాలల ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఇందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ రూ.30 చొప్పున వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్ దేవస్థానం అధికారులు ముద్రించిన రూ.30 టికెట్ల స్థానంలో రూ.100 టికెట్లు ముద్రించి అందినంత దండుకుంటున్నారు. టెంకాయ టెండర్ రద్దు భక్తులకు ఉచితంగా టెంకాయకొట్టే నిబంధనలు అమలులో ఉండగా, రాజన్న ఆలయంలో భక్తుల నుంచి బలవంతంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు ఈవో గురువారం గుర్తించారు. వెంటనే సంబంధిత టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులెవరూ డబ్బులు ఇవ్వవద్దని కోరారు. చదవండి: కరీంనగర్: గజానికి రూ.37,400.. ఎకరానికి 3.30కోట్లు -
వాణిజ్య భవనాలు, నివాస సముదాయాల్లో ఫాస్టాగ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చాలా మందికి ఫాస్టాగ్ చెల్లింపులు అంటే టోల్గేట్ ఫీజు వేగంగా చెల్లించే విధానంగానే పరిచయం. కానీ ఇప్పుడు ఫాస్టాగ్ విధానాన్ని అనేక కమర్షియల్, రెసిడెన్షియల్ కాంప్లెక్సులలో కూడా అమలు చేస్తున్నారు. ఈ సేవలు మరింత సమర్థంగా సులువుగా అందించేందుకు వీలుగా ఎయిర్టెల్ సంస్థ రంగంలోకి దిగింది. పార్కింగ్ ఫీజుల చెల్లింపు విభాగంలో అగ్రగామిగా ఉన్న పార్క్ ప్లస్‌తో జట్టుకట్టింది. ఇందులో భాగంగా వాణిజ్య భవనాలు, నివాస సముదాయాల్లో ఫాస్టాగ్ ఆధారిత స్మార్ట్ పార్కింగ్ సేవలను విస్తరిస్తారు. దేశవ్యాప్తంగా పార్క్ ప్లస్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్ 1,500 సొసైటీలు, 30కిపైగా మాల్స్, 150 పైచిలుకు కార్పొరేట్ కార్యాలయాల్లో వినియోగిస్తున్నారు. ఫాస్టాగ్ జారీలో దేశంలో టాప్–5లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. వేచి ఉండక్కర్లేదు దేశవ్యాప్తంగా చాలా కమర్షియల్ కాంప్లెక్సులో మెట్రో సిటీల్లో అనేక రెసిడెన్షియల్ కాంప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ పార్కింగ్ ప్లేస్‌లో ఫీజు చెల్లింపు సేవలను పార్క్ వన్ సంస్థ అందిస్తోంది. తాజాగా ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో జత కట్టింది. దీంతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి నేరుగా పార్కింగ్ ఫీజును చెల్లింపు జరిగిపోతుంది. దీని వల్ల పార్కింగ్ ప్లేస్‌లో ఫీజు చెల్లింపు కోసం ఎక్కువ సమయం వేచి ఉండక్కర్లేదు. చదవండి: పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్, ప్రారంభించిన పేటీఎం -
ఇకపై థియేటర్స్‌లో పార్కింగ్ ఫీజు కట్టాల్సిందే!
సాక్షి, హైదరాబాద్ : సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద యాజమాన్యం పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జీవో నెం.63ను సవరించింది. అయితే మల్టీఫ్లెక్స్ లు, వ్యాపార వాణిజ్య సంస్థల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని ప్రభుత్వం ఆదేశించింది. మల్టీఫ్లెక్స్ లకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులే అమలవుతాయన్న ప్రభుత్వం..పార్కింగ్ ఫీజు ధరలను థియేటర్ యాజమాన్యాలకే వదిలేసింది. గతంలో 2018లో కారుకు రూ.30, ద్విచక్రవాహనాలకు రూ. 20లను థియేటర్ యాజమాన్యాలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఉత్వర్వుల నేపథ్యంలో గతంలో కంటే పార్కింగ్ ఫీజులు తగ్గిస్తామని థియేటర్ యాజమాన్యాల వెల్లడించాయి. ఇక ఈ నెల 23నుంచి తెలంగాణలో థియేటర్లు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి. కాగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు సినిమాలు ఓటీటీని ఆశ్రయించాయి. అయితే నాగచైతన్య ‘లవ్‌స్టోరి’, నాని ‘టక్ జగదీష్’ సహా మరికొన్ని పెద్ద సినిమాలు మాత్రం థియేటర్ రిలీజ్ కోసం వేచి ఉన్నాయి. క్యూలో ఉన్న సినిమాలన్నీ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
జేబీఎస్, ఎంజీబీఎస్: బండి పెడితే బాదుడే..
‘బోయిన్‌పల్లికి చెందిన ప్రవీణ్ సిద్ధిపేట సమీపంలోని కొండపాకలో పని చేస్తాడు. ప్రతి రోజు ఉదయం జేబీఎస్ నుంచి బస్సులో వెళ్లి తిరిగి సాయంత్రం నగరానికి చేరుకుంటాడు. అప్పటి వరకు అతని బైక్ జేబీఎస్ పార్కింగ్‌లో ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్కింగ్ చేసినందుకు ప్రతి రోజు రూ.40 వరకు పార్కింగ్ ఫీజు చెల్లించవలసి వస్తుంది. బండి పెట్టాలంటేనే భయమేస్తుంది. ఒక్క నిమిషం తేడా ఉన్నా రూ.10 అదనంగా తీసుకుంటారు. ఇదేమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు..’ అంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. సాక్షి, హైదరాబాద్: ఒక్క ప్రవీణ్ మాత్రమే కాదు. జూబ్లీబస్‌స్టేషన్, మహాత్మాగాంధీ బస్స్టేషన్లలో బండి పార్క్ చేస్తే చాలు ప్రయాణికుల జేబులకు చిల్లులు పడాల్సిందే. పార్కింగ్ నిర్వాహకులు అడిగినంతా ఇవ్వలేకపోతే దౌర్జన్యానికి దిగుతున్నారు. పార్కింగ్ ఫీజుల్లో పారదర్శకత కోసం టిమ్స్ యంత్రాలను ప్రవేశపెట్టినప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ప్రతి నిత్యం దోపిడీకి గురవుతున్నారు. జూబ్లీబస్‌స్టేషన్‌లో ఇటీవల పార్కింగ్ దోపిడీకి గురైన ప్రయాణికుడు ఒకరు సామాజిక మాధ్యమాల్లో సైతం ఆందోళన వ్యక్తం చేశారు. లెక్కల్లో చిక్కులు.. బస్స్టేషన్లలో పార్కింగ్ నిర్వహణ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. అయితే పార్కింగ్ ఫీజులను మాత్రం ఆర్టీసీ నిర్ణయిస్తుంది. కానీ అమలుపై ఆ సంస్థ నియంత్రణ కోల్పోతోంది. ద్విచక్ర వాహనాలకు 3 గంటలకు రూ.10 చొప్పున, 15 గంటలకు రూ.30 చొప్పున పార్కింగ్ ఫీజుగా వసూలు చేయాలి. ఒక రోజంతా బండిని పార్క్ చేస్తే రూ.50 చెల్లించాలి. కారు పార్కింగ్‌కు మూడు గంటలకు రూ.20, 15 గంటలకు రూ.50, ఒక రోజంతా కారు పార్క్ చేస్తే రూ.75 మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ పార్కింగ్ ఫీజులు వాహనదారులకు స్పష్టంగా కనిపించకుండా బోర్డులను పార్కింగ్ స్థలాలకు దూరంగా ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఏదో హడావిడిలో ఉండే ప్రయాణికులు పెద్దగా పట్టించుకోకుండానే అడిగినంతా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ పార్కింగ్ ఫీజుల గురించి స్పష్టమైన అవగాహనతో నిలదీస్తే మాత్రం బెదిరింపులకు గురి కావలసి వస్తుంది. మరోవైపు పార్కింగ్ గంటల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. మూడు గంటలపైన ఒక నిమిషం గడిచినా అదనంగా రూ.10 చెల్లించాల్సిందే..ప్రయాణికుడు 15 గంటల పాటు బండి నిలిపినప్పుడు మాత్రమే రూ.30 చెల్లించవలసి ఉండగా, ప్రతి మూడు గంటల చొప్పున లెక్కలు వేసి కనీసం రూ.50 వరకు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అలాగే 24 గంటల వ్యవధిలోనూ మార్పులు చేసి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. చర్యలు శూన్యం... బస్స్టేషన్లలో విక్రయించే తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, స్నాక్స్, టిఫిన్స్‌తో సహా అన్నింటిపైన అధిక ధరలు వసూలు చేసినా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పార్కింగ్ నిర్వాహకుల దోపిడీపై కూడా చర్యలు శూన్యం. ప్రయాణికులు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో మాత్రం నామమాత్రపు జరిమానాలు విధించి వదిలేస్తున్నారు. రేట్లు కనిపించకుండా పెట్టారు జేబీఎస్ లో బండి పార్క్ చేయాలంటే ఆలోచించాల్సి వస్తుంది. రేట్లు కనిపించకుండా ఎక్కడో పైన పెట్టేస్తారు. ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే అదంతే అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతారు. వాళ్లతో గొడవ ఎందుకని అడిగినంతా ఇచ్చి రావాల్సి వస్తోంది. చదవండి: జూబ్లీహిల్స్: లైసెన్స్డ్ గన్‌కు పని చెప్పమంటావా..? బల్దియా చరిత్రలోనే మొదటిసారి.. ప్రతిపక్షాల విమర్శలు -
‘తెర’చాటు దోపిడీ
సగటు మానవునికి వినోదం కలిగించేవి సినిమాలే. కానీ అక్కడకు వెళ్లే ప్రేక్షకుడిని యాజమాన్యాలు పీడించేస్తున్నాయి. అడ్డూ అదుపూ లేని ధరలతో నిలువు దోపిడీ చేస్తున్నాయి. నియంత్రణ లేని చర్యలతో దోచుకుంటున్నాయి. ఇదేమని అడిగితే... అది అంతే... చల్... అంటూ కసురుకుంటున్నారు. వీరి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అందుకే థియేటర్ల యజమానుల ఇష్టారాజ్యం నడుస్తోంది... శృంగవరపుకోట: సామాన్యుడు సరదా కోసం సినిమా హాల్‌కు వెళ్తే... అక్కడ లేనిపోని నిబంధనల పేరిట జేబులు ఖాళీ అవుతున్నాయి. రంగుల రంగస్థలంలో ఆనందిద్దామని వెళ్లే వారికి యాజమాన్యాలు ధరాభారంతో దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. అదనపు వసూళ్లతో నిలువునా దోచేస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన టికెట్ ధరలతో సతమతమవుతున్న వారికి నెలలో ఒక సినిమా చూసేందుకు ఒక కుటుంబానికి రూ.వెయ్యి ఖర్చవుతోంది. ఇది భరించలేని సగటు మనిషి వినోదానికి దూరమవుతున్నాడు. జిల్లాలో గతంలో 76 థియేటర్లు ఉండగా వీటిలో సగానికిపైగా మూతపడ్డాయి. ప్రస్తుతం బొబ్బిలి నియోజకవర్గంలో 8, ఎస్.కోటలో 5, పార్వతీపురంలో 5, గజపతినగరంలో 3, చీపురుపల్లిలో 3, సాలూరులో 5, నెల్లిమర్లలో 3, విజయనగరం జిల్లా కేంద్రంలో 13 థియేటర్లు నడుస్తున్నాయి. వీటిలో సౌకర్యాలు ఎలా ఉన్నా ధరల బాదుడు మాత్రం తప్పడం లేదు. పార్కింగ్‌కు వద్దన్నా.. వదలట్లేదు.. సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్‌కు వచ్చే ప్రేక్షకులు, వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూళ్లు చేయకూడదంటూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జిల్లా అధికారులు, మండల స్థాయి రెవెన్యూ అధికారుల వరకూ అందాయి. అయినా థియేటర్ల యజమానులు మాత్రం వదలటం లేదు. టూవీలర్‌కు రూ.10లు, ఆటో, కార్లకు రూ.20లు చొప్పున వసూలు చేస్తున్నారు. తీసుకున్న సొమ్ముకు కనీసం టోకెన్ ఇచ్చే వ్యవస్థ ఎక్కడా లేదు. క్యాంటీన్లలోనూ దోపిడీ... థియేటర్లలో క్యాంటిన్లను కాంట్రాక్టర్లకు లీజుకు ఇస్తున్నారు. క్యాంటిన్ల నిర్వాహకులు నిర్దేశించిన ధరల కన్నా ఎక్కువ ధరలకు తినుబండారాలు, డ్రింక్స్, బిస్కట్స్, ఐస్‌క్రీమ్స్ వంటివి అమ్ముతున్నారు. క్యాంటిన్ల వద్ద ధరల పట్టికలు ఎక్కడా కానరావు. అడిగితే నచ్చితే కొను..లేదందటే బయటికిపో... అంటూ ప్రేక్షకులకు చీదరింపులే ఎదురవుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన రెవెన్యూ, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు నెలవారీ మామూళ్లు పుచ్చుకుంటూ ఏమీ ఎరగనట్టు నిద్ర నటిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు ఉత్తర్వుల పేరుతో లూఠీ... థియేటర్ల నిర్వహణ పెనుభారం కావటంతో ఉన్న థియేటర్లు కూడా డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోకి పోయాయి. తక్కువ సమయంలో సొమ్ము చేసుకోవాలనే కాంక్షతో కోర్టు ఉత్తర్వులు పేరు చెప్పి టికెట్ల ధరలు అమాంతం పెంచి లూఠీ చేయటంతో సగటు ప్రేక్షకుడు రెండు వారాల వరకూ థియేటర్ల వైపు పోవటం లేదు. ఈ లోగా సినిమా మారిపోయి తమ అభిమాన నటుల చిత్రాలు చూసి ఆనందించే భాగ్యం కూడా సాధారణ ప్రజలకు దక్కటం లేదు. సినిమా పైరసీకి పెరిగిన టికెట్ల ధరలు కూడా కారణమే అని చెబుతున్నారు. నియంత్రణ ఉండాలి.. ఉన్నత వర్గం నుంచి సామాన్యుల వరకూ వినోదం పంచే సాధనం సినిమా. అది అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండాలి. అడ్డగోలు నిబంధనలతో థియేటర్ల ఉనికికి చేటు చేస్తూ, దాన్ని అధిగమించటానికి అధిక వసూళ్లకు పాల్పడటం సరికాదు. సినిమాహాళ్లపై కచ్చితమైన నియంత్రణ ఉండాలి. – సి.హెచ్.పద్మావతి, వైఎస్సార్ సీపీ మహిళా నేత దోపిడీకి అడ్డుకట్ట వేయాలి కోర్టు ఉత్తర్వుల పేరుతో అ«ధిక రేట్లకు టికెట్ల అమ్మకాలు, పార్కింగ్ చార్జీలు, క్యాంటీన్లలో అమ్మకాల పేరుతో జేబులకు చిల్లుపెట్టి సామాన్యుల్ని దోపిడీ చేసే వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలి. సమాజంలో అన్ని వర్గాల వారికి స్వేచ్ఛగా బతికే అవకాశం ఇవ్వాలి. –బుగత అప్పలరాజు, ఎస్.కోట వినోదం సామాన్యుల హక్కు... వినోదం సామాన్యుల హక్కు. సగటు మనిషి సినిమాను చూసే అవకాశం లేకుండా చేయటం నేరం. చట్టాలను సోషల్ మీడియాలో పోస్టు చేసే అధికారులు వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలన్న బాధ్యతను విస్మరించటం సరికాదు. ఉన్న చట్టాలను అమలు చేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ సమన్యాయం జరుగుతుంది. –కె.రామరాజు, న్యాయవాది, ఎస్.కోట -
పార్కింగ్ వసూళ్లు.. హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : వ్యాపార కూడళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఫీజు వసూళ్లను ఎందుకు నివారించలేకపోతున్నారో వివరణ ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ అపార్ట్మెంట్స్ యాక్ట్‌లోని 31వ సెక్షన్‌ను ఉల్లంఘిస్తూ వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్ద ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్ చేసినందుకు ఫీజు వసూలు చేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన ఎం.ఇంద్రసేనచౌదరి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయడం లేదంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. పార్కింగ్ ఫీ వసూళ్లను ఎందుకు నిలువరించలేకపోతున్నారో కౌంటర్ పిటిషన్ల ద్వారా తెలపాలంటూ రెండు రాష్ట్రాలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కె.విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ వాదించబోతుండగా ధర్మాసనం కల్పించుకుని.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పార్కింగ్ ఫీ వసూళ్లను రద్దు చేసినట్లుందని గుర్తు చేసింది. పార్కింగ్ ఫీజు రద్దు చేసినట్లు ప్రకటించినా.. యథావిధిగానే వసూళ్లకు పాల్పడుతున్నారని న్యాయవాది బదులిచ్చారు. ఏపీ ప్రభుత్వంలో అసలు పార్కింగ్ ఫీజు రద్దుపై ఏ చర్యలు లేవన్నారు. కొన్ని వ్యాపార భవన సముదాయాలనే ప్రతివాదులుగా ఎందుకు చేర్చారని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. అధికారులకు నోటీసులు ఇచ్చి వివరాలు తెప్పించుకుంటామని స్పష్టం చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
నాలుగింతలు పెరిగిన పార్కింగ్ ఫీజు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో తీవ్ర స్థాయికి చేరిన కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగించిన నేపథ్యంలో వాహనాల పార్కింగ్ ఫీజును నాలుగు రెట్లు పెంచాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకుంది. సుప్రీంకోర్టు నియమించిన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ(ఈపీసీఏ)తో మంగళవారం సమావేశమైన అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రజలు సొంత వాహనాలను వాడకుండా చేసేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పార్కింగ్ ఫీజును నాలుగు రెట్లు పెంచాలని తీర్మానించారు. రాజధానిలో కాలుష్య స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతుండటంపై అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీపావళి తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈపీసీఏ కమిటీ సమావేశంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు వాహనాల ఉపయోగాన్ని నిరోధించేందుకు ప్రజారవాణాను తక్షణమే మెరుగు పర్చాలని ఆదేశించింది. కీలక సమయాల్లో (పీక్ అవర్స్) కనీసం పది గంటల పాటు ఢిల్లీ మెట్రో రేట్లను తగ్గించాలని సిఫారసు చేసింది. అలాగే వాహనాల సరి-బేసి నంబర్ల స్కీమ్‌ను పునరుద్ధరించాలని గ్రీన్ ప్యానెల్ కోరింది. అలాగే పరిస్థితి మరింత దిగజారకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు సాయంత్రానికి పొల్యూషన్‌పై ఒకనివేదిక సమర్పించాలని ఢిల్లీ ఉపముఖ్య మంత్రి మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు. దాదాపు 8వేల మాస్క్‌లను సీఐఎస్ఎఫ్ జవాన్లను పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఢిల్లీలో ప్రమాదస్థాయికి చేరిన కాలుష్యంతో తీవ్రమైన పొగమంచు కప్పేసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంగళవారం హెచ్చరికలు చేసింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో అతి భయంకరమైన గాలి నాణ్యత మరింత క్షీణించింది. -
ఇక పార్కింగ్ చార్జీలు ఇలా కట్టొచ్చు!
న్యూఢిల్లీ: ఇక విమానాశ్రయాల్లో పార్కింగ్ చార్జీలను సులువుగా చెల్లించవచ్చు. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు పార్కింగ్ చార్జీలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అందుబాటులోకి తీసుకువస్తున్నది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్య తలెత్తకుండా ఉండేందుకు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో పార్కింగ్ చార్జీలను ఈ నెల 28 (సోమవారం) అర్ధరాత్రి వరకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ 29 (మంగళవారం) నుంచి డిజిటల్ చెల్లింపుల విధానం విమానాశ్రయాల్లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న అన్ని విమానాశ్రాయల్లో దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, కారు పార్కింగ్ చార్జీలను డెబిట్/క్రెడిట్ కార్డులను, పేటీఎం, ఫ్రీచార్జ్‌లను ఉపయోగించి ఈ-పేమెంట్ చేయవచ్చునని ఏఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రకటించిన ఉచిత పార్కింగ్ సేవలు ఈ నెల 29తో ముగియనున్నాయని పేర్కొంది. -
రిమ్స్ లో పార్కింగ్ దోపిడీ
ఆస్పత్రికి చెల్లించేది రూ.4వేలు.. కాంట్రాక్టర్‌కు రూ.లక్షలు వాహనదారుల నుంచి రూ.10 చొప్పున వసూలు పాతటెండర్పైనే మరొకరికి టెండర్ అప్పగింత సినిమా టాకీస్‌లో వసూలు చేస్తలేరా.. : డెరైక్టర్ అశోక్ ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రమైన రిమ్స్ ఆస్పత్రిలో పార్కింగ్ ఫీజు పేరిట దోపిడీ దందా యథేచ్ఛగా సాగుతోంది. రోగులు, వారి బంధువుల జేబులకు చిల్లు పడుతోంది. తీరా చూస్తే రిమ్స్ ఆస్పత్రికి రూ.4 వేలు మాత్రమే ఆదాయం వస్తోంది. కాని కాంట్రాక్టర్‌కు రూ.లక్షల్లో కాసుల వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి నిత్యం వందలాది రోగులు, వారి బంధువులు వాహనాలపై వచ్చి వెళ్తుంటారు. ఇటీవల ఎమర్జెన్సీ వార్డు ఎదుట పార్కింగ్ స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనానికి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. సమీపంలో వాహనాలు నిలుపకుండా కట్టుదిట్టం చేశారు. ప్రతి రోజు 300కు పైగా ద్విచక్ర వాహనాలు వచ్చి వెళ్తుంటారుు. ఈ లెక్కన సుమారు రోజుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పార్కింగ్ ఫీజు వసూలయ్యే అవకాశం ఉంది. ఇంత వసూలు చేస్తున్నా.. పార్కింగ్ కాంట్రాక్టర్ రిమ్స్‌కు చెల్లించేది ఎంతో తెలుసుకుంటే ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. నామామాత్రంగా నెలకు రూ.4 వేలు రిమ్స్‌కు చెల్లిస్తున్నారు. ‘‘నామినల్‌గా రూ.4 వేలు చెల్లిస్తున్నారు..’’