
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చాలా మందికి ఫాస్టాగ్ చెల్లింపులు అంటే టోల్‌గేట్ ఫీజు వేగంగా చెల్లించే విధానంగానే పరిచయం. కానీ ఇప్పుడు ఫాస్టాగ్ విధానాన్ని అనేక కమర్షియల్, రెసిడెన్షియల్ కాంప్లెక్సులలో కూడా అమలు చేస్తున్నారు. ఈ సేవలు మరింత సమర్థంగా సులువుగా అందించేందుకు వీలుగా ఎయిర్‌టెల్ సంస్థ రంగంలోకి దిగింది. పార్కింగ్ ఫీజుల చెల్లింపు విభాగంలో అగ్రగామిగా ఉన్న పార్క్ ప్లస్‌తో జట్టుకట్టింది. ఇందులో భాగంగా వాణిజ్య భవనాలు, నివాస సముదాయాల్లో ఫాస్టాగ్ ఆధారిత స్మార్ట్ పార్కింగ్ సేవలను విస్తరిస్తారు. దేశవ్యాప్తంగా పార్క్ ప్లస్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్ 1,500 సొసైటీలు, 30కిపైగా మాల్స్, 150 పైచిలుకు కార్పొరేట్ కార్యాలయాల్లో వినియోగిస్తున్నారు. ఫాస్టాగ్ జారీలో దేశంలో టాప్–5లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది.
వేచి ఉండక్కర్లేదు
దేశవ్యాప్తంగా చాలా కమర్షియల్ కాంప్లెక్సులో మెట్రో సిటీల్లో అనేక రెసిడెన్షియల్ కాంప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ పార్కింగ్ ప్లేస్‌లో ఫీజు చెల్లింపు సేవలను పార్క్ వన్ సంస్థ అందిస్తోంది. తాజాగా ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో జత కట్టింది. దీంతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి నేరుగా పార్కింగ్ ఫీజును చెల్లింపు జరిగిపోతుంది. దీని వల్ల పార్కింగ్ ప్లేస్‌లో ఫీజు చెల్లింపు కోసం ఎక్కువ సమయం వేచి ఉండక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment