Parle biscuit packet
-
పార్లేజీ పాప మాయం! సర్ప్రైజ్ ఇచ్చిన బిస్కెట్ కంపెనీ
ప్రముఖ బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లే గురించి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్లపై ఉండే పాప బొమ్మ బాగా పాపులర్. అయితే పార్లేజీ కంపెనీ ఉన్నట్టుండి సర్ప్రైజ్ ఇచ్చింది. తమ పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ కవర్‌పై పాప బొమ్మను మార్చేసింది. ఆ స్థానంలో ఓ ఇన్ఫ్లుయన్సర్ ఫొటోను తీసుకొచ్చింది. అయితే పార్లేజీ ఇదంతా చేసింది ఇన్స్టాగ్రామ్ పేజీలో. జెరాన్ జే బున్‌షా అనే ఇన్ఫ్లుయన్సర్ పోస్ట్ చేసిన ఓ వైరల్ వీడియోకు స్పందనగా పార్లేజీ.. తమ బిస్కెట్ ప్యాకెట్‌పై ఆయన ఫొటో ఉన్నట్లు రూపొందించి షేర్ చేసింది. తాజాగా జెరాన్ జే బున్‌షా పార్లేజీపై తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘ఒక వేళ మీరు పార్లే ఓనర్‌ను కలిస్తే ఏమని పిలుస్తారు.. పార్లే సర్, మిస్టర్ పార్లే అనా లేక పార్లే జీ అనా?’ అంటూ అయోమయంలో ఉన్నట్లు వీడియో రూపొందించి షేర్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. అధిక సంఖ్యలో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. చివరికి పార్లే కంపెనీ కూడా స్పందించింది. బిస్కెట్ ప్యాకెట్‌పై ఆ ఇన్ఫ్లుయన్సర్ ఫొటోను వేసినట్లుగా చిత్రాన్ని రూపొందించి తమ ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Parle-G (@officialparleg) -
Parle: బిస్కట్ ధరలు కూడా పెరిగాయ్
Parle Products hikes : ఆహారోత్పత్తుల తయారీలో ఉన్న పార్లే ప్రొడక్టŠస్ అన్ని విభాగాల్లో 5–10 శాతం ధరలు పెంచింది. చక్కెర, గోధుమలు, వంట నూనెల వ్యయం అధికం కావడం వల్లే ధరలు సవరించినట్టు కంపెనీ ప్రకటించింది. గోధుమలు, చక్కెర ధర గతేడాదితో పోలిస్తే 8–10 శాతం పెరిగిందని పార్లే ప్రొడక్టŠస్ సీనియర్ క్యాటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. వీటిపైన రూ.20 ఆపై ధర గల బిస్కట్స్, ఇతర ఉత్పత్తులు ప్రియం అయ్యాయి. రూ.20 లోపు ధర గల ఉత్పత్తుల బరువు తగ్గింది. ఈ ఏడాది జనవరి–మార్చిలో సైతం కంపెనీ ఉత్పత్తుల ధరను పెంచింది. -
వింత నమ్మకం.. పెరిగిన పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు
పట్న: మన దగ్గర అప్పుడప్పుడు వింత వింత పుకార్లు వ్యాప్తి అవుతుంటాయి. ఆడపడుచులకు గాజులు పెట్టించాలి.. ఒక్కడే మగ పిల్లాడు ఉన్న తల్లి వేప చెట్టుకు నీళ్లు పోయాలని.. ఇలా వింత వింత పుకార్లు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఇలా వెలుగులోకి వచ్చిన ఓ పుకారు వల్ల పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు పెరిగాయి. పుకారు వల్ల బిస్కెట్ల అమ్మకాలు ఎలా పెరిగాయా అని ఆలోచిస్తున్నారు. అదే తెలియాలంటే ఈ వార్త చదవాలి. తాజాగా బిహార్‌లో ఓ వింత పుకారు వెలుగులోకి వచ్చింది. దాని సారంశం ఏంటంటే.. జితియా పండగ నాడు మగపిల్లలు పార్లేజీ బిస్కెట్లు తప్పక తినాలి. లేదంటే వారికి భవిష్యత్తులో తీవ్ర సమస్యలు తలెత్తుతాయి అని పుకారు మొదలయ్యింది. దాంతో జనాలు ఎగబడి మరీ పార్లే బిస్కెట్లు కొన్నారు. దీని వల్ల ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదు. కంపెనీకి మాత్రం అమ్మకాలు పెరిగి లాభాలు వచ్చాయి. (చదవండి: గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలి.. నిందితుడికి కోర్టు ఆదేశం) తొలుత ఈ పుకారు సీతామర్హి జిల్లాలో వినిపించింది. దాంతో జనాలు పార్లే జీ బిస్కెట్ల కోసం షాపుల వద్దకు పరుగులు తీశారు. ఈ పుకారును జనాలు ఎంత బలంగా నమ్మారు అంటే.. సీతామర్హి ప్రాంతంలోని పలు దుకాణాల ముందు పెద్ద పెద్ద క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. లైన్లలో ఉన్నవారంతా బిస్కెట్ల కోసం వచ్చినవారే కావడం గమనార్హం. జనాలు బిస్కెట్ల కోసం ఇలా ఎగబడటంతో చాలా షాపుల్లో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. నెమ్మదిగా ఈ పుకారు కాస్త బైర్గానియా, ధేంగ్, నాన్పూర్, దుమ్రా, బజ్‌పట్టి ప్రాంతాలకు వ్యాపించింది. ఇంకేముంది దీన్ని గుడ్డిగా నమ్మిన జనాలు.. పార్లేజీ బిస్కెట్ల కోసం షాపుల వద్దకు పరిగెత్తారు. ఆ తర్వాత ఈ పుకారు మరో నాలుగు జిల్లాలకు వ్యాపించింది. అక్కడ కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. ఎందుకు ఇలా బిస్కెట్ల కొంటున్నారని జనాలను అడిగితే.. ‘‘జితియా పండగనాడు మగ పిల్లలు పార్లే బిస్కెట్లు తినకపోతే.. వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. అందుకే కొంటున్నాం’’ అని తెలిపారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు షాపు యజమానులు ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్‌ని 50 రూపాయలకు అమ్మడం ప్రారంభించారు. అసలు ఈ పుకారు ఎలా.. ఎవరు వ్యాప్తి చేశారు అనే దాని గురించి మాత్రం తెలయలేదు. (చదవండి: నేను ఇవ్వను.. ప్రధాని నాకోసం ఆ పైసలు పంపారు !) జితియా పండుగ.. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో జితియా పండుగ జరుపుకుంటారు. తల్లులు.. తమ కుమారులు జీవితాంతం సంతోషంగా.. ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ 24 గంటల పాటు ఉపవాసం చేస్తారు. చదవండి: అమ్మాయిలూ ‘జట్టు విరబోసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’ -
లాక్డౌన్ ఎఫెక్ట్ : రికార్డు అమ్మకాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్ సమయంలో వ్యాపారాలు లేక, ఆదాయాలు క్షీణించి పలు కంపెనీలు ఇబ్బందుల్లో పడిపోతే ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ పార్లే జీ మాత్రం గణనీయమైన వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. లాక్డౌన్ మూడు నెలల సమయంలో దేశంలో పార్లే-జి బిస్కెట్ల అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 1938లో ఈ కంపెనీ స్థాపించిన నాటి నుంచి లేనంతగా ఈ మూడు నెలల స్థాయిలో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది. మాతృ సంస్థ, పార్లే ప్రొడక్ట్స్ ఈ నిర్దిష్ట గణాంకాలను వివరించడానికి నిరాకరించి నప్పటికీ, మార్చి- మే నెల మధ్య కాలంలో భారీ అమ్మకాలు జరిగాయని పేర్కొంది. దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పార్లే జీ బిస్కెట్లను పెద్ద మొత్తాల్లో కొని పంపిణీ చేశాయని దీంతో రికార్డు స్థాయిలో సాగాయని కంపెనీ వెల్లడించింది. దేశంలోని 120 ఫ్యాక్టరీల్లో మార్చి 25వ తేదీనుంచే బిస్కెట్ల ఉత్పత్తి ప్రారంభించామని తెలిపింది. కిలో వందరూపాయల లోపు ధరలోనే పార్లే -జి బిస్కెట్లు లభిస్తున్నందున వీటికి మార్కెట్ లో డిమాండు బాగా పెరిగిందని కంపెనీ వివరించింది. (పెట్రో షాక్ : నాలుగో రోజూ) మొత్తం విక్రయాల్లో ఇవి 50 శాతానికి పై మాటేనని, మొత్తం ఆదాయంలో మూడింట ఒక వంతు ఆదాయాన్ని ఆర్జించిందని కంపెనీ సీనియర్ ప్రతినిధి మయాంక్ షా తెలిపారు. ఒక్క పార్లే జీ మాత్రమే కాకుండా తమ ఇతర బిస్కట్ ఉత్పత్తులకు కూడా డిమాండ్ ఊపందుకుందన్నారు. దీంతో మిగతా అన్ని బిస్కెట్ కంపెనీలతో పోలిస్తే అత్యధిక వృద్ధి రేటు సాధించామన్నారు. అలాగే సునామీ భూకంపాలు వంటి ఇతర సంక్షోభాల సమయంలో కూడా పార్లే-జి బిస్కెట్ల అమ్మకాలు పెరిగాయన్నారు. ఈ అసాధారణమైన అమ్మకాలతో పార్లే మార్కెట్ వాటా 4.5 నుండి 5 శాతానికి పెరిగిందన్నారు. గత 30-40 సంవత్సరాలలో, ఈ ఇంతటి వృధ్దిని చూడలేదన్నారు. బ్రాండ్‌పై ప్రజలకున్న నమ్మకానికి తోడు పార్లే జీ బిస్కట్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటం ఇంతటి ప్రాధాన్యతకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మూడు కోట్ల పార్లేజీ బిస్కెట్లను విరాళంగా ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. (మాల్యా అప్పగింత : మరో ఎత్తుగడ) -
రమవ్వ
పార్లే బిస్కెట్ పాకెట్‌పై ఏళ్ల పాటు కనిపిస్తూ వస్తున్న ఆ పాపే ఈ యువతి అనుకునే అవకాశం లేకపోలేదు. అయితే 18 ఏళ్ల రమవ్వకు, పార్లే పాపాయికీ ఏవిధమైన సంబంధమూ లేదు. ఉన్నదొక్కటే. బిస్కెట్లతో రమవ్వ అనుబంధం. నిజానికి అది అనుబంధం కూడా కాదు. పార్లే బిస్కెట్లు ఆమె అనుదిన ఆహారం. ఈ కర్ణాటక అమ్మాయి పుట్టినప్పటి నుంచీ ఈ బ్రాండు బిస్కెట్లే తింటోంది. తల్లి దగ్గర పాలు లేకపోవడంతో బయటి పాలు, పార్లే బిస్కెట్లు అలవాటయ్యాయి రమవ్వకు, ఆమె కవల సోదరుడు రామప్పకు. పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ రామప్ప బిస్కెట్లను మానెయ్యగలిగాడు కానీ, రమవ్వ వాటిని వదల్లేకపోయింది. ఇప్పటికీ ఆమెకు బిస్కెట్లు తప్ప అన్నం సహించదు. పేదరికం వల్ల తల్లిదండ్రులు ఈ అమ్మాయిని వైద్యులకు చూపించలేకపోతున్నారు. బహుశా పార్లే కంపెనీ ఏమైనా ముందుకొస్తుందేమో చూడాలి.