అని రిమ్స్ డెరైక్టర్ అశోక్ నోటివెంటే రావడం గమనార్హం. టెండర్ అప్పగింతలోనూ అనుమానాలే.. నెలకు రూ.4 వేల చొప్పున రిమ్స్‌కు చెల్లించే విధంగా పార్కింగ్ స్టాండ్ కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిమ్స్ అధికారులు.. అటు కాంట్రాక్టర్ మధ్య లోపారుుకారి ఒప్పందం ఉందేమోననే అనుమానాలు లేకపోలేదు. గత సంవత్సరం పార్కింగ్ స్టాండ్ కోసం టెండర్ పిలిచినట్లు రిమ్స్ డెరైక్టర్ చెబుతున్నారు. అందులో ఒక వ్యక్తి టెండర్ రూ.5 వేలకు అప్పగించగా.. ఆయన మూడు నెలలపాటే నిర్వహించి మూసివేశాడని, నిర్వహణ సాధ్యం కాలేదని అంటున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు పార్కింగ్ స్టాండ్ ఎవరూ నడుపలేదని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు మళ్లీ పార్కింగ్ స్టాండ్‌ను ప్రారంభించాలనుకుంటే పేపర్ ప్రకటన ఇచ్చి ఆసక్తి గల కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలి. అలా కాకుండా అప్పట్లో రెండో స్థానంలో నిలిచిన కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని టెండర్‌ను కొనసాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్కూటరుంటే పేదవారు కాదట..! ‘రిమ్స్‌కు ద్విచక్ర వాహనంపై వచ్చే పేషెంట్లు, సంబంధీకులు పార్కింగ్ ఫీజు కింద రూ.10 కూడా చెల్లించుకోలేరా.. సినిమా టాకీస్‌లో రూ.20 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు.. సైకిల్ ఉన్నవారు పేదవారనుకోవచ్చు.. స్కూటర్ ఉన్నవారు కూడా పేదవారంటే ఎలా..?’ ఇదీ రిమ్స్ ఆస్పత్రిలో పార్కింగ్ ఫీజు రూ.10 విషయమై రిమ్స్ డెరైక్టర్ అశోక్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ఆయన ఇచ్చిన సమాధానం. బయట ఖరీదైన వైద్యం చేయించుకోలేక రిమ్స్‌కు వస్తున్నవారంతా సంపన్నులా అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
ప్రభుత్వ పార్కింగ్ స్థలం వారిదే!
అబిడ్స్: అధికారులు ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలం వారిదే అన్న తీరుగా.. వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అబిడ్స్ పోలీసులు అరెస్టుచేశారు. జీహెచ్ఎంసీ 8వ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బాబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబిడ్స్ జగదీష్ మార్కెట్లో కొన్ని నెలలుగా ప్రతిరోజూ వందలాది వాహనాల వద్ద పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్న ఫైజుల్, ఎం. మఫీలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే ఈ విషయమై కొంతమంది స్థానిక వ్యాపారస్తులు, సన్నిహితులు వారిని విడిచిపెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. అంతేగాక చార్మినార్ మజ్లిస్ ఎమ్మెల్యే పాషాఖాద్రీకి కూడా వారు ఫిర్యాదు చేశారు. అయితే, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, అబిడ్స్ ఏసీపీ రాఘవేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌లు ఎమ్మెల్యేకు వారిద్దరినీ ఎందుకు అరెస్టు చేశామో వివరించారు. ప్రజలకు ఉచిత పార్కింగ్ జీహెచ్ఎంసీ కల్పిస్తే ఎందుకు పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారని పోలీసు అధికారులు ఈ విషయమై ప్రశ్నించిన ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో తనకేమీ తెలియదంటూ ఆయన వెళ్లిపోయారు. ఇద్దరు నిందితులపై పోలీసులు పలు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